...
...
Next Story

Telugu Web Series: సూపర్ హిట్ తెలుగు వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. ఈసారి థియేటర్లలో..

తెలుగు సూపర్ హిట్ వెబ్ సిరీస్ (Telugu Web Series) ఆల్ ఇండియా ర్యాంకర్స్ (AIR Season 2) రెండో సీజన్ వచ్చేస్తోంది. అయితే ఈసారి ఓటీటీలోకి కాకుండా థియేటర్లలో రిలీజ్ చేస్తుండటం విశేషం. ఆ విశేషాలు చూడండి.

Published on: Mar 1, 2026, 19:50:23 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

తెలుగులో యువతను ఆకర్షించేలా వచ్చిన వెబ్ సిరీస్ లలో ఒకటి ఆల్ ఇండియా ర్యాంకర్స్ (ఏఐఆర్). ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ లో ఈ సిరీస్ గతేడాది స్ట్రీమింగ్ అయింది. దీనికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ రెడీ అవుతోంది. అయితే ఆశ్చర్యకరంగా దీనిని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ వెల్లడించింది.

ఆల్ ఇండియా ర్యాంకర్స్ సీజన్ 2

Telugu Web Series: సూపర్ హిట్ తెలుగు వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. ఈసారి థియేటర్లలో..
Telugu Web Series: సూపర్ హిట్ తెలుగు వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. ఈసారి థియేటర్లలో..

ఈటీవీ విన్ ఓటీటీలో వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకర్స్ తొలి సీజన్ గుర్తుందా? ముగ్గురు ఇంటర్మీడియట్ కుర్రాళ్లు, ర్యాంకుల కోసం వాళ్లు పడే పాట్ల చుట్టూ తిరిగే కథతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ ను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఈటీవీ విన్ వెల్లడించింది.

“బాయ్స్ మళ్లీ వస్తున్నారు. ఏఐఆర్ సెకండ్ ఇయర్.. ఎ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా షేర్ చేసిన పోస్టర్లో ఈ ఇంటర్మీడియట్ కుర్రాళ్ల కథను మరోసారి చూద్దాం.. కాకపోతే ఈసారి థియేటర్లలో అని రాసి ఉంది.

ఆల్ ఇండియా ర్యాంకర్స్ సీజన్ 1 విశేషాలు

ఇంటర్మీడియట్ విద్యార్థులపై ఉండే ఒత్తిడిని, హాస్టల్ జీవితంలోని కష్టసుఖాలను ప్రతిబింబించే వెబ్ సిరీస్ గా 'AIR' (All India Rankers) రూపొందింది. జోసెఫ్ క్లింటన్ దర్శకత్వంలో.. హర్ష్ రోషన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ యూత్‌ఫుల్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ యువతను బాగా ఆకట్టుకుంది.

ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో ర్యాంకులు, మార్కుల కోసం విద్యార్థులు పడే ఒత్తిడిని చాలా సినిమాలు చూపించాయి. కానీ ఆ గందరగోళాన్ని కామెడీతోపాటు సహజమైన భావోద్వేగాలతో మిళితం చేస్తూ రూపొందిన వెబ్ సిరీస్ ‘AIR - ఆల్ ఇండియా ర్యాంకర్స్’. దర్శకుడు సందీప్ రాజ్ (కలర్ ఫోటో ఫేమ్) నిర్మించిన ఈ వెబ్ సిరీస్ లో ఏడు ఎపిసోడ్లు ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe