Enna Vilai OTT Release In Telugu: రామేశ్వరం సముద్ర తీరం నేపథ్యంలో సాగే ఒక సామాన్యుడి పోరాటం ఓటీటీ వీక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తమిళ నటుడు కరుణాస్, వర్సటైల్ యాక్ట్రెస్ నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో నటించిన సోషల్ థ్రిల్లర్ లీగల్ డ్రామా ఎన్న విలై ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
ఐఎమ్‌డీబీ రేటింగ్

ఎన్న విలై అంటే ధర ఎంత? లేదా నిజాయితీ (Price Of Dignity) విలువ ఎంత? అనే అర్థాలు వస్తున్నాయి. థియేటర్లలో సెప్టెంబర్ 17న విడుదలైన ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్ వచ్చింది. అలాంటి ఎన్న విలై ఓటీటీలోకి వచ్చేయనుంది.
జీవితాన్ని తలకిందులు చేసే బంగారు లాకెట్
"ఒక్క చిన్న బంగారు లాకెట్ ఒక కుటుంబ జీవితాన్నే తలకిందులు చేయగలదా?" అని ప్రశ్నిస్తూ నిర్మాతలు ఓటీటీ విడుదల తేదీని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒక చిన్న వస్తువు మనిషి నిజాయితీని, అతడి కుటుంబ భవిష్యత్తును ఏ విధంగా పరీక్షించిందో తెలిపే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.
కథా నేపథ్యం – సముద్రంలో లభించిన నిజాయితీ!
రామేశ్వరం క్షేత్రానికి వచ్చే భక్తులు సముద్రంలో వేసే నాణేలను ఏరుకుంటూ జీవించే తవసి ముత్తు అనే పేద కుటుంబీకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పిల్లలకు మంచి చదువు, మెరుగైన భవిష్యత్తు అందించడానికి సముద్ర గర్భంలో నాణేల కోసం నిత్యం మునకలు వేస్తుంటాడు.
ఒకరోజు నీటిలో అతడికి అత్యంత విలువైన బంగారు లాకెట్ దొరుకుతుంది. ఆభరణాన్ని రహస్యంగా దాచుకోకుండా, అధికారులకు అప్పగించాలని తవసి ముత్తు నిర్ణయించుకుంటాడు. అయితే అతడు తీసుకున్న ఆ మంచి నిర్ణయమే అతడిని అనేక చిక్కుల్లో పడేస్తుంది.
నిజాయితీగా ఉన్నందుకు మెప్పు లభించకపోగా, దొంగతనం ఆరోపణలు, వ్యవస్థ నుంచి బెదిరింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమాజంలోని అసమానతలు, పేదరికం, పెద్ద శక్తుల మధ్య నలిగిపోయే సామాన్యుడి ఆవేదనను దర్శకుడు ఎంతో ప్రామాణికంగా తెరకెక్కించారు. ఒక అధికారి అతడికి మద్దతుగా నిలిచేవరకు తవసి ముత్తు పడిన వేదన ప్రేక్షకులను తీవ్రంగా ఆలోచింపజేస్తుంది.
ఆకట్టుకునే సాంకేతిక బృందం
{{/usCountry}}నిజాయితీగా ఉన్నందుకు మెప్పు లభించకపోగా, దొంగతనం ఆరోపణలు, వ్యవస్థ నుంచి బెదిరింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమాజంలోని అసమానతలు, పేదరికం, పెద్ద శక్తుల మధ్య నలిగిపోయే సామాన్యుడి ఆవేదనను దర్శకుడు ఎంతో ప్రామాణికంగా తెరకెక్కించారు. ఒక అధికారి అతడికి మద్దతుగా నిలిచేవరకు తవసి ముత్తు పడిన వేదన ప్రేక్షకులను తీవ్రంగా ఆలోచింపజేస్తుంది.
ఆకట్టుకునే సాంకేతిక బృందం
{{/usCountry}}ఎన్న విలై చిత్రానికి సజీవ్ పాజూర్ దర్శకత్వం వహించగా, గిరీష్ విశ్వంభరన్, అనుగోపాల్ వేణుగోపాలన్ సంయుక్తంగా నిర్మించారు. సామ్ సి.ఎస్ అందించిన నేపథ్య సంగీతం కథలోని ఉద్వేగాలను మరింతగా పెంచింది. అల్బీ ఆంటోనీ ఛాయాగ్రహణం, శ్రీజిత్ సారంగ్ కూర్పు సినిమాకు అదనపు బలంగా నిలిచాయి.
కరుణాస్, నిమిషా సజయన్లతో పాటు విజయలక్ష్మి వీరమణి, షాషా శివకుమార్, నిళల్గల్ రవి, పూర్ణిమ భాగ్యరాజ్, చేతన్ సీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. కథాబలం ఉన్న సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి అనుభూతిని అందిస్తుందని భావిస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్.. ఐదు భాషల్లో రిలీజ్!
ఎన్న విలై చిత్రాన్ని అక్టోబర్ 15 నుంచి ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నెట్‌ఫ్లిక్స్‌లో ఎన్న విలై ఓటీటీ రిలీజ్ కానుంది.