Dulquer Shruti Haasan: శ్రుతి హాసన్ లక్ష్మి బాంబ్ లాంటిది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్.. అప్పుడేమో జాంబీ అంటూ!

Dulquer Shruti Haasan: పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్, గ్లోబల్ బ్యూటీ శ్రుతి హాసన్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం 'ఆకాశంలో ఒక తార'. ఈ సినిమా దీపావళి ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్.. శ్రుతి హాసన్‌ను 'లక్ష్మీ బాంబ్' తో పోల్చడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Published on: Nov 8, 2026, 20:45:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Dulquer Shruti Haasan: 'సీతా రామం', 'లక్కీ భాస్కర్' లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్స్ తో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆయన తదుపరి నటిస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా 'ఆకాశంలో ఒక తార'. పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ శ్రుతి హాసన్ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.

శ్రుతి హాసన్ లక్ష్మి బాంబ్ లాంటిది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్.. అప్పుడేమో జాంబీ అంటూ! (x)
శ్రుతి హాసన్ లక్ష్మి బాంబ్ లాంటిది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్.. అప్పుడేమో జాంబీ అంటూ! (x)

ఆకాశంలో ఒక తార

దుల్కర్ సల్మాన్ అప్ కమింగ్ మూవీ ఆకాశంలో ఒక తారపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శ్రుతి హాసన్ ఓ బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్లు తెలిసింది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ లాంటి బడా బ్యానర్లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఇందులో సాత్విక వీరవల్లి మరో హీరోయిన్ గా కనిపించనున్నారు.

దీపావళి స్పెషల్ ఇంటర్వ్యూ

ఆకాశంలో ఒక తార సినిమా ప్రమోషన్స్ ను మేకర్స్ అప్పుడే వేగవంతం చేశారు. దీపావళి పండుగ సందర్భంగా చిత్ర బృందం యూట్యూబ్‌లో ఒక స్పెషల్ ఇంటర్వ్యూను విడుదల చేసింది. ఈ ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ సాత్విక పాల్గొని తమ వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా విశేషాలను సరదాగా పంచుకున్నారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ చేసిన కామెంట్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి.

శ్రుతి హాసన్ ఒక 'లక్ష్మీ బాంబ్'

ఈ ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్.. శ్రుతి హాసన్ ఎనర్జీ గురించి చెబుతూ ఆమెను ఏకంగా దీపావళి టపాసు అయిన 'లక్ష్మీ బాంబ్' తో పోల్చాడు. యాంకర్ ప్రదీప్ మాచిరాజు లక్ష్మి బాంబ్ ను చూపించారు. అప్పుడు.. "శ్రుతి హాసన్ ఎప్పుడూ ఒక లక్ష్మీ బాంబ్ లాంటిది. ఆమెలో ఎప్పుడూ ఫుల్ ఇంటెన్సిటీ నిండి ఉంటుంది. ఎప్పుడెప్పుడు పేలుదామా అన్నట్లుగా రెడీగా ఉండే లక్ష్మీ బాంబ్ లా ఆమె కనిపిస్తుంది" అంటూ దుల్కర్ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ తో ఇంటర్వ్యూలో నవ్వులు పూశాయి.

చిన్ననాటి స్నేహితులు

దుల్కర్ సల్మాన్, శ్రుతి హాసన్ ఇద్దరూ చెన్నైలో ఒకే స్కూల్ లో చదువుకున్నారు. వీరికి చిన్నప్పటి నుంచే మంచి స్నేహం ఉంది. అప్పట్లో శ్రుతి హాసన్ ను దుల్కర్ 'జాంబీ' (Zombie) అని ఆట పట్టించేవాడట. ఈ విషయాన్ని శృతి హాసన్ కూడా పలు సందర్భాల్లో బయటపెట్టింది.

ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరు 'ఆకాశంలో ఒక తార' సినిమాలో కలిసి నటిస్తుండటంతో.. సెట్స్ లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని సమాచారం. నవంబర్ 20, 2026 న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున థియేటర్లలోకి రానుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More