ఓటీటీలో కొత్త ట్రెండ్. సాధారణంగా అయితే ఒక ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన చాలా రోజుల తర్వాత సినిమాలు ఇతర ఓటీటీల్లోకి వస్తాయి. కానీ ఒరిజినల్ వెబ్ సిరీస్ లు మాత్రం అలా కాదు. ఏ ఓటీటీకి ఆ ఓటీటీ స్పెషల్ వెబ్ సిరీస్ లు ఉంటాయి. ఇప్పుడా వెబ్ సిరీస్ లు కూడా ఒక ఓటీటీలోనివి మరో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈటీవీ విన్ సిరీస్ లు, సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఈటీవీ విన్ ఒరిజినల్స్

ఈటీవీ విన్ ఓటీటీ తమ కోసం స్పెషల్ గా రూపొందించిన సినిమా, సిరీస్ లు ఇప్పుడు మరో పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేశాయి. రెండు వెబ్ సిరీస్ లు, ఓ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ వెబ్ సిరీస్ లు.. 90'స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్, ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్) కాగా, సినిమా ఏమో లిటిల్ హార్ట్స్.
సూపర్ హిట్ సిరీస్
ఈటీవీ విన్ అనగానే ఇప్పుడు అందరికీ ముందుగా 90'స్ మిడిల్ క్లాస్ బయోపిక్ గుర్తుకొస్తుంది. ఈ వెబ్ సిరీస్ తో ఈటీవీ విన్ ఓటీటీ ప్రేక్షకులకు మరింత చేరువైంది. శివాజీ కీలక పాత్రలో నటించిన ఈ సిరీస్ ప్రతి తెలుగు ఇంటికి రీచ్ అయింది. ఇందులో మన 90'స్ రోజుల నాటి కుటుంబం, పాఠశాలలు, చదువు, అప్పటి పరిస్థితులను చక్కగా చూపించారు. ఈ సిరీస్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
ఏఐఆర్ సిరీస్
మరో ఈటీవీ విన్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఏఐఆర్ (ఆల్ ఇండియా ర్యాంకర్స్). ఇది ప్రతి ఇంటర్ స్టూడెంట్ స్టోరీ అంటూ ఓటీటీలోకి వచ్చి సత్తాచాటింది. ఇందులో ముగ్గురు ఇంటర్ ఫ్రెండ్స్ కథను చూపించారు. పిల్లలపై పేరెంట్స్ ఆశలు, స్టూడెంట్స్ పై తల్లిదండ్రుల ప్రెషర్, కొన్ని ఇంటర్ కాలేజీల దోపిడి తదితర విషయాలను చాలా రియలిస్టిక్ గా చూపించారు. దీంతో ఈ సిరీస్ కూడా జనాల్లోకి త్వరగా వెళ్లిపోయింది.
బ్లాక్ బస్టర్ మూవీ
లిటిల్ హార్ట్స్.. చిన్న సినిమాగా వచ్చి థియేటర్లో పెను ప్రకంపనలు నమోదు చేసిన చిత్రం ఇది. ఇది కూడా ఈటీవీ విన్ ప్రొడక్షన్ నుంచి వచ్చిందే. థియేటర్లో ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఆ తర్వాత ఎక్స్ టెండెడ్ కట్ తోనూ ఓటీటీలోకి అదరగొట్టింది. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.
{{/usCountry}}లిటిల్ హార్ట్స్.. చిన్న సినిమాగా వచ్చి థియేటర్లో పెను ప్రకంపనలు నమోదు చేసిన చిత్రం ఇది. ఇది కూడా ఈటీవీ విన్ ప్రొడక్షన్ నుంచి వచ్చిందే. థియేటర్లో ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ ఆడియన్స్ ను కట్టిపడేసింది. ఆ తర్వాత ఎక్స్ టెండెడ్ కట్ తోనూ ఓటీటీలోకి అదరగొట్టింది. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.
{{/usCountry}}