OTT: ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సరికొత్త మైండ్ బెండింగ్ కాన్సెప్ట్‌తో డిజిటల్ ఆడియన్స్ ముందుకు వస్తోంది. 'కథా సుధా - సండే స్టోరీస్' ఆంథాలజీ సిరీస్‌లో భాగంగా 'అనగనగా ఓ శుక్రవారం' అనే క్రేజీ సినిమాను జులై 19న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఒకరి జీవితం ఇంకొకరిగా మారిపోతే ఎలా ఉంటుందనే ఇంట్రెస్టింగ్ ఫాంటసీ లైన్‌తో ఈ కథ నడవబోతోంది.
ఒకే ఒక్క రాత్రిలో లైఫ్ తారుమారు!

"ఒకవేళ మీరు పొద్దున్నే లేచేసరికి మీ లైఫ్ కాకుండా వేరే ఎవరిదో జీవితంలో బతుకుతుంటే ఎలా ఉంటుంది?" అనే షాకింగ్ క్యాప్షన్‌తో ఈ షార్ట్ ఫిల్మ్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
తెలుగులో 'శుక్రవారం తారుమారు' అనే ట్యాగ్‌లైన్ పెట్టడంతో ఈ స్టోరీ చుట్టూ ఏదో పెద్ద ఫాంటసీ లేదా సస్పెన్స్ ఎలిమెంట్ ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. హాలీవుడ్‌లో బాడీ స్వాపింగ్ లేదా అల్టర్నేట్ రియాలిటీ కాన్సెప్ట్‌లు చాలా పాపులర్. ఇప్పుడు అదే లెవెల్ హై-కాన్సెప్ట్ థ్రిల్‌ను లోకల్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూపించబోతున్నారు.
'కథా సుధ' ఆంథాలజీతో ఈటీవీ విన్ కొత్త ప్లాన్
ఈ మధ్య కాలంలో కథాసుధ పేరుతో ఈటీవీ విన్ మిడిల్ క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా మంచి ఎమోషనల్ షార్ట్ ఫిల్మ్స్ తీసుకొస్తున్న సంగతి తెలుసు కదా. అందులో భాగంగానే ఈ అనగనగా ఓ శుక్రవారం కూడా రాబోతోంది.
ఇందులో సీనియర్ నటి ఇంద్రజ నటించడం విశేషం. పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగా ఉంది. ఓ గృహిణి, మరో నవతరం అమ్మాయి ఒకరి జీవితాల్లోకి మరొకరు వెళ్లినట్లుగా ఈ పోస్టర్ ను రూపొందించారు. ఈ పోస్టర్ తోనే మూవీ కాన్సెప్ట్ ఎంత భిన్నంగా ఉండబోతోందో అర్థమవుతోంది.
మధురాపురి సదన మూవీ కూడా..
అంతకుముందు ఈటీవీ విన్ ఓటీటీ మరో ఇంట్రెస్టింగ్ మూవీని కూడా అనౌన్స్ చేసింది. ఈ సినిమా పేరు మధురాపురి సదన. జులై 16 నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. సొంతింటి కోసం తపన పడే ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే ఈ స్టోరీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. క్రమంగా లోకల్ కంటెంట్ జోరు పెంచుతూ తెలుగు ప్రేక్షకుల మన్నన పొందే దిశగా ఈటీవీ విన్ స్పీడుగా అడుగులు వేస్తున్నట్లు తాజాగా ఆ ఓటీటీ అనౌన్స్ చేస్తున్న సినిమాలు, ఒరిజినల్ కంటెంట్ చూస్తే స్పష్టమవుతోంది.
{{/usCountry}}అంతకుముందు ఈటీవీ విన్ ఓటీటీ మరో ఇంట్రెస్టింగ్ మూవీని కూడా అనౌన్స్ చేసింది. ఈ సినిమా పేరు మధురాపురి సదన. జులై 16 నుంచే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. సొంతింటి కోసం తపన పడే ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే ఈ స్టోరీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. క్రమంగా లోకల్ కంటెంట్ జోరు పెంచుతూ తెలుగు ప్రేక్షకుల మన్నన పొందే దిశగా ఈటీవీ విన్ స్పీడుగా అడుగులు వేస్తున్నట్లు తాజాగా ఆ ఓటీటీ అనౌన్స్ చేస్తున్న సినిమాలు, ఒరిజినల్ కంటెంట్ చూస్తే స్పష్టమవుతోంది.
{{/usCountry}}