...
...
Next Story

ENE Repeat Release Date: ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌ రిలీజ్ డేట్ లాక్..మళ్లీ నలుగురు దోస్తుల హంగామా..ఈఎన్ఈ రిపీట్ ఆ రోజే

ENE Repeat Release Date: టాలీవుడ్ యూత్‌ఫుల్ కల్ట్ క్లాసిక్ హిట్టయిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ వచ్చేస్తోంది. ఈఎన్ఈ రిపీట్ పేరుతో వస్తున్న ఈ సీక్వెల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇవాళ అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్ మెంట్ వీడియో సోషల్ మీడియాలో మోత మోగిస్తోంది.

Published on: Jun 29, 2026, 13:42:32 IST
Advertisement

ENE Repeat Release Date: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఫ్రెండ్షిప్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన బెస్ట్ సినిమాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindi) కచ్చితంగా ముందువరుసలో ఉంటుంది. సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలోనే కాకుండా డిజిటల్ స్క్రీన్స్, ఓటీటీలలోనూ యువతను విపరీతంగా ఆకట్టుకుని ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది.

ఈఎన్ఈ రిపీట్ రిలీజ్ డేట్

ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌ రిలీజ్ డేట్ లాక్..మళ్లీ నలుగురు దోస్తుల హంగామా
ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌ రిలీజ్ డేట్ లాక్..మళ్లీ నలుగురు దోస్తుల హంగామా

ఇప్పుడు ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ సీక్వెల్ రాబోతుంది. ‘ఈఎన్ఈ రిపీట్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సోమవారం (జూన్ 29) ఈఎన్ఈ రిపీట్ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ నగరానికి ఏమైంది మూవీ రిలీజై 8 ఏళ్లు కంప్లీట్ అయిన సందర్భంగా ఈఎన్ఈ రిపీట్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ క్రేజీ సీక్వెల్ నవంబర్ 19, 2026న థియేటర్లకు రానుంది.

వీడియో వైరల్

ఈ నగరానికి ఏమైంది మూవీ కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో అదరగొట్టింది. నేటికీ ఈ సినిమాలోని వన్-లైనర్స్, క్యారెక్టరైజేషన్స్, డైలాగ్స్, మీమ్స్ సోషల్ మీడియాలో నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అయితే సీక్వెల్ లో నటించే నటుల విషయంలో ఓ మార్పు చోటు చేసుకుంది.

ఈ నగరానికి ఏమైంది మూవీలో యాక్ట్ చేసిన సాయి సుశాంత్ ఇప్పుడు సీక్వెల్ కు దూరమయ్యాడు. ఆ మూవీలో అతను కార్తీక్ క్యారెక్టర్ ప్లే చేశాడు. ఇప్పుడు సీక్వెల్ లో అతని స్థానంలో మాగంటి శ్రీనాథ్ వచ్చాడు. మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ గా విష్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను కొనసాగుతున్నారు. ఇప్పుడు సీక్వెల్ రిలీజ్ డేట్ రావడంతో మరోసారి ఈ మూవీపై బజ్ ఆకాశానికి తాకుతోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe