ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డులు 2025.. బెస్ట్ మూవీ, సిరీస్ ఇవే.. ఓ లుక్కేయండి

ప్రతిష్ఠాత్మక ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డులు 2025ను అనౌన్స్ చేశారు. గ్రాండ్ ఈవెంట్లో విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సంవత్సరం అవార్డుల వేడుకలో వెబ్ సిరీస్‌లు, వెబ్ ఫిల్మ్‌లు ఏవి అవార్డులు గెలుచుకున్నాయో చూడండి.

Published on: Dec 16, 2025, 10:16:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డుల ఆరవ ఎడిషన్ డిసెంబర్ 15 రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది. ఆలియా భట్, విక్కీ కౌశల్ వంటి పలువురు ప్రముఖులు ఈ గ్రాండ్ ఈవెంట్ కు హాజరయ్యారు. 'పాతాళ్ లోక్ సీజన్ 2', 'బ్లాక్ వారెంట్', ‘ఖౌఫ్' వంటి షోలు ముఖ్య విజేతలుగా నిలిచాయి. 'గర్ల్స్ విల్ బి గర్ల్స్', ‘స్టోలెన్’, 'సెక్టర్ 36' వంటి వెబ్ ఒరిజినల్ ఫిల్మ్‌లు కూడా బలమైన ప్రభావాన్ని చూపాయి. ఓటీటీలో బెస్ట్ గా నిలిచిన వెబ్ సిరీస్, సినిమాలు ఏవో చూసేయండి.

ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డులు
ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డులు

ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డులు 2025 విన్నర్స్

సిరీస్ కేటగిరీ

బెస్ట్ డైరెక్టర్ (సిరీస్)- విక్రమాదిత్య మోట్వానే, సత్యన్షు సింగ్, ఆర్కేష్ అజయ్, అంబికా పండిట్, రోహిన్ రవేంద్రన్ ('బ్లాక్ వారెంట్')

బెస్ట్ సిరీస్ (క్రిటిక్స్)- పాతాళ్ లోక్ సీజన్ 2

బెస్ట్ డైరెక్టర్, సిరీస్ (క్రిటిక్స్)- అనుభవ్ సిన్హా ('IC 814: ది కాందహార్ హైజాక్')

బెస్ట్ డైరెక్టర్ (సిరీస్)- నాగేశ్ కుకునూర్ ('ది హంట్: ది రాజీవ్ గాంధీ అసెస్సినేషన్ కేస్')

బెస్ట్ యాక్టర్, సిరీస్ (మేల్): డ్రామా- జైదీప్ అహ్లావత్ ('పాతాళ్ లోక్ సీజన్ 2')

బెస్ట్ యాక్టర్ (మేల్), సిరీస్, (క్రిటిక్స్): డ్రామా- జహాన్ కపూర్ ('బ్లాక్ వారెంట్')

బెస్ట్ యాక్టర్, సిరీస్ (ఫిమేల్): డ్రామా - మానికా పన్వార్ ('ఖౌఫ్')

బెస్ట్ యాక్టర్ (ఫిమేల్), సిరీస్, క్రిటిక్స్: డ్రామా- రసికా దుగ్గల్ ('శేఖర్ హోమ్')

బెస్ట్ కామెడీ (సిరీస్/స్పెషల్స్)- రాత్ జవాన్ హై (సుమిత్ వ్యాస్)

బెస్ట్ యాక్టర్, సిరీస్ (మేల్): కామెడీ- బరుణ్ సోబ్తి ('రాత్ జవాన్ హై'), స్పర్శ్ శ్రీవాస్తవ్ ('దుపహియా')

బెస్ట్ యాక్టర్, సిరీస్ (ఫిమేల్): కామెడీ- అనన్య పాండే ('కాల్ మీ బే')

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, సిరీస్ (మేల్): డ్రామా- రాహుల్ భట్ ('బ్లాక్ వారెంట్')

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, సిరీస్ (ఫిమేల్): డ్రామా- టిల్లోత్తమ షోమే ('పాతాళ్ లోక్ సీజన్ 2')

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, సిరీస్ (మేల్): కామెడీ- వినయ్ పాఠక్ ('గ్రామ్ చికిత్సాలయం')

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, సిరీస్ (ఫిమేల్): కామెడీ- రేణుక షహనే ('దుపహియా')

ఫిల్మ్ కేటగిరీ

బెస్ట్ ఫిల్మ్, వెబ్ ఒరిజినల్- గర్ల్స్ విల్ బి గర్ల్స్

బెస్ట్ డైరెక్టర్, వెబ్ ఒరిజినల్ ఫిల్మ్- శుచి తలాటి ('గర్ల్స్ విల్ బి గర్ల్స్')

బెస్ట్ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ (క్రిటిక్స్)- బోమన్ ఇరాని ('ది మెహతా బాయ్స్')

బెస్ట్ యాక్టర్, వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ (మేల్)- అభిషేక్ బెనర్జీ ('స్టోలెన్')

బెస్ట్ యాక్టర్, వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ (ఫిమేల్)- సన్యా మల్హోత్రా ('మిసెస్')

బెస్ట్ యాక్టర్ (మేల్), క్రిటిక్స్, వెబ్ ఒరిజినల్ ఫిల్మ్- విక్రాంత్ మాస్సే ('సెక్టర్ 36') బెస్ట్ యాక్టర్ (ఫిమేల్), క్రిటిక్స్, వెబ్ ఒరిజినల్ ఫిల్మ్- ప్రీతి పణిగ్రాహి ('గర్ల్స్ విల్ బి గర్ల్స్')

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ (మేల్)- దీపక్ డోబ్రియాల్ ('సెక్టర్ 36') బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ (ఫిమేల్)- కని కుసురుతి ('గర్ల్స్ విల్ బి గర్ల్స్')

బెస్ట్ స్టోరీ (వెబ్ ఒరిజినల్ ఫిల్మ్): కరణ్ తేజ్‌పాల్, గౌరవ్ ధింగ్రా, స్వప్నిల్ సల్కార్ ('స్టోలెన్')

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More