Crime Thriller OTT: 25 వేల కోట్ల డ్రగ్స్ వేట-ఓటీటీలోకి తెలుగులో ఐఆర్ఎస్ ఆఫీసర్ తీసిన తమిళ క్రైమ్ థ్రిల్లర్-9.5 రేటింగ్!

Crime Thriller OTT: రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు వస్తూనే ఉన్నాయి. కానీ తమిళంలో తెరకెక్కిన ‘ఎనిమీ ఆఫ్ ది స్మగ్లర్’ సినిమాకు మాత్రం ఓ స్పెషాలిటీ ఉంది. కస్టమ్స్ అధికారిగా పని చేసిన ఓ సీనియర్ ఐఆర్ఎస్ ఈ కథ రాయడంతో పాటు స్వయంగా దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.

Published on: Nov 25, 2026, 10:47:17 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Crime Thriller OTT: ఇంటర్నేషనల్ సముద్రపు స్మగ్లింగ్ ముఠా, కస్టమ్స్ అధికారుల వేట చుట్టూ తిరిగే స్టోరీతో తెరకెక్కిన మూవీ ‘ఎనిమీ ఆఫ్ ది స్మగ్లర్’. ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు.

25 వేల కోట్ల డ్రగ్స్ వేట-ఓటీటీలోకి తెలుగులో ఐఆర్ఎస్ ఆఫీసర్ తీసిన తమిళ క్రైమ్ థ్రిల్లర్-9.5 రేటింగ్! (x/sunnxt)
25 వేల కోట్ల డ్రగ్స్ వేట-ఓటీటీలోకి తెలుగులో ఐఆర్ఎస్ ఆఫీసర్ తీసిన తమిళ క్రైమ్ థ్రిల్లర్-9.5 రేటింగ్! (x/sunnxt)

ఎనిమీ ఆఫ్ ది స్మగ్లర్ ఓటీటీ

తమిళ క్రైమ్ థ్రిల్లర్లకు తెలుగు ఆడియన్స్ లో బాగానే క్రేజ్ ఉంటుంది. థియేటర్లలో ఓ మోస్తారుగా ఆడిన చిత్రాలను కూడా ఓటీటీలో మన ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇప్పుడు సరిగ్గా అలాంటి సినిమానే అయిన ఎనిమీ ఆఫ్ ది స్మగ్లర్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

తెలుగులోనూ స్ట్రీమింగ్

క్రైమ్ థ్రిల్లర్ ఎనిమీ ఆఫ్ ది స్మగ్లర్ ఓటీటీలో అడుగుపెట్టనుంది. నవంబర్ 27 నుంచి సన్ నెక్స్ట్ యాప్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు భాషలోనూ ఇది డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి రానుంది. అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ ను తమ సొంత భాషలో ఎంజాయ్ చేయొచ్చు.

రియల్ కస్టమ్స్ అధికారి

ఈ ఎనిమీ ఆఫ్ ది స్మగ్లర్ సినిమాకు ఒకప్పుడు కస్టమ్స్ ఆఫీసర్ గా పని చేసిన సీనియర్ ఐఆర్ఎస్ అఫీసర్ సమయ మురళి దర్శకత్వం వహించడం విశేషం. తాను దర్యాప్తు చేసిన కేసుల ఆధారంగా రాసిన నవల కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. అంతే కాకుండా కస్టమ్స్ ఆఫీసర్ క్యారెక్టర్ ను కూడా ఆయనే ప్లే చేయడం విశేషం.

స్టోరీ ఏంటంటే?

చెన్నైలోని ఓ మురికివాడలో ఉండే అమర్ (శరణ్ శక్తి), దీనా (బాల శరవణన్) బెస్ట్ ఫ్రెండ్స్. చెన్నై పోర్ట్ లో చిన్న చిన్న పనులు చేస్తుంటారు. కానీ పేదరికం, కుటుంబ అప్పుల నుంచి బయటపడేందుకు వీళ్లు తప్పుదారి పడతారు.

అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ ను దుబాయ్ నుంచి మాథ్యూ భాయ్ (లాల్) నడుపుతుంటాడు. ఆ వ్యవహారాలన్నీ కింగ్ పిన్ లింగం (జేడీ చక్రవర్తి) చూసుకుంటాడు. రూ.25 వేల కోట్ల విలువైన భారీ హెరాయిన్ కంటైనర్ ను పోర్ట్ నుంచి బయటకు పంపించే బాధ్యతను అమర్, దీనాకు లింగం అప్పగిస్తాడు.

కానీ ఆ కంటైనర్ కనిపించకుండా పోతుంది. దీంతో అమర్, దీనాను పట్టుకునేందుకు డ్రగ్స్ ముఠా ప్రయత్నిస్తుంది. మరోవైపు అక్రమ రవాణా అడ్డుకునేందుకు పోరాడుతున్న కస్టమ్స్ అఫీసర్ మురళి (టి.సమయ మురళి) ఏం చేశాడు? ఆ కంటైనర్ ఏమైంది? అనేది సినిమాలో చూడాల్సిందే.

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.