Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌లోకి డైరెక్ట్‌గా వ‌చ్చిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ పార్ట్ 3.. షెర్లాక్ కిడ్నాప్.. తెలుగులోనూ!

Netflix OTT: ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న పాపులర్ డిటెక్టివ్ ఫ్రాంచైజీ ‘ఎనోలా హోమ్స్’ మూడో భాగం ఎట్టకేలకు డిజిటల్ స్క్రీన్‌పైకి వచ్చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ లో ఇది డైరెక్ట్ గా రిలీజైంది. షెర్లాక్ హోమ్స్ కిడ్నాప్, ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ మూవీ కథ నడుస్తుంది.

Published on: Jul 1, 2026, 14:04:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Netflix OTT: నెట్‌ఫ్లిక్స్‌లో క్రేజీ మిస్టరీ అడ్వెంచర్ ఫ్రాంచైజీలలో ‘ఎనోలా హోమ్స్’ ఒకటి. షెర్లాక్ హోమ్స్ సోదరిగా ఎనోలా చేసే సాహసాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి మూడో పార్ట్ ‘ఎనోలా హోమ్స్ 3’ సరికొత్త మిస్టరీతో ఓటీటీలోకి వచ్చేసింది. డైరెక్ట్ గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.

నెట్‌ఫ్లిక్స్‌లోకి డైరెక్ట్‌గా వ‌చ్చిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ పార్ట్ 3 (x)
నెట్‌ఫ్లిక్స్‌లోకి డైరెక్ట్‌గా వ‌చ్చిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ పార్ట్ 3 (x)

ఎనోలా హోమ్స్ ఓటీటీ

మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘ఎనోలా హోమ్స్’లో మూడో పార్ట్ ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం (జూలై 1) నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో డిజిటల్ ఆడియన్స్ కోసం అందుబాటులోకి వచ్చింది.

ఆగిపోయిన పెళ్లి.. షెర్లాక్ కిడ్నాప్

ఈ మూడో భాగం కథ ఎనోలా హోమ్స్ జీవితంలో ఒక కీలక మలుపుతో ప్రారంభమవుతుంది. ఎనోలా హోమ్స్, లార్డ్ ఎర్నెస్ట్ ట్యూక్స్‌బరీల వివాహానికి సర్వం సిద్ధమవుతుంది. అయితే, పెళ్లి పీటల మీదకు వెళ్లే ముందు ఎనోలా తన ‘హోమ్స్’ గుర్తింపును కోల్పోతాననే ఆందోళనకు గురవుతుంది.

షాకింగ్ ట్విస్ట్

ఈ తరుణంలోనే షెర్లాక్ హోమ్స్ పార్ట్ నర్ డాక్టర్ జాన్ వాట్సన్ వచ్చి ఎనోలాను కలుస్తాడు. మోస్ట్ టాలెంటెడ్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ కిడ్నాప్ అయ్యాడనే షాకింగ్ నిజాన్ని చెప్తాడు. ఆ కిడ్నాప్ మిస్టరీ ఛేదించేందుకు ఎనోలా రంగంలోకి దిగుతుంది.

షెర్లాక్ తనకోసం వదిలివెళ్లిన కొన్ని రహస్య నోట్‌బుక్స్ ఆధారంగా ఎనోలా ఎంక్వైరీ చేస్తుంది. ఈ విచారణ ఆమెను మాల్టా దేశానికి తీసుకెళ్తుంది. అక్కడ బ్రిటిష్ పాలన నుంచి మాల్టాను విడిపించేందుకు జరిగే స్థానిక ఉద్యమం, దాని వెనుక ఉన్న వలసరాజ్య సైనిక కుట్రలు, రాజకీయ వ్యూహాలను ఎనోలా ఎదుర్కోవాల్సి వస్తుంది.

పాత శత్రువు రీ-ఎంట్రీ

ఎనోలా హోమ్స్ పార్ట్ 3లో పాత శత్రువుతో ఎనోలా తలపడాల్సి వస్తుంది. ఈ భారీ అంతర్జాతీయ నేర సామ్రాజ్యం వెనుక ‘మొరియార్టీ’ ఉన్నట్లు ఎనోలా గుర్తిస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది. షెర్లాక్ ను ఎనోలా కాపాడిందా? లేదా? అనేది సినిమాలో చూడాల్సిందే.

పవర్‌ఫుల్ పాత్రలు!

ఫిలిప్ బరంటిని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఎనోలా హోమ్స్ పార్ట్ 3 చిత్రంలో పాత తారాగణంతో పాటు కొత్త క్యారెక్టర్లు కూడా సందడి చేశాయి. యాక్షన్, మైండ్ గేమ్స్, లవ్ అండ్ ఎమోషన్ కలగలిసిన ‘ఎనోలా హోమ్స్ 3’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ మిస్టరీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇంకెందుకు లేటు మీరూ ఓ లుక్కేయండి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More