ఫారియా అబ్దుల్లా నటించిన డార్క్ కామెడీ మూవీ గుర్రం పాపిరెడ్డి. ఐఎండీబీలో 9.6 రేటింగ్ సాధించిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమాను జనవరి 16 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంటే కనుమ రోజు నుంచి ఈ మూవీని చూడొచ్చు.
గుర్రం పాపిరెడ్డి ఓటీటీ రిలీజ్ డేట్

ఫారియా అబ్దుల్లా లీడ్ రోల్లో నటించిన గుర్రం పాపిరెడ్డి మూవీ గతేడాది డిసెంబర్ 19న థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ సాధించని ఈ సినిమా ఇప్పుడు జనవరి 16న డిజిటల్ ప్రీమియర్ కానుంది. “జర భద్రం.. ఇది అంతా మోసం.. గుర్రం పాపిరెడ్డి వస్తున్నాడు తెలుగు జీ5కి.. జనవరి 16న ప్రీమియర్ కానుంది” అనే క్యాప్షన్ తో జీ5 ట్వీట్ చేసింది.
గుర్రం పాపిరెడ్డి మూవీ స్టోరీ ఏంటంటే?
నరేష్ అగస్త్య, ఫారియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, రాజ్ కుమార్ కసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, ప్రభాస్ శ్రీను, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్ తదితరులు ఈ గుర్రం పాపిరెడ్డి సినిమాలో నటించారు. మురళీ మనోహర్ సినిమాను డైరెక్ట్ చేశాడు.
ఇందులో గుర్రం పాపిరెడ్డి అనే టైటిల్ పాత్రలో నరేష్ అగస్త్య నటించాడు. ఇక మెంటల్ హాస్పిటల్లో నర్సుగా పని చేసే సౌదామిని పాత్రలో ఫారియా నటించింది. ఈ ఇద్దరూ కలిసి కోట్లు రాబట్టే స్కెచ్ వేస్తారు. దీనికోసం ఓ శవాన్ని మార్చే పనికి పూనుకుంటారు. అసలు దీని వెనుక కారణం ఏంటి? ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు.
ఈ గుర్రం పాపిరెడ్డి చాలా యూనిక్, డిఫరెంట్ డార్క్ కామెడీ థ్రిల్లర్. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర అంతగా వసూళ్లు రాలేదు. అయితే ఇలాంటి సినిమాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ఇప్పుడీ గుర్రం పాపిరెడ్డికి కూడా జీ5 ఓటీటీలో అదే స్థాయి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. జనవరి 16 నుంచి ఈ సినిమాను చూడొచ్చు.
{{/usCountry}}ఈ గుర్రం పాపిరెడ్డి చాలా యూనిక్, డిఫరెంట్ డార్క్ కామెడీ థ్రిల్లర్. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర అంతగా వసూళ్లు రాలేదు. అయితే ఇలాంటి సినిమాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ఇప్పుడీ గుర్రం పాపిరెడ్డికి కూడా జీ5 ఓటీటీలో అదే స్థాయి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. జనవరి 16 నుంచి ఈ సినిమాను చూడొచ్చు.
{{/usCountry}}