సినిమా ఇండస్ట్రీల్లో హీరో, హీరోయిన్ కు మధ్య ఏదో ఉందన్న పుకార్లు కామనే. అలాగే హీరోయిన్ ఈషా రెబ్బ.. డైరెక్టర్, యాక్టర్ అయిన తరుణ్ భాస్కర్ తో రిలేషన్షిప్ లో ఉందన్న వార్తలు కొన్నాళ్లుగా వస్తున్నాయి. దీనిపై తాజాగా ఈషా స్పందిస్తూ.. ఈ వార్తలు విని తన తండ్రి కూడా పెళ్లెప్పుడు అని అడిగినట్లు చెప్పడం విశేషం.
తరుణ్ భాస్కర్‌తో పెళ్లి నిజమేనా?

ఈషా రెబ్బ, తరుణ్ భాస్కర్ కలిసి ప్రస్తుతం ఓం శాంతి శాంతి శాంతి అనే సినిమాలో నటించారు. ఈ మూవీ శుక్రవారం (జనవరి 30) థియేటర్లలోకి రానుంది. మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ జయ జయ జయ జయహే సినిమాకు ఇది రీమేక్. ఈ సందర్భంగా ఈషా రెబ్బ మీడియాతో మాట్లాడింది. పెళ్లి విషయం ప్రస్తావించిన సమయంలో తాను కూడా ఈ పుకార్లు విన్నట్లు చెప్పింది.
“నేను కూడా ఆ పుకార్ల గురించి విన్నాను. దీనిపైనే నేను ఫన్నీ ఇన్‌స్టా రీల్ కూడా చేశాను. ఈ వార్తలు విని మా నాన్న కూడా నా పెళ్లెప్పుడు అని అడిగాడు. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నా జీవితంలో నా నియంత్రణలో లేని వాటి గురించి మాట్లాడను. అలాంటిదేమైనా ఉంటే మీకు ముందే చెబుతాను” అని ఈషా స్పష్టం చేసింది.
డేటింగ్ మాత్రం నిజం
అయితే ఈషా రెబ్బ డేటింగ్ లో మాత్రం ఉన్నదట. ఈ విషయాన్ని ఆమెనే వెల్లడించింది. ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తున్నానని, అది ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నదని తెలిపింది. అది ఎవరన్నది మాత్రం చెప్పలేదు. నిజానికి గతేడాది దీపావళి సందర్భంగా ఈషా, తరుణ్ ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్న ఫొటోలు బయటకు రావడంతో వీరి మధ్య రిలేషన్షిప్ పుకార్లు మరింత పెరిగాయి. ఇప్పుడు ఓ సినిమాలో కలిసి నటించారు.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈషా క్లారిటీ ఇచ్చినా.. ఆ డేటింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరన్న సస్పెన్స్ ను మాత్రం కొనసాగించింది. ఓం శాంతి శాంతి శాంతి: మూవీ ఈ శుక్రవారం (జనవరి 30) రిలీజ్ కానుంది. భార్యపై ఆధిపత్యం చెలాయించాలని చూసి తర్వాత ఆమె చేతుల్లో తన్నులు తినే భర్త పాత్రలో తరుణ్ భాస్కర్ నటించాడు. ఈ సినిమాకు మలయాళంలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
{{/usCountry}}అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఈషా క్లారిటీ ఇచ్చినా.. ఆ డేటింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరన్న సస్పెన్స్ ను మాత్రం కొనసాగించింది. ఓం శాంతి శాంతి శాంతి: మూవీ ఈ శుక్రవారం (జనవరి 30) రిలీజ్ కానుంది. భార్యపై ఆధిపత్యం చెలాయించాలని చూసి తర్వాత ఆమె చేతుల్లో తన్నులు తినే భర్త పాత్రలో తరుణ్ భాస్కర్ నటించాడు. ఈ సినిమాకు మలయాళంలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
{{/usCountry}}