...
...
Next Story

ENE 2 Collection: విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది 2 బాక్సాఫీస్ జాతర.. తరుణ్ భాస్కర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్!

Ee Nagaraniki Emaindi Repeat Box Office Collection Day 8: ఈ నగరానికి ఏమైందికి సీక్వెల్‌గా వచ్చిన ఈఎన్ఈ రిపీట్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. నవంబర్ 19న విడుదలైన ఈ చిత్రం తొలి వారంలోనే రూ. 51.8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దర్శకుడు తరుణ్ భాస్కర్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది.

Published on: Nov 27, 2026, 17:12:28 IST
Advertisement

Ee Nagaraniki Emaindi Repeat 8 Days Worldwide Collection: 2016లో తెలుగు సినిమా రొటీన్ మాస్ మసాలా కథలు, కుటుంబ డ్రామాల మధ్య నలుగుతున్న వేళ 'పెళ్లి చూపులు' ఒక కొత్త గాలిలా వచ్చింది. ఫుడ్ ట్రక్ నడిపే ఇద్దరు యువతీయువకుల కథతో తరుణ్ భాస్కర్ టాలీవుడ్‌కు సరికొత్త మేకింగ్ శైలిని పరిచయం చేశారు.

కొత్త తరం దర్శకుడిగా ముద్ర

విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది 2 బాక్సాఫీస్ జాతర.. తరుణ్ భాస్కర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్!
విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది 2 బాక్సాఫీస్ జాతర.. తరుణ్ భాస్కర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్!

ఆ చిత్రంతో విజయ్ దేవరకొండ స్టార్‌డమ్ వైపు అడుగులు వేస్తే, తరుణ్ భాస్కర్ కొత్త తరం దర్శకుడిగా తన ముద్ర వేశారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత 2018లో 'ఈ నగరానికి ఏమైంది' (ENE) సినిమాతో నలుగురు చిన్ననాటి స్నేహితుల షార్ట్ ఫిల్మ్ ప్రయాణాన్ని చూపించి యువతకు ఆల్-టైమ్ ఫేవరెట్‌గా మారారు.

విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమానులను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశారు. అయితే కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్నప్పటికీ, తరుణ్ భాస్కర్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు దక్కలేదు.

2023లో వచ్చిన 'కీడా కోలా' సైతం పరిమిత వసూళ్లతోనే సరిపెట్టుకుంది. ఈ క్రమంలో తరుణ్ భాస్కర్ 'మీకు మాత్రమే చెప్తా', 'సీతారామం' వంటి చిత్రాల్లో నటుడిగా బిజీ అయ్యారు. అసలైన దర్శకుడు తరుణ్ భాస్కర్ మళ్లీ ఎప్పుడు తన మార్క్ సినిమాతో వస్తారా అని హైదరాబాద్ సినీ వర్గాల నుంచి సామాన్య ప్రేక్షకుల వరకు అందరూ ఎదురుచూశారు.

బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు

ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం ఎనిమిది రోజుల్లో రూ. 47.10 కోట్ల వసూళ్లు సాధించింది ఈ నగరానికి ఏమైంది 2 సినిమా. ఈ సారి సుశాంత్ స్థానంలో శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రలో కనిపించగా, మిగతా బృందమంతా తిరిగి సందడి చేసింది.

తరుణ్ భాస్కర్ గత సినిమాలు

తరుణ్ గత చిత్రాల వసూళ్లతో పోలిస్తే ఇది భారీ విజయం. 'పెళ్లి చూపులు' ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్లు వసూలు చేయగా, 'ఈ నగరానికి ఏమైంది', 'కీడా కోలా' చిత్రాలు రూ. 16 కోట్ల లోపే ఆగిపోయాయి. ఇప్పుడు 'ఈఎన్ఈ రిపీట్' ఆ రికార్డులన్నింటినీ చెరిపేసి ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది.

నిజానికి 2007లో శేఖర్ కమ్ముల 'హ్యాపీ డేస్'తో బడ్డీ కామెడీ జోనర్‌కు ప్రాణం పోశారు. ఆ తర్వాత 'హుషారు', 'బ్రోచేవారెవరురా', 'జాతిరత్నాలు', 'మ్యాడ్' వంటి ఎన్నో సినిమాలు ఇదే ఫార్ములాతో వచ్చాయి. అయినా సరే, 'ఈఎన్ఈ రిపీట్' ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది.

సీక్వెల్ విజయానికి అసలు కారణాలివే..

ఈ చిత్రంలో వివేక్ సాగర్ అందించిన సంగీతం మరోసారి ప్రాణం పోసింది. సీక్వెల్‌లో 'టీమ్ కన్యారాశి' సభ్యులు జీవితంలో వేర్వేరు దశల్లో ఉంటారు. 'సైకో' వివేక్ (విశ్వక్ సేన్) తన సినిమా ఫ్లాప్ అవ్వడంతో అప్పులు, ఆందోళనలతో సతమతమవుతుంటాడు. ఉప్పి (వెంకటేష్), కార్తీక్ (శ్రీనాథ్) ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ రంగాల్లో స్థిరపడగా, కౌశిక్ (అభినవ్ గోమటం) బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోతాడు.

వివేక్ తనను తాను నిరూపించుకోవడానికి 'క్యాస్ట్ అవే' తరహా సర్వైవల్ సినిమా తీసేందుకు వీరందరినీ థాయ్‌లాండ్ తీసుకెళ్తాడు. అక్కడ బడ్జెట్ లేమి, సమయభావం కంటే వీరి మధ్య ఉండే అహం (Ego) ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టిందన్నది ఎంతో సహజంగా చూపించారు.

నేడు టాలీవుడ్‌లో భారీ విజువల్ హంగులు, పాన్ ఇండియా హడావుడి నడుస్తున్న వేళ తరుణ్ మరోసారి తన నిజాయితీ గల కథనంతో మనసు గెలుచుకున్నారు. ప్రాణమిచ్చే స్నేహితులు ఉండటం ఎంత బలమో, మన బలహీనతలన్నీ తెలిసిన స్నేహితులు పక్కన ఉంటే ఎలాంటి చిక్కులు వస్తాయో కూడా అంతే వాస్తవికంగా చూపించారు.

కష్టాల్లో ఒకరికొకరు అండగా నిలబడుతూనే, తప్పు చేస్తే మొహం మీదే విమర్శించుకునే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. బీచ్‌లో నలుగురు స్నేహితుల మధ్య సాగే సుదీర్ఘ సింగిల్-షాట్ సన్నివేశం ఈ సినిమాకే హైలైట్.

సినిమా రంగంపై సున్నితమైన సెటైర్లు

తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో తెలుగు చిత్ర పరిశ్రమ తీరుతెన్నులపైనా అద్దం పట్టారు. అతి నాటకీయత, నాసిరకం వీఎఫ్ఎక్స్, బలహీనమైన రైటింగ్, సెంటిమెంట్ కోసం నటులను తీసుకోవడం (రాజీవ్ కనకాల తన పాత్రలో తానే నటించి కడుపుబ్బా నవ్వించారు), బడ్జెట్ విషయంలో నిర్మాతల కక్కుర్తి, నటులను ఇబ్బంది పెట్టే దర్శకుల పోకడలపై చురకలు అంటించారు. పలువురు అగ్ర తెలుగు దర్శకులు అతిథి పాత్రల్లో మెరిసి తమపై తామే జోకులు వేసుకోవడం విశేషం.

విమర్శల వెనుక సినిమా పట్ల తనకున్న అపారమైన ప్రేమను తరుణ్ చాటుకున్నారు. ఒక డాక్టర్‌లా కళాకారులు ప్రాణాలు కాపాడలేకపోయినా, ఒక మంచి సినిమా ప్రేక్షకుడిని కనీసం రెండున్నర గంటల పాటు వాస్తవ ప్రపంచపు బాధలను మరిచిపోయేలా చేస్తుందని నిరూపించారు. పదేళ్ల నిరీక్షణ తర్వాత తన ప్రతిభకు తగ్గ బాక్సాఫీస్ విజయాన్ని తరుణ్ భాస్కర్ అందుకున్నారని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks