ETV Win 3.0: ఈటీవీ విన్ ఓటీటీ ధమాకా.. 3.0 పేరుతో రీలాంచ్.. విన్ జాతర అంటూ సరికొత్త ఒరిజినల్స్ అనౌన్స్ చేసిన ఓటీటీ

ఈటీవీ విన్ (ETV Win 3.0) ఓటీటీ సరికొత్తగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 3.0 అంటూ ఆ ఓటీటీ రీలాంచ్ కావడం విశేషం. ఈ సందర్భంగా విన్ జాతర పేరుతో ఎన్నో కొత్త ఒరిజినల్స్ ను సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.

Published on: Feb 27, 2026, 15:11:09 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలో కేవలం తెలుగు కంటెంట్ అందించే ఈటీవీ విన్ ఇప్పుడు సరికొత్తగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈటీవీ విన్ 3.0ను శుక్రవారం (ఫిబ్రవరి 27) అనౌన్స్ చేశారు. కొత్త లుక్, కొత్త స్పీడ్ తో రీలాంచ్ చేస్తూనే సరికొత్త ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ ను తీసుకొస్తున్నట్లు కూడా ఆ ఓటీటీ వెల్లడించింది.

ETV Win 3.0: ఈటీవీ విన్ ఓటీటీ ధమాకా.. 3.0 పేరుతో రీలాంచ్.. విన్ జాతర అంటూ సరికొత్త ఒరిజినల్స్ అనౌన్స్ చేసిన ఓటీటీ
ETV Win 3.0: ఈటీవీ విన్ ఓటీటీ ధమాకా.. 3.0 పేరుతో రీలాంచ్.. విన్ జాతర అంటూ సరికొత్త ఒరిజినల్స్ అనౌన్స్ చేసిన ఓటీటీ

ఈటీవీ విన్ 3.0 ఇలా..

ప్రముఖ తెలుగు ఛానెల్ ఈటీవీ నుంచి వచ్చిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win). గత కొన్నేళ్లుగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఓటీటీ స్పేస్ లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు ఈటీవీ విన్ 3.0ను లాంచ్ చేసింది.

“కొత్త లుక్.. కొత్త స్పీడ్.. కొత్త మ్యాడ్‌నెస్.. ఇది కేవలం అప్డేట్ మాత్రమే కాదు. ఇది అప్‌గ్రేడ్. ఈటీవీ విన్ 3.0 వచ్చేసింది. వేగవంతమైన స్ట్రీమింగ్. మరింత మంచి అనుభవం. మరింత ఎక్కువ ఎంటర్టైన్మెంట్. మీ యాప్ ను ఇప్పుడే అప్డేట్ చేసుకొని కొత్త శకం పవరేంటో చూడండి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

ఈటీవీ విన్ 3.0 విశేషాలు

డిజిటల్ వినోద రంగంలో తెలుగువారికి అత్యంత చేరువైన 'ఈటీవీ విన్' (ETV Win) కేవలం ఒక అప్‌డేట్ మాత్రమే కాకుండా, యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేలా 'అప్‌గ్రేడ్' వెర్షన్ 3.0ను అధికారికంగా విడుదల చేసింది. యూజర్లకు మరింత సులభంగా, వేగంగా వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ఈ 3.0 వెర్షన్‌ను రూపొందించారు.

ఇందులో భాగంగా యాప్ ఇంటర్‌ఫేస్‌ను మరింత ఆకర్షణీయంగా, మోడ్రన్‌గా తీర్చిదిద్దారు. బఫరింగ్ సమస్యలు లేకుండా, అతి తక్కువ డేటాతోనే అత్యంత వేగంగా వీడియోలు ప్లే అయ్యేలా సాంకేతిక మార్పులు చేశారు. సెర్చ్ ఆప్షన్లు, కేటగిరీల విభజనను మరింత స్పష్టంగా మార్చారు. మీకు నచ్చిన కంటెంట్‌ను త్వరగా వెతుక్కునే వీలుంటుంది. సరికొత్త సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో వినోదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా ఈ అప్‌గ్రేడ్ ఉండబోతోంది.

విన్ జాతర వచ్చేస్తోంది

ఈటీవీ విన్ 3.0ను అనౌన్స్ చేస్తూనే విన్ జాతర పేరుతో సరికొత్త ఒరిజినల్స్ ను కూడా తీసుకొస్తున్నట్లు చెప్పింది. రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్న పాకశాల పంతం అనే మూవీని అనౌన్స్ చేసింది. ఇది గడసరి అత్త సొగసరి కోడలు కథ కాదు.. ఇది అత్తా కోడళ్ల లవ్వు స్టోరీ అనే క్యాప్షన్ తో ఓ ఇంటెన్స్ పోస్టర్ రిలీజ్ చేసింది.

ఇక పాపం ప్రతాప్ అనే మరో విన్ ఒరిజినల్ మూవీ రాబోతోంది. ఈ సినిమా మొదట ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ కానున్నట్లు వెల్లడించింది.

దీంతోపాటు గుర్తుకొస్తున్నాయి అనే మరో వెబ్ సిరీస్ రానుంది. ఇది కేవలం నోస్టాల్జియా కాదు.. ఇదో గందరగోళం అనే క్యాప్షన్ తో ఈ సిరీస్ ను అనౌన్స్ చేసింది.

ఇవే కాకుండా జిల్లేడు చెట్టు అనే మరో మూవీ.. అన్‌టోల్డ్ టేల్ ఆఫ్ బ్లడీ గోదావరి అంటూ మరో ప్రొడక్షన్ నంబర్ 3ని కూడా ఈటీవీ విన్ అనౌన్స్ చేయడం విశేషం.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More