ENE Repeat Trailer: యూత్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'ఈఎన్ఈ రిపీట్' (ENE Repeat) ట్రైలర్ ఎట్టకేలకు మంగళవారం (నవంబర్ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి భాగానికి ఏమాత్రం తగ్గకుండా అంతకుమించిన క్రేజీ అడ్వెంచర్, నవ్వుల పువ్వులు పూయించే డైలాగ్స్‌తో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ ట్రైలర్‌ను మలచడం విశేషం.
ఈఎన్ఈ రిపీట్ స్టోరీ ఇలా..

ఈ చిత్రంలో వివేక్ అండ్ గ్యాంగ్ (విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మగాంటి) మరోసారి సర్వైవల్ కాన్సెప్ట్ ఆధారంగా సినిమా తీయాలనే ఆలోచనతో ఒక దగ్గరకు చేరుకుంటారు. అయితే వారి ప్రయాణం అనుకున్నంత సులువుగా సాగదు. అనూహ్యమైన మలుపులు, అనుకోని చిక్కులు, అడుగడుగునా కామెడీ సన్నివేశాలతో ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు ఎంతో ఆసక్తికరంగా సాగింది.
ఆడియెన్స్ కు పిచ్చెక్కిపోయే సర్వైవల్ థ్రిల్లర్ మూవీ తీయడానికి వివేక్ (విశ్వక్ సేన్) రెడీ అవడం ఈ ట్రైలర్ లో చూడొచ్చు. అతనితో అతని ఫ్రెండ్స్ కూడా చేరతారు. కానీ మూవీ తీసే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు వాళ్ల మధ్య దూరాన్ని పెంచుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? వివేక్ తన కలల మూవీ తీస్తాడా లేదా అన్నది ఈ మూవీలో చూడొచ్చు.
తరుణ్ భాస్కర్ మార్క్ హ్యూమర్.. అదనపు ఆకర్షణగా హీరోయిన్లు
డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తనదైన మార్క్ టైమింగ్, సహజసిద్ధమైన సంభాషణలతో ట్రైలర్‌ను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లారు. సాధారణ సంఘటనల నుంచి కూడా అత్యంత వినోదాన్ని రాబట్టే ఆయన శైలి ఈ సీక్వెల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ సీక్వెల్లో ప్రధాన తారాగణం కాంబినేషన్ సినిమాకి ప్రధాన బలంగా నిలవనుంది. వీరితో పాటు అనీషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రల్లో కనిపించి కథపై మరింత క్యూరియాసిటీని పెంచారు.
గ్రాండ్ టెక్నికల్ వాల్యూస్, థియేట్రికల్ రిలీజ్ డేట్
{{/usCountry}}ఈ సీక్వెల్లో ప్రధాన తారాగణం కాంబినేషన్ సినిమాకి ప్రధాన బలంగా నిలవనుంది. వీరితో పాటు అనీషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రల్లో కనిపించి కథపై మరింత క్యూరియాసిటీని పెంచారు.
గ్రాండ్ టెక్నికల్ వాల్యూస్, థియేట్రికల్ రిలీజ్ డేట్
{{/usCountry}}వివేక్ సాగర్ అందించిన ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ మూడ్‌ని సరిగ్గా ఎలివేట్ చేసింది. ఏజే ఆరాన్ సినిమాటోగ్రఫీ రిచ్ అండ్ కలర్‌ఫుల్ విజువల్స్‌తో ఆకట్టుకునేలా ఉంది. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యారబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
పాత జ్ఞాపకాలను రీ-క్రియేట్ చేస్తూనే, సరికొత్త స్టోరీలైన్‌తో నవంబర్ 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ఈ గ్యాంగ్ మళ్లీ వెండితెరపై చేసే రచ్చ కోసం యూత్ కాచుకుని కూర్చున్నారు.