తిరుమలకు చేపట్టిన ‘సంకల్ప యాత్ర’ పూర్తి అయిన సందర్భంగా సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్… సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని కలిశారు. యాత్ర పూర్తి అయిన తర్వాత శ్రీవారిని దర్శినం చేసుకున్న బండ్ల గణేశ్… సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ను కూడా కలిశారు. వారికి శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. అయితే శుక్రవారం నారా భువనేశ్వరిని కుటుంబసమేతంగా కలిశారు.

“నవ్యాంధ్ర నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారిని కుటుంబ సమేతంగా కలిశాను. వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నాను. ప్రతి నిత్యం రాష్ట్ర ప్రజలకు అండగా, పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నైతిక ధైర్యం అందించి తోడుగా నిలిచిన తల్లి భువనేశ్వరి నా సంకల్ప యాత్ర గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు” అంటూ బండ్ల గణేశ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
అభిమానం మరువలేనిది - భువనేశ్వరి ట్వీట్
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. “సంకల్ప పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకుని వచ్చిన సినీ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబసమేతంగా కలవడం సంతోషం కలిగించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఆయన చూపిన అభిమానం మరువలేనిది. ఆ దేవదేవుడి కరుణాకటాక్షాలు వారిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు. నారా భువనేశ్వరి చేసిన ట్వీట్ కు బండ్ల గణేశ్ రిప్లే ఇచ్చారు. మీ అభిమానానికి సదా కృతజ్ఞుడిని, అమ్మా అంటూ రాసుకొచ్చారు.
సంకల్ప యాత్ర పూర్తి…
గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆయన జైలు నుంచి సురక్షితంగా బయటకు వస్తే హైదరాబాద్ నుంచి తిరుమల వస్తానని సినీ నిర్మాత బండ్ల గణేశ్ శ్రీవారికి మొక్కుకున్నారు.
{{/usCountry}}గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆయన జైలు నుంచి సురక్షితంగా బయటకు వస్తే హైదరాబాద్ నుంచి తిరుమల వస్తానని సినీ నిర్మాత బండ్ల గణేశ్ శ్రీవారికి మొక్కుకున్నారు.
{{/usCountry}}తన మొక్కును చెల్లించుకోవటం కోసం జనవరి 19న షాద్‌నగర్ నుంచి సంకల్ప యాత్ర పేరుతో బండ్ల గణేశ్ పాదయాత్రను ప్రారంభించారు. 23 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది. పలు గ్రామాలు, పట్టణాలను దాటుకుంటూ తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. మార్గమధ్యంలో రాజకీయ నాయకులతో పాటు అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. కూటమిలో ఉన్న పార్టీల నాయకులు… తమ అనుచరులతో కలిసి కొంత మేర బండ్ల గణేశ్ తో కలిసి పాదయాత్ర కూడా చేశారు.
టాలీవుడ్ ప్రముఖ హీరో విశ్వక్ సేన్ కూడా…. బండ్ల గణేశ్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. బండ్ల గణేశ్ తో కలిసి కొద్ది దూరం నడిచాడు. యాత్ర పూర్తి అయిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.
టీడీపీలోకి వెళ్తారా..?
ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న బండ్ల గణేశ్.. గతంలో కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్నారు. షాద్ నగర్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ పార్టీలోని సమీకరణాల మధ్య అవకాశం దక్కలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత….. కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉంటన్నారు. అయితే తాజాగా చంద్రబాబు కోసం పాదయాత్ర చేయగా… ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే బండ్ల గణేశ్ నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన అయితే ఇప్పటివరకు రాలేదు.