...
...
Next Story

Vaibhav Suryavanshi: 21 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ రిటైర్‌మెంట్, అప్పటికీ సరిపడా డబ్బు ఉంటుంది: ఇంగ్లాండ్ మాజీ దిగ్గజాలు

England Cricketers On Vaibhav Sooryavanshi Retirement: ఐపీఎల్ 2026లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను షేక్ చేస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీపై ఇంగ్లాండ్ మాజీ దిగ్గజాలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతడి ఆట చూస్తుంటే 21 ఏళ్లకే రిటైర్ అయ్యేంత సంపాదన కూడబెడతాడని వ్యాఖ్యానించారు.

Published on: May 7, 2026, 13:07:43 IST
Advertisement

England Cricketers On Vaibhav Sooryavanshi Retirement: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. కొందరు అతడిని ఏఐ (AI) టెక్నాలజీతో పోలుస్తుంటే, మరికొందరు అతడి బ్యాట్‌లో ఏదో చిప్ ఉందని సోషల్ మీడియాలో జోకులు పేలుస్తున్నారు.

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు

21 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ రిటైర్‌మెంట్, అప్పటికీ సరిపడా డబ్బు ఉంటుంది: ఇంగ్లాండ్ మాజీ దిగ్గజాలు (ANI)
21 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ రిటైర్‌మెంట్, అప్పటికీ సరిపడా డబ్బు ఉంటుంది: ఇంగ్లాండ్ మాజీ దిగ్గజాలు (ANI)

ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, అలిస్టర్ కుక్, ఫిలిప్ టఫ్నెల్ ఒక పాడ్‌కాస్ట్‌లో వైభవ్ సూర్యవంశీ గురించి జరిపిన చర్చ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న ప్రకంపనలు చూసి వారు నోరెళ్లబెట్టారు.

గేల్, అభిషేక్ శర్మ రికార్డులకు ఎసరు

వైభవ్ సూర్యవంశీ సాధించిన ఘనతలపై మైకేల్ వాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "ఐపీఎల్‌లో క్రిస్ గేల్ పేరిట 30 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉంది. ఈ కుర్రాడు అప్పుడే 35 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఇక ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయుడిగా అభిషేక్ శర్మ (2024లో 42 సిక్సర్లు) రికార్డులో ఉన్నాడు. వైభవ్ అప్పుడే 37 సిక్సర్లకు చేరుకున్నాడు" అని వాన్ విశ్లేషించారు.

21 ఏళ్లకే రిటైర్మెంట్? తఫ్నెల్ సెటైర్

ప్రపంచంలోనే ప్రస్తుతానికి అత్యుత్తమ సిక్సర్ హిట్టర్ వైభవ్ సూర్యవంశీ అని అలిస్టర్ కుక్ కూడా ఏకీభవించారు. వైభవ్ సూర్యవంశీ ఎదుగుదల చూస్తుంటే భవిష్యత్తులో అతడి రేంజ్ ఎక్కడికో వెళ్తుందని ఈ మాజీలు అభిప్రాయపడ్డారు.

ఈ కామెంట్స్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇంగ్లాండ్ మాజీ దిగ్గజాలు జ్యోతిష్కుల్లా మారిపోయారని వారిపై నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇకోపోతే వైభవ్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు వేలంలో వదులుకునే ప్రసక్తి లేదని, అతడు త్వరలోనే టీమ్ ఇండియాలోకి రావాలని వాన్ ఆకాంక్షించారు.

ఈ ఏడాది జూలైలో జరిగే ఇంగ్లాండ్ టూర్‌లో లేదా ఐర్లాండ్ పర్యటనలో వైభవ్‌ను భారత జట్టులో చూడాలని తాను కోరుకుంటున్నట్లు వాన్ పేర్కొన్నారు. ఇప్పటికే చతేశ్వర్ పుజారా వంటి దిగ్గజాలు కూడా వైభవ్ భవిష్యత్తులో భారత టెస్టు జట్టుకు వెన్నెముక అవుతాడని కితాబిచ్చారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. వైభవ్ సూర్యవంశీ వయసు ఎంత?

వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం 15 ఏళ్ల వయసులో ఐపీఎల్ 2026 ఆడుతున్నారు. అతి చిన్న వయసులోనే ఐపీఎల్ ఆడుతున్న ఆటగాడిగా ఆయన గుర్తింపు పొందారు.

2. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు?

వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టు తరఫున ఆడుతున్నారు.

3. మైకేల్ వాన్ వైభవ్ గురించి ఏమన్నారు?

వైభవ్ అద్భుతమైన సిక్సర్ హిట్టర్ అని, అతడు త్వరలోనే భారత జాతీయ జట్టులోకి రావాలని మైకేల్ వాన్ అభిప్రాయపడ్డారు.

4. వైభవ్ బ్యాటింగ్ రికార్డులు ఎలా ఉన్నాయి?

అతడు ఇప్పటికే 35 బంతుల్లో సెంచరీ సాధించడమే కాకుండా, ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయుడిగా అభిషేక్ శర్మ రికార్డును అధిగమించే దిశగా సాగుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe