OTT Horror: ఓటీటీలోకి నేరుగా వచ్చిన మైథలాజికల్ హారర్ థ్రిల్లర్- 1800 కాలం నాటి నగలకు భయంకర శాపం- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Tavvai OTT Streaming: నిన్నటి నుంచి నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న లేటెస్ట్ మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా తవ్వై. 1800 కాలం నాటి నగలపై ఉన్న భయంకరమైన శాపం ఓ కుటుంబాన్ని తరతరాలుగా వేధిస్తుంటుంది. హారర్ అంశాలతో సాగే తవ్వై ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 30, 2026, 13:01:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Tavvai OTT Release: భారతీయ సినీ రంగంలో పురాణాలు, మిస్టరీ, హారర్ అంశాల కలయికతో వచ్చే చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కాంతార, విరూపాక్ష, ముంజ్యా వంటి సినిమాలు ఈ తరహా విభిన్నమైన కంటెంట్‌తోనే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి.

ఓటీటీలోకి నేరుగా వచ్చిన మైథలాజికల్ హారర్ థ్రిల్లర్- 1800 కాలం నాటి నగలకు భయంకర శాపం- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నేరుగా వచ్చిన మైథలాజికల్ హారర్ థ్రిల్లర్- 1800 కాలం నాటి నగలకు భయంకర శాపం- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తవ్వై ఓటీటీ స్ట్రీమింగ్

సరిగ్గా ఇదే బాటలో సరికొత్త మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ 'తవ్వై' (Tavvai) ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేరుగా ఓటీటీలోకి వచ్చిన తవ్వై సినిమా 1800 కాలం నాటి శాపం, దేవుడు వర్సెస్ దుష్టశక్తి అన్నట్లుగా సాగుతుంది. తవ్వై అంటే హిందీలో దరిద్ర దేవత, దౌర్భాగ్య దేవి అనే అర్థాలు వస్తాయని సమాచారం.

తరాల నాటి నగల శాపం.. ఆకట్టుకునే కథాంశం

తవ్వై సినిమా కథ 1800ల కాలంలో మొదలవుతుంది. ఆ కాలంలో ఒక పాలకుడు చేసిన క్రూరమైన పనులు, దురాశ వల్ల ఒక శక్తివంతమైన శాపం పుడుతుంది. ఆ శాపం కాలంతో పాటు కరిగిపోకుండా, న్యాయం జరగని ఒక పగలా మారి ఒక కుటుంబానికి చుట్టుకుంటుంది. తరాలు మారుతున్నా ఆ కుటుంబ వెన్నంటే సాగుతుంది.

అయితే, ఆ కుటుంబానికి వారసత్వంగా వస్తున్న నగలలో ఆ శాపం ఉంటుంది. ఆ నగలు ఎవరైనా వేసుకుంటే ఆ శాపం ప్రభావితం అవుతుంది. ప్రస్తుత కాలంలో ప్రమేంద్ర (భూషణ్ ప్రధాన్) ఈ శాపాన్ని మోస్తుంటాడు. తన చుట్టూ జరుగుతున్న అతీత శక్తుల కదలికలతో పాటు, తను చేయని తప్పులకు తన జీవితం ఎలా ప్రభావితం అవుతుందో తెలుసుకునే క్రమంలో సాగే మిస్టరీనే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.

"పురాణాలు, హారర్ అంశాల కలయిక ఎప్పుడూ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతుంది, ఈ ఫార్ములా డిజిటల్ ఆడియన్స్‌కు పక్కాగా కనెక్ట్ అవుతుంది" అని చిత్ర యూనిట్ పేర్కొంది.

ప్రముఖ నటీనటుల కలయిక

ఈ చిత్రంలో సీనియర్ నటుడు మనోజ్ జోషి (అవధేష్), భూషణ్ ప్రధాన్ (ప్రమేంద్ర), తృప్తి సాహు (దక్షత), అర్పిత రంకా (యతేంద్ర) ప్రధాన పాత్రలు పోషించారు. నీతూ పాండే, సురేందర్ శర్మ, కీర్తికా గుప్తా, స్పందన పల్లి, తరణ్ అర్రేజా, నైమేష్ నవీన్ కీలక పాత్రల్లో కనిపించారు.

నిర్భయ్ జారివాలా, జయేష్ వృషీరాజ్ సంయుక్తంగా తవ్వై చిత్రానికి దర్శకత్వం వహించారు. రమేష్ అర్రేజా ఈ అద్భుతమైన కథను అందించారు. కల్పేష్ వాఘాసియా, అనికేత్ జసాని, దేవ్ గాంధీ ఈ చిత్రాన్ని నిర్మించారు. జయేష్ వృషీరాజ్ సినిమాటోగ్రఫీ అందించగా, అవిరల్ కుమార్, అర్జిత్ శ్రీవాస్తవ సంగీతాన్ని సమకూర్చారు. దినేష్ గురామ్ ఎడిటర్‌గా వ్యవహరించారు.

రెండేళ్ల నిరీక్షణకు తెర.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్

తవ్వై సినిమా అనౌన్స్‌మెంట్ టీజర్ రెండేళ్ల క్రితమే యూట్యూబ్‌లో విడుదలై సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తించింది. థియేటర్లలో విడుదల కావాల్సిన తవ్వై చిత్రం ఎట్టకేలకు నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జియో హాట్‌స్టార్ సంస్థ తవ్వై ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

జూన్ 29, 2026 నుంచి అంటే నిన్నటి నుంచి జియో హాట్‌స్టార్‌లో తవ్వై ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి అయితే, హిందీ భాషలో మాత్రమే తవ్వై ఓటీటీ రిలీజ్ అయింది. మిస్టరీ, సస్పెన్స్, హారర్ సినిమాలను ఇష్టపడే వారికి జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న 'తవ్వై' ఒక మంచి వీకెండ్ వాచ్‌గా నిలుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More