Alia Bhatt: పాకిస్థానీ దుస్తుల బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా అలియా భ‌ట్‌.. ఇన్‌స్టాలో వైర‌ల్ ఫొటోలు.. ఫ్యాక్ట్ ఇదే

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ అలియా భట్ పాకిస్థానీ బ్రాండ్ కోసం మోడలింగ్ చేసిందా? ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ప్రశ్న ఇది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అలియా ఫోటోల వెనుక అసలు నిజం ఏంటో ఇక్కడ చూసేయండి. 

Published on: Apr 21, 2026, 10:42:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఓ పాకిస్థానీ దుస్తుల బ్రాండ్ ను ఆమె ప్రమోట్ చేస్తుందనే కామెంట్లు వస్తున్నాయి. అయితే దీని వెనుక పెద్ద కథనే ఉంది. నిజంగానే పాకిస్థానీ బ్రాండ్ కు అలియా భట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉందా? అనే విషయాన్ని ఇక్కడ చూసేయండి.

ఇన్ స్టా పోస్టులో అలియా భట్ ఫొటో (instagram)
ఇన్ స్టా పోస్టులో అలియా భట్ ఫొటో (instagram)

పాకిస్థానీ బ్రాండ్

పాకిస్థాన్‌కు చెందిన 'వజేషా అఫీషియల్' (Wajayesha Official) అనే క్లాతింగ్ బ్రాండ్ ఈ వారం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. అలియా భట్ తమ లేటెస్ట్ ఎత్నిక్ వేర్ కలెక్షన్ ధరించి పోజులిచ్చినట్లుగా కొన్ని ఫోటోలను ఈ బ్రాండ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. పాకిస్థానీ బ్రాండ్ ను అలియా భట్ ప్రమోట్ చేయడం ఏంటీ? అనే ప్రశ్నలు వచ్చాయి.

అలియాకు ఇష్టమంటూ

ఈ బ్రాండ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అలియా భట్ వివిధ రంగుల సిల్క్ దుస్తుల్లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. బర్గుండి, ఎమరాల్డ్ టీల్, లావెండర్, బ్లాక్ కలర్ డ్రెస్సుల్లో అలియా మెరిసిపోతున్నట్లు ఆ ఫోటోలు ఉన్నాయి. దీనికి తోడు.. "మా ప్యూర్ శీషా సిల్క్ కలెక్షన్ అంటే అలియా భట్‌కు కూడా ఇష్టం! మీకు నచ్చిన రంగుల్లో ఆర్డర్ చేయండి" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో అలియా నిజంగానే పాక్ బ్రాండ్‌కు ప్రచారకర్తగా మారిందా అని చాలామంది ఆశ్చర్యపోయారు.

ఇదే నిజం

అయితే నిజానికి అలియా భట్ ఏ పాకిస్థానీ బ్రాండ్ కు ప్రచారం చేయడం లేదు. ఈ ఫొటోలన్నీ ఫేక్. వాస్తవానికి ఈ ఫోటోలు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) లేదా హై-ఎండ్ ఫోటోషాప్ టూల్స్ ఉపయోగించి రూపొందించినవి. అలియా గతంలో వివిధ ఫ్యాషన్ షోలు, ఫోటోషూట్లలో పాల్గొన్న ఫోటోలను తీసుకుని, ఆమె ముఖాన్ని, శరీరాన్ని ఈ బ్రాండ్ దుస్తులపైకి డిజిటల్‌గా మార్చారు.

అప్పటి వాటిని

2024లో అలియా భట్ లోరియల్ పారిస్ (L'Oréal Paris) ర్యాంప్ వాక్ చేసినప్పటి హెయిర్ స్టైల్, మేకప్‌ను ఒక ఫోటోలో వాడారు. మరికొన్ని ఫోటోల్లో ఆమె సబ్యసాచి కలెక్షన్ కోసం ధరించిన చోకర్లు, పూల అలంకరణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 2026లో మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో గూచీ (Gucci) షో కోసం అలియా చేసుకున్న స్టైలింగ్‌ను కూడా ఈ పాక్ బ్రాండ్ దొంగతనంగా వాడేసింది.

నెటిజన్ల ఆగ్రహం

సదరు బ్రాండ్ తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. "అసలు ఈ షూట్ గురించి అలియాకు తెలుసా?" అని ఒక యూజర్ ప్రశ్నించగా.. ఆ బ్రాండ్ ఏమాత్రం తగ్గకుండా, "ఈ పోస్ట్‌ను వైరల్ చేయండి, అప్పుడు ఆమెకు కూడా తెలుస్తుంది" అంటూ వెటకారంగా నవ్వుతున్న ఎమోజీలతో సమాధానం ఇచ్చింది.

పోలీస్ కేసు

"అలియా మీపై ఖచ్చితంగా కేసు వేస్తుంది" అని హెచ్చరించిన నెటిజన్లకు.. "ఆమె వేయదు" అంటూ బ్రాండ్ నిర్లక్ష్యంగా బదులిచ్చింది. చాలామంది నెటిజన్లు అలియా భట్‌ను ట్యాగ్ చేస్తూ, ఆమె అనుమతి లేకుండా ఫోటోలను వాణిజ్య అవసరాలకు వాడుకుంటున్నారని ఫిర్యాదు చేశారు.

బాలీవుడ్ స్టార్లకున్న క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకుని, భారీ ఎండార్స్‌మెంట్ ఫీజులు చెల్లించకుండా ఇలాంటి మోసపూరిత మార్గాల్లో వ్యాపారం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రముఖుల ఫోటోలతో ఇలాంటి ఫేక్ ప్రచారాలు రాబోయే రోజుల్లో మరిన్ని పెరిగే అవకాశం ఉన్నందున, సోషల్ మీడియా వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సెలబ్రిటీలు ఆమోదించారంటూ వచ్చే ప్రతి ప్రచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, అందులోని వాస్తవాలను పరిశీలించడం అవసరం.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More