థియేటర్లలో అదరగొట్టిన తమిళ రొమాంటిక్ కామెడీ బ్లాక్ బస్టర్ ‘డ్యూడ్’ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ సీజన్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓటీటీ రిలీజ్ ల్లో ఇది ఒకటి.
థియేటర్ రెస్పాన్స్

దర్శకుడు కీర్తిశ్వరన్ కోలీవుడ్ అరంగేట్ర చిత్రంగా వచ్చిన డ్యూడ్ సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. ఈ తమిళ రొమాంటిక్ కామెడీ చిత్రం.. ధ్రువ్ విక్రమ్ 'బైసన్: కాలమాడన్', హరీష్ కళ్యాణ్ 'డీజిల్' వంటి ఇతర చిత్రాల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంది. అయినా బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటింది.
డ్యూడ్ ఓటీటీ రిలీజ్
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ 'డ్యూడ్' సినిమా అధికారిక స్ట్రీమింగ్ హక్కులను పొందింది. మీడియా నివేదికల ప్రకారం ఈ చిత్రం హిందీతో సహా పలు భాషల్లో నవంబర్ 14న ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై మేకర్స్, నెట్‌ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికీ ఉన్న సమాచారం ప్రకారం డ్యూడ్ ఓటీటీ రిలీజ్ ఇదేనని తెలిసింది.
డ్యూడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్
ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం 'డ్యూడ్' భారత బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తం రూ. 68.09 కోట్ల నెట్ వసూలు చేసింది. ఈ సినిమా ఇంకా థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. డిజిటల్ ప్రీమియర్ నాటికి దీని సంపాదన మరింత పెరిగే అవకాశం ఉంది. 'డ్యూడ్' ప్రపంచవ్యాప్త కలెక్షన్ ప్రస్తుతం రూ. 106 కోట్ల గ్రాస్‌గా ఉంది. ఇందులో ఓవర్సీస్ వసూళ్లు రూ. 27.4 కోట్లు.
ఇటీవల ట్విట్టర్లో ఒక వీడియో ద్వారా'డ్యూడ్' సినిమాకు వచ్చిన అద్భుతమైన స్పందన పట్ల ప్రదీప్ రంగనాథన్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
{{/usCountry}}ఇటీవల ట్విట్టర్లో ఒక వీడియో ద్వారా'డ్యూడ్' సినిమాకు వచ్చిన అద్భుతమైన స్పందన పట్ల ప్రదీప్ రంగనాథన్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
{{/usCountry}}డ్యూడ్ కథ
“చిన్ననాటి స్నేహితులు అగన్, కురల్ విడదీయరాని బంధాన్ని పంచుకుంటారు. కురల్ ప్రేమ సమస్యల్లో చిక్కుకున్నప్పుడు, ఆమె సంతోషాన్ని కోరుకుంటూనే ఆమెపై తన దాచిన భావాలను అగన్ ఎలా మేనేజ్ చేసుకున్నాడు’’ అన్నదే క్లుప్తంగా డ్యూడ్ మూవీ కథాంశం.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన డ్యూడ్ చిత్రంతో సాయి అభ్యంక్కర్ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. రూ. 25–30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రన్‌టైమ్ 139 నిమిషాలు. ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటించగా.. మమితా బైజు, ఆర్ శరత్ కుమార్, హ్రిదు హరూన్, రోహిణి, ఐశ్వర్య శర్మ, ద్రవిడ్ సెల్వం కీలక పాత్రల్లో నటించారు.