ఈ డైరెక్టర్ ఒక బ్యాంక్ మేనేజర్.. సెలవులు పెట్టి మరి సినిమా పూర్తి చేశారు.. నిర్మాత వీఎస్ఎస్ కుమార్ కామెంట్స్
తెలుగులో వస్తున్న లేటెస్ట్ సినిమా ఫెయిల్యూర్ బాయ్స్. అవి తేజ్, క్రాంతి, ప్రదీప్, సుపర్ణ, పవన్ మెయిల్ లీడ్ రూల్స్‌లో నటించిన ఈ సినిమాకు వెంకట్ త్రినాథ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించారు. వీఎస్ఎస్ కుమార్ నిర్మాతగా ఉన్నారు. ఫెయిల్యూర్ బాయ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత ఆసక్తికర విషయాలు చెప్పారు.
సీనియర్ నటులు సుమన్, నాజర్, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించిన లేటెస్ట్ తెలుగు సినిమా ఫెయిల్యూర్ బాయ్స్. క్రాంతి, అవి తేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వెంకట్ త్రినాథ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించారు.

సంయక్త నిర్మాణం
శ్రీ గురు దక్షిణ మూర్తి ఫిలింస్ పతాకంపై వీఎస్ఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి ఫెయిల్యూర్ బాయ్స్ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఫెయిల్యూర్ బాయ్స్ సినిమా డిసెంబర్ 12న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన ఫెయిల్యూర్ బాయ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రొడ్యూసర్ వీఎస్ఎస్ కుమార్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.
ఫెయిల్యూర్స్ ఎవరుండరు
నిర్మాత వీఎస్ఎస్ కుమార్ మాట్లాడుతూ.. "ఫెయిల్యూర్ బాయ్స్ అంటే ఎవరు ఉండరు. జీవితంలో ఒకసారి ఫెయిల్ అయితేనే జీవితంలో ఎలా పైకి రావాలో తెలుస్తుంది. అందరికి నమస్కారం. నేను ఒకప్పుడు మీడియాలో పని చేశాను. ఈ సినిమాకు అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను" అని కోరారు.
నాకు ధైర్యం చెబుతూ మరి
"ఈ ఫెయిల్యూర్ బాయ్స్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాము. దర్శకుడు మరింత కష్టపడ్డారు. ఆయన (వెంకట్ త్రినాథ రెడ్డి ఉసిరిక) ఒక బ్యాంకు మేనేజర్. అయినప్పటికీ సెలవులు పెట్టి మరి.. నాకు ధైర్యం చెబుతూ.. ఈ సినిమాను పూర్తి చేశారు. డిసెంబర్ 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది" అని నిర్మాత వీఎస్ఎస్ కుమార్ తెలిపారు.
నాకు మరింత నమ్మకం వచ్చింది
ఇదే ఈవెంట్‌లో డైరెక్టర్ తెలుగు శ్రీను మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. సినిమా చాలా బాగా వచ్చింది. చిత్ర ట్రైలర్ చూస్తుంటే సినిమాపై నాకు మరింత నమ్మకం వచ్చింది" అని అన్నారు.
ఆనందంగా ఉంది
"పాటలు చాలా బాగా వచ్చాయి. నిర్మాత కుమార్ గారు నిర్మాణ సంస్థను ప్రారంభించి అందరికీ సపోర్ట్ చేస్తూ రావడం చాలా ఆనందంగా ఉంది. డిసెంబర్ 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ థియేటర్‌లో చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను" అని దర్శకుడు తెలుగు శ్రీను తెలిపారు.
మనసు పెట్టి తీశాం
శ్రీనివాస్ జమ్మి మాట్లాడుతూ.. "ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. ఫెయిల్యూర్ బాయ్స్ అనే ఈ చిత్రం మా మనసు పెట్టి తీశాము. ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా కష్టపడి చేశాము. ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాము" అని పేర్కొన్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


