ఇవాళ ఓటీటీలోకి క‌న్న‌డ అండ‌ర్‌వ‌ర‌ల్డ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌-6 నెల‌ల్లో రూ.20 ల‌క్ష‌లు-అమ్మ క‌ల కోసం

ఇవాళ ఓటీటీలోకి కన్నడ అండర్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్ వచ్చేసింది. కేజీఎఫ్ స్టోరీ తరహాలో అమ్మ కల కోసం సాగే కథతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందో చూసేయండి. 

Published on: Nov 13, 2025 10:40 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ వారం ఓటీటీలోకి కొత్త కంటెంట్ తో కూడిన సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అదే బాటలో మరో కన్నడ యాక్షన్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇవాళ ఓటీటీలోకి అడుగుపెట్టిన మూవీ ‘ఎక్కా’. కేజీఎఫ్ స్టోరీ తరహాలో అమ్మ కల కోసం పోరాడే వ్యక్తిగా ఎక్కా సినిమా కథ సాగుతోంది. ఈ సినిమా గురువారం (నవంబర్ 13) ఓటీటీలో అడుగుపెట్టింది.

ఓటీటీలోకి కన్నడ యాక్షన్ థ్రిల్లర్ (youtube)
ఓటీటీలోకి కన్నడ యాక్షన్ థ్రిల్లర్ (youtube)

ఎక్కా ఓటీటీ

కన్నడ లేటెస్ట్ హిట్ మూవీ ‘ఎక్కా’ ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ యాప్ లోకి అడుగుపెట్టింది ఈ మూవీ. ఇందులో యువ రాజ్ కుమార్ హీరో. రోహిత్ పడాకి డైరెక్టర్. ఈ మూవీని పీఆర్కే ప్రొడక్షన్స్, జయన్నా ఫిల్మ్స్, కేఆర్జీ స్టూడియోస్ బ్యానర్లపై అశ్విని పునీత్, జయన్నా-భోగేంద్ర, కార్తీక్ గౌడ, యోగి రాజ్ నిర్మించారు.

మూడు నెలల తర్వాత

కన్నడ యాక్షన్ థ్రిల్లర్ ఎక్కా సినిమా మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ జులై 18, 2025న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ ఏడాది కన్నడలో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఎక్కా ఒకటి. ఈ సినిమాలో యువ రాజ్ కుమార్, సంజనా ఆనంద్, సంపద, అతుల్ కులకర్ణి, ఆదిత్య, రాహుల్ దేవ్, శ్రుతి తదితరులు నటించారు.

ఎక్కా కథ

ముత్తు (యువ రాజ్ కుమార్) ఊర్లో అల్లరిచిల్లరిగా తిరుగుతుంటాడు. ఫ్రెండ్స్ తో సరదాగా తిరుగుతూ, జూదం ఆడుతూ కాలం గడుపుతాడు. మరోవైపు ముత్తు అంటే తల్లి రత్నకు ప్రాణం. అంతే కాకుండా సొంత ఇల్లు మరింత ఇష్టం. అయితే అనుకోని పరిస్థితుల కారణంగా ఆ ఇంటిని వడ్డీ వ్యాపారీ అమ్మకానికి పెడతాడు. అప్పుడు 6 నెలల్లో రూ.20 లక్షలు కడతానని చెప్పిన ముత్తు డబ్బు కోసం బెంగళూరుకు వస్తాడు.

అండర్ వరల్డ్ మాఫియా

బెంగుళూరుకు వచ్చిన ముత్తు కారు డ్రైవర్ గా మారతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఓ చిన్న పాప హత్యకు కారణమవుతాడు. దాంతో మత్తు లైఫ్ టర్న్ అవుతుంది. అతను అండర్ వరల్డ్ మాఫియాలోకి ఎంటర్ కావాల్సి వస్తుంది. మాఫియా డాన్ మస్తాన్ భాయ్ (అతుల్ కులకర్ణి) దగ్గర చేరతాడు.

మరి ఆ తర్వాత ఏం జరిగింది? అమ్మకు ఇష్టమైన ఇల్లు అమ్మకుండా చూసుకున్నాడా? చనిపోయిన చిన్నారి ఎవరు? అసలు మాఫియాలోకి ముత్తు ఎందుకు అడుగుపెట్టాల్సి వచ్చిందన్నది ఎక్కా మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

News/Entertainment/ఇవాళ ఓటీటీలోకి క‌న్న‌డ అండ‌ర్‌వ‌ర‌ల్డ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌-6 నెల‌ల్లో రూ.20 ల‌క్ష‌లు-అమ్మ క‌ల కోసం
News/Entertainment/ఇవాళ ఓటీటీలోకి క‌న్న‌డ అండ‌ర్‌వ‌ర‌ల్డ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌-6 నెల‌ల్లో రూ.20 ల‌క్ష‌లు-అమ్మ క‌ల కోసం