...
...
Next Story

Faria Abdullah: నాకు బ్రెయిన్ లేదు.. ఆ మూవీ చేయనందుకు చాలా ఫీల్ అవుతున్నా.. బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: జాతి రత్నాలు సినిమాలో చిట్టిగా తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన ఫరియా అబ్దుల్లా లేటెస్ట్ కామెంట్లు వైరల్ గా మారాయి. తనకు బ్రెయిన్ లేకపోవడంతో ఓ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్నట్లు ఫరియా తెలిపింది.

Published on: Apr 29, 2026, 06:23:30 IST
Advertisement

Faria Abdullah: ఆడపాదడపా సినిమాలు చేస్తున్నా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతుంది ఫరియా అబ్దుల్లా. జాతి రత్నాలు మూవీతో డెబ్యూలోనే సూపర్ హిట్ అందుకున్న ఈ పొడుగు కాళ్ల సుందరి.. మరో విజయం కోసం వెయిట్ చేస్తూనే ఉంది. అయితే ఫరియా ఓ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకుని గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది. ఈ విషయాన్ని తాజాగా ఫరియానే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

హనుమాన్ లో

ఫరియా అబ్దుల్లా (instagram-Faria Abdullah)
ఫరియా అబ్దుల్లా (instagram-Faria Abdullah)

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన ‘హనుమాన్’ మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా అమృత అయ్యర్ నటించింది. కానీ ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఫరియా అబ్దుల్లా చేయాల్సిందంటా. ఈ సినిమాను తాను రిజెక్ట్ చేశానని తాజాగా ఫరియా వెల్లడించింది. దీని గురించి ఇప్పటికీ బాధపడుతుంటానని పేర్కొంది.

బ్రెయిన్ లేదు

గాయపడ్డ సింహం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఫరియా అబ్దుల్లా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అతి పెద్ద రిగ్రెట్ ఏదీ అని హోస్ట్ అడిగితే.. హనుమాన్ సినిమా చేయకపోవడం అని ఫరియా అబ్దుల్లా వెల్లడించింది.

‘‘నేను హనుమాన్ చేయలేదు. అప్పుడు నాకు బ్రెయిన్ లేదు. బుద్ధి లేదు. అందుకే నో చెప్పా. ఆ పాత్ర గురించి తెలియదు. నేను కొత్తగా ఇండస్ట్రీకి వచ్చా. జాతి రత్నాలు హిట్ అయింది. రోల్స్ జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని అనుకున్నా. ఇప్పటికి కూడా తేజాను లేదా ప్రశాంత్ వర్మను కలిస్తే ఆ ఫీల్ నా మైండ్ లోకి వస్తుంది. మిస్ అయిపోయానని వాళ్లకు కూడా చెప్పా’’ అని ఫరియా పేర్కొంది.

బ్లాక్ బస్టర్

జాతి రత్నాలు మూవీతో ఫరియా డెబ్యూ చేసింది. ఈ హైదరాబాదీ అమ్మాయి ఫస్ట్ మూవీతోనూ సూపర్ సక్సెస్ అందుకుంది. కానీ ఆ తర్వాత మరో హిట్ కోసం వెయిట్ చేస్తూనే ఉంది. లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్, ఆ ఒక్కటీ అడక్కు, మత్తు వదలరా 2, గుర్రం పాపిరెడ్డి మూవీస్ లో హీరోయిన్ గా చేసింది. కానీ అనుకున్న రిజల్ట్ రాలేదు.

ప్రస్తుతం గాయపడ్డ సింహంతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి ఫరియా రాబోతుంది. తరుణ్ భాస్కర్ హీరోగా చేసిన ఈ మూవీ మే 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe