Etv Win OTT: తెలుగు ఓటీటీ రంగంలో స్వచ్ఛమైన ప్రాంతీయ కంటెంట్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'ఈటీవీ విన్' (ETV Win) దసరా పండుగ వేళ ప్రేక్షకులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఆయుధ పూజను పురస్కరించుకుని తమ రాబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన మైండ్ బ్లోయింగ్ అనౌన్స్మెంట్కు శ్రీకారం చుట్టింది.

సోషల్ మీడియా వేదికగా ఈటీవీ విన్ ఓటీటీ ఓ ఆసక్తికర ప్రకటన విడుదల చేసింది. "ఈ ఆయుధ పూజకు మా తదుపరి 'ఆయుధాల'ను ఆవిష్కరిస్తున్నాం. రాబోయే రెండు నెలల పాటు మీ వినోదానికి ఎలాంటి లోటు ఉండదు. పూర్తి వివరాల కోసం వేచి చూడండి" అంటూ ఓ ట్వీట్ చేసింది. దీంతో తెలుగు ఓటీటీ ప్రియులలో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
రాబోయే 2 నెలలకు గ్రాండ్ లైనప్
దసరా, దీపావళి వరుస పండుగల సీజన్లను దృష్టిలో ఉంచుకుని ఈటీవీ విన్ ఈసారి భారీ ప్లానింగ్‌తో ముందుకు వస్తోంది. గతంలో '90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్', 'వలరి', 'కనకరాజు' వంటి సరికొత్త కథాంశాలతో వచ్చి సూపర్ హిట్లు అందుకున్న ఈ ప్లాట్‌ఫామ్.. ఇప్పుడు మరిన్ని ఒరిజినల్ సినిమాలు, సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లను లైన్లో పెట్టింది.
ఈ ఆయుధ పూజ స్పెషల్ అనౌన్స్మెంట్లో భాగంగా రాబోయే నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ ట్వీట్ కు జోడించిన స్పెషల్ పోస్టర్ లో ఈ రెండు నెలల పాటు రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్ లన్నింటినీ చూడొచ్చు.
ఈటీవీ విన్ లోకి అడుగుపెట్టనున్న మూవీస్, సిరీస్ ఇవే
ఈటీవీ విన్ రిలీజ్ చేసిన తాజా పోస్టర్ లో పలు ఆసక్తికర ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ మధ్యే థియేటర్లలో రిలీజైన తెల్ల కాగితం మూవీ కూడా ఈటీవీ విన్ లోకే రానున్నట్లు తేలిపోయింది. దీనికి సంబంధించిన స్ట్రీమింగ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
{{/usCountry}}ఈటీవీ విన్ రిలీజ్ చేసిన తాజా పోస్టర్ లో పలు ఆసక్తికర ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ మధ్యే థియేటర్లలో రిలీజైన తెల్ల కాగితం మూవీ కూడా ఈటీవీ విన్ లోకే రానున్నట్లు తేలిపోయింది. దీనికి సంబంధించిన స్ట్రీమింగ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
{{/usCountry}}ఇక మరొక మూవీ బాలు గీత కూడా అక్టోబర్ 15 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా నేరుగా డిజిటల్ ప్రీమియర్ అయింది. ఇక మెల్బోర్న్ మేట్స్ అనే మరో ఆసక్తికర ప్రాజెక్ట్ కూడా ఈ ఓటీటీలోకి రాబోతోంది.
మరోవైపు జేడీ చక్రవర్త నటించిన మరో ప్రాజెక్ట్ #డీఎం కూడా తమ ఓటీటీలోకి రానున్నట్లు ఈటీవీ విన్ వెల్లడించింది. అటు సెప్టెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన మరో క్రేజీ మూవీ ఇంకా ఏం అనుకోలేదు కూడా రాబోయే రోజులలో రిలీజ్ కానున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ తెలిపింది.