సారా అర్జున్.. ఇప్పుడీ భామ పేరు తెలియని సినీ లవర్ ఉండడనే చెప్చొచ్చు. ధురంధర్ సినిమాలతో ఈ యంగ్ బ్యూటీ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఈ భామ నటించిన ఓ తెలుగు సోషల్ డ్రామా థ్రిల్లర్ ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. అదే ‘యుఫోరియా’ మూవీ. ఇందులో అత్యాచారానికి గురైన బాధితురాలిగా తన నటనతో సారా అర్జున్ ఆకట్టుకుంది.
యుఫోరియా ఓటీటీ

భూమిక చావ్లా, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు సోషల్ థ్రిల్లర్ ‘యుఫోరియా’ ఇవాళ ఓటీటీలో అడుగుపెట్టింది. తెలుగు పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ సినిమా గురువారం (ఏప్రిల్ 2) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ యుఫోరియాను తెరకెక్కించాడు.
మిక్స్ డ్ టాక్
యుఫోరియా మూవీ నెల రోజులు దాటిన తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 6, 2026న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఏప్రిల్ 2, 2026 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి థియేటర్లో మిక్స్ డ్ టాక్ వచ్చింది. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన, ఫుట్ పాత్ పై పడుకున్న వాళ్లపై నుంచి బైక్ వెళ్లడం లాంటి రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా ఈ యుఫోరియా సినిమాను తెరకెక్కించారు.
ఐఎండీబీ రేటింగ్
యుఫోరియా సినిమా థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని రాబట్టలేపోయింది. అయితే దీనికి ఐఎండీబీలో 8.2 రేటింగ్ ఉండటం గమనార్హం. ఐఏఎస్ కావాలనుకునే అమ్మాయి రేప్ కు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే యుఫోరియా స్టోరీ. ఇందులో భూమిక చావ్లా, సారా అర్జున్, విఘ్నేశ్ గవిరెడ్డి, గౌతమ్ మీనన్, రోహిత్ తదితరులు నటించారు. ఈ మూవీని గుణశేఖర్ ఫ్యామిలీ నిర్మించింది.
యుఫోరియా స్టోరీ
ధురంధర్ లాంటి హిట్ తర్వాత సారా అర్జున్ తెలుగులో చేసిన మూవీ యుఫోరియా. ఇందులో ఆమె చైత్ర క్యారెక్టర్ ప్లే చేసింది. ఓ రిచ్ ఫ్యామిలీకి చెందిన చైత్ర ఐఏఎస్ కావాలని కలలు కంటుంది. ఆ దిశగా ప్రిపేర్ అవుతుంది. అయితే ఓ రోజు ఫ్యామిలీ పర్మిషన్ తో ఓ పార్టీకి వెళ్తుంది.
{{/usCountry}}ధురంధర్ లాంటి హిట్ తర్వాత సారా అర్జున్ తెలుగులో చేసిన మూవీ యుఫోరియా. ఇందులో ఆమె చైత్ర క్యారెక్టర్ ప్లే చేసింది. ఓ రిచ్ ఫ్యామిలీకి చెందిన చైత్ర ఐఏఎస్ కావాలని కలలు కంటుంది. ఆ దిశగా ప్రిపేర్ అవుతుంది. అయితే ఓ రోజు ఫ్యామిలీ పర్మిషన్ తో ఓ పార్టీకి వెళ్తుంది.
{{/usCountry}}అక్కడ వికాశ్ (విఘ్నేశ్ గవిరెడ్డి) అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ చైత్రపై కన్నేస్తారు. కార్లో ఆమెను రేప్ చేస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఈ కేసును సిటీ కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మీనన్) ఎలా సాల్వ్ చేశారు? ఇందులో వింధ్య (భూమిక) కోర్టుకు ఎందుకు వెళ్లింది? అనేది యుఫోరియా మూవీలో చూడాల్సిందే.