...
...
Next Story

ETV Win OTT: ఈటీవీ విన్ బంపర్ ఆఫర్.. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఫ్యామిలీ టికెట్, ఓ పేద్ద పాప్‌కార్న్ కేవలం రూ.499కే..

ఈటీవీ విన్ ఓటీటీ (ETV Win OTT) సినిమా లవర్స్ కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ ఫ్యామిలీ టికెట్ తీసుకొచ్చింది. ఈ టికెట్ పై నలుగురు సినిమా చూడటంతోపాటు ఓ పేద్ద పాప్‌కార్న్ కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

Published on: Mar 4, 2026, 13:40:09 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

శివాజీ, లయ జంటగా నటించిన మూవీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని(sampradayini suppini suddapusani). ఈ సినిమాను మొదట ఈటీవీ విన్ ఓటీటీలోకే నేరుగా తీసుకు వస్తున్నట్లు చెప్పి చివరి నిమిషంలో థియేటర్లలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. శుక్రవారం (మార్చి 6) రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం ఈటీవీ విన్ ఇప్పుడు ఫ్యామిలీ టికెట్ అంటూ ఓ బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది.

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టికెట్స్

ETV Win OTT: ఈటీవీ విన్ బంపర్ ఆఫర్.. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఫ్యామిలీ టికెట్, ఓ పేద్ద పాప్‌కార్న్ కేవలం రూ.499కే..
ETV Win OTT: ఈటీవీ విన్ బంపర్ ఆఫర్.. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఫ్యామిలీ టికెట్, ఓ పేద్ద పాప్‌కార్న్ కేవలం రూ.499కే..

తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. చాలా రోజుల తర్వాత శివాజీ, లయ కలిసి నటించిన ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా ఫ్యామిలీ టికెట్ అంటూ ఈటీవీ విన్.. సింగిల్ స్క్రీన్లలో కేవలం రూ.499కే అందిస్తోంది. ఈ టికెట్ పై నలుగురు సినిమా చూడటంతోపాటు ఓ పెద్ద పాప్‌కార్న్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది.

అదే మల్టీప్లెక్స్ అయితే మాత్రం రూ.799కే ఈ ఫ్యామిలీ టికెట్ అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని బుధవారం (మార్చి 4) ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. “మొత్తం గ్యాంగ్ ను తీసుకొచ్చే ఛాన్స్ ఉండగా.. ఒక్కరే చూడటం ఎందుకు? ఈటీవీ విన్ ఫ్యామిలీ టికెట్ తో నాలుగు అడల్ట్ టికెట్లు, లార్జ్ పాప్‌కార్న్ పొందవచ్చు. అది కూడా కేవలం రూ.499 (సింగిల్ స్క్రీన్), రూ.799 (మల్టీప్లెక్స్). మీ సీట్లను బుక్ చేసుకొని కామెడీతో కూడిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చూడండి” అనే క్యాప్షన్ తో ఆఫర్ అనౌన్స్ చేసింది.

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ విశేషాలు

ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. కానీ చివరి నిమిషంలో అంటే స్ట్రీమింగ్‌కు కేవలం కొన్ని గంటల సమయం ఉందనగా నిర్మాతలు యూ-టర్న్ తీసుకున్నారు. ఈ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

కారణం ఏంటంటే?

ఈ సినిమా అవుట్‌పుట్ చూసిన తర్వాత, కొంతమంది సినీ ప్రముఖులు శివాజీకి సలహా ఇచ్చారట. "ఇది చిన్న స్క్రీన్‌పై కంటే వెండితెరపై చూస్తేనే బాగుంటుంది. థియేటర్లలో మంచి విజయం సాధించే సత్తా ఈ కంటెంట్‌కు ఉంది" అని సూచించారట. ఈ సినిమా ట్రైలర్ చూసిన వారికి కూడా ఇది కేవలం ఓటీటీ సినిమాగా అనిపించలేదు. దీంతో నిర్మాత అయిన శివాజీ.. ఈటీవీ విన్ ఒప్పందాన్ని పక్కనపెట్టి థియేటర్ రిలీజ్ వైపు మొగ్గు చూపాడు.

మూవీ కథేంటంటే?

సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్. ఒక ఊరి సర్పంచ్ (శివాజీ) అనుకోని ఆపదలో చిక్కుకుంటాడు. ఆ సమస్య నుంచి బయటపడేందుకు తన భార్య (లయ), కొడుకుతో కలిసి ఒక రోడ్ ట్రిప్ మొదలుపెడతాడు. ఈ ప్రయాణంలో వారికి ఎదురైన సవాళ్లు, వాటిని వారు ఎలా అధిగమించారు అనేదే కథ. మధ్యతరగతి ఎమోషన్స్, కామెడీ మేళవింపుతో ఈ సినిమా ఉండబోతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe