...
...
Next Story

OTT Release: ఓటీటీలోకి దుల్కర్, పూజా హెగ్డే క్లాసిక్ లవ్ డ్రామా శ్రీశ్రీ-రిలీజ్‌కు ముందే బిగ్ అప్‌డేట్‌-ఎందులో చూడాలంటే?

OTT Release: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా ‘శ్రీశ్రీ’ ఓటీటీపై బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే ఈ న్యూస్ తెగ ట్రెండింగ్ గా మారింది. ఈ సినిమా ఓటీటీ బిజినెస్ గురించి ఇక్కడ చూసేయండి.

Published on: Sep 7, 2026, 11:29:22 IST
Advertisement

OTT Release: టాలీవుడ్‌లో సొంత మార్కెట్ ఏర్పరుచుకున్న మలయాళ వర్సటైల్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, స్టార్ నటి పూజా హెగ్డే జంటగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'శ్రీశ్రీ' (SriSri). రవి నెలకూడితి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ థియేట్రికల్ విడుదలకు ముందే ఓటీటీ డీల్ అదరగొట్టింది.

శ్రీశ్రీ ఓటీటీ

ఓటీటీలోకి దుల్కర్, పూజా హెగ్డే క్లాసిక్ లవ్ డ్రామా శ్రీశ్రీ-రిలీజ్‌కు ముందే బిగ్ అప్‌డేట్‌-ఎందులో చూడాలంటే?
ఓటీటీలోకి దుల్కర్, పూజా హెగ్డే క్లాసిక్ లవ్ డ్రామా శ్రీశ్రీ-రిలీజ్‌కు ముందే బిగ్ అప్‌డేట్‌-ఎందులో చూడాలంటే?

దుల్కర్ సల్మాన్, పూజ హెగ్డే హీరోహీరోయిన్లుగా రెడీ అవుతున్న ‘శ్రీశ్రీ’ మూవీ ఓటీటీ పార్టనర్ లాక్ అయింది. తాజా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ (ఓటీటీ) హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) భారీ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుంది.

కథ ఏమిటంటే?

ఒక అన్ కండీషన్ లవ్, నమ్మకాల కోసం పోరాడే ఒక ప్రేమికుడి ఫీలింగ్స్ కథగా శ్రీశ్రీ మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. తమదైన లోకంలో ప్రేమలో మునిగితేలే ఓ జంట ఎలాంటి ప్రయాణం సాగించిందన్నది ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. ఈ అందమైన ప్రేమ ప్రపంచాన్ని ఒకానొక వ్యక్తి లేదా సంఘటన ఎలా చిన్నాభిన్నం చేసిందనేది ఈ చిత్ర ప్రధానాంశం.

హీరో తాను ప్రాణంగా ప్రేమించిన ప్రేయసిని మాత్రమే కాకుండా, జీవితంలో తాను నమ్మిన సిద్ధాంతాలను, విశ్వసించిన ప్రతి అర్థాన్ని కోల్పోయే ప్రమాదంలో పడినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది దర్శకుడు ఎమోషనల్‌గా తెరకెక్కిస్తున్నారు.

ప్రైమ్ వీడియోనే ఎందుకు?

ఈ ప్రాజెక్ట్‌లో తొలిసారి దుల్కర్, పూజా హెగ్డే కాంబినేషన్ కుదరడం, పూజా హెగ్డేకు టాలీవుడ్‌లో ఇది కీలకమైన కంబ్యాక్ ప్రాజెక్ట్ కావడంతో బిజినెస్ పరంగా భారీ క్రేజ్ ఏర్పడింది. దీనికి తోడు సీనియర్ నటులు జగపతి బాబు, రమ్యకృష్ణలతో పాటు దీక్షిత్ శెట్టి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ సమకూరుస్తున్న సంగీతం ఈ ప్రేమకథకు ప్రధాన ఆకర్షణ కానుంది.

ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?

ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. థియేట్రికల్ విండో ప్రకారం, ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 4 నుంచి 6 వారాల తర్వాతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ప్రసారం కానుంది.

ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే, దీక్షిత్ శెట్టి, రమ్యకృష్ణ, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రవి నెలకూడితి దర్శకత్వం వహిస్తుండగా ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks