2 రోజుల్లో 39 కోట్లు దాటేసిన డ్యూడ్ కలెక్షన్స్- ప్రదీప్ రంగనాథన్ సినిమా హిట్ కొట్టాలంటే మాత్రం!

ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ డ్యూడ్. కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయం అయిన ఈ సినిమా అక్టోబర్ 17న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది. మమితా బైజు హీరోయిన్‌గా అలరించిన డ్యూడ్ మూవీ రెండు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Oct 19, 2025, 15:05:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా నటించిన డ్యూడ్ చిత్రం అక్టోబర్ 17 థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి మంచి ప్రదర్శనతో దూసుకుపోతోంది. మొదటి రోజు బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న డ్యూడ్ సినిమా రెండో రోజు అయిన శనివారం (అక్టోబర్ 18) కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది.

2 రోజుల్లో 39 కోట్లు దాటేసిన డ్యూడ్ కలెక్షన్స్- ప్రదీప్ రంగనాథన్ సినిమా హిట్ కొట్టాలంటే మాత్రం!
2 రోజుల్లో 39 కోట్లు దాటేసిన డ్యూడ్ కలెక్షన్స్- ప్రదీప్ రంగనాథన్ సినిమా హిట్ కొట్టాలంటే మాత్రం!

డ్యూడ్ నెట్ కలెక్షన్స్

సక్నిల్క్.కామ్ (Sacnilk.com) ప్రకారం ఇప్పటివరకు భారతదేశంలో డ్యూడ్ సినిమా దాదాపు 20 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ సంపాదించింది. ట్రేడ్ వెబ్ సైట్ ప్రకారం రెండో రోజున ఇండియాలో రూ. 10 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే, తొలి రోజున రూ. 9.75 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. వీటిలో తెలుగు నుంచి రూ. 3.25 కోట్లు, తమిళం ద్వారా 6.5 కోట్లు వసూలు చేసింది.

తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్

ఇలా రెండు రోజుల్లో రూ. 19.75 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను సాధించింది డ్యూడ్ సినిమా. అంటే సుమారుగా రూ. 20 కోట్లు. ఇక రెండో రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.8 నుంచి 3 కోట్ల రేంజ్‌లో గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది ఈ సినిమా. రెండు రోజుల్లో కలిపి రూ. 6.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

తెలుగుకు మించి తమిళంలో

తెలుగుకు మించి తమిళంలో 2వ రోజున రూ. 7 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టింది మమిత బైజు డ్యూడ్ మూవీ. అలాగే, వరల్డ్ వైడ్‌గా రూ. 14 కోట్ల గ్రాస్ వసూళ్లను డ్యూడ్ సినిమా రాబట్టింది. దీంతో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా డ్యూడ్ చిత్రానికి రూ. 39.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగా.. రూ. 19.50 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసింది.

డ్యూడ్ బ్రేక్ ఈవెన్ కావాలంటే

ఇదిలా ఉంటే, వరల్డ్ వైడ్‌గా డ్యూడ్ సినిమాకు 59 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా.. రూ. 60 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. దీంతో డ్యూడ్ సినిమాకు బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా రూ. 40.50 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. 40 కోట్లు దాటితేనే డ్యూడ్ హిట్ కొట్టినట్లు అవుతుంది.

డ్యూడ్ థియేటర్ ఆక్యుపెన్సీ

ఇకపోతే ప్రదీప్ రంగనాథన్ సినిమా డ్యూడ్ థియేటర్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. శనివారం రోజున తమిళంలో మొత్తం 55.43 శాతంగా ఉంది. వీటిలో మార్నింగ్ షోలకు 38.33 శాతం, మధ్యాహ్నాం షోలకు 60.69 శాతం, ఈవెనింగ్ షోలకు 54.53 శాతం, నైట్ షోలకు అన్నిటికంటే ఎక్కువగా 68.16 శాతంగా డ్యూడ్ థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More