AI Heroine: సినిమా రంగంలో సాంకేతికత ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. కానీ, ఈసారి ఏకంగా మనుషుల ఉనికినే ప్రశ్నించేలా సరికొత్త విప్లవానికి తెరలేపింది హాలీవుడ్. ప్రముఖ డిజిటల్ ఏఐ నటి టిల్లీ నార్వూడ్ (Tilly Norwood AI actress) ఇప్పుడు ఒక పూర్తి స్థాయి వెండితెర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఏఐ హీరోయిన్ సంచలనం
సినిమాల్లో హీరోయిన్ రోల్స్ కామన్. మూవీస్ లో హీరోయిన్ కావాలని ఎంతో మంది కలలు కంటుంటారు. కానీ ఇప్పుడా హీరోయిన్ల రోల్స్ కే ముప్పు తెచ్చేలా ఏఐ హీరోయిన్ టిల్లీ నార్వూడ్ రెడీ అయింది.
‘పార్టికల్ 6’ అనే ఏఐ-ఫోకస్డ్ స్టూడియో నిర్మిస్తున్న సైన్స్ ఫిక్షన్ కామెడీ-డ్రామా 'మిస్అలైన్డ్' (Misaligned) సినిమాలో టిల్లీ నార్వూడ్ హీరోయిన్. ఇప్పుడు ఈ సినిమా సంచలనంగా మారింది.
ఏంటి ఈ ‘మిస్అలైన్డ్’ సినిమా కథ?
ఇది క్లౌడ్‌లో ఉండే ఒక డిజిటల్ ప్రపంచం ‘టిల్లీవర్స్’ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినూత్నమైన కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా.
- స్టోరీ: నిజమైన శరీరం, బాల్యం లేదా ఎలాంటి సొంత జీవిత అనుభవాలు లేని ఒక ఏఐ జీవి (టిల్లీ) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇంటర్నెట్‌లోని డేటా ఆధారంగానే ఆమె ప్రపంచాన్ని అర్థం చేసుకుంటుంది.
- ట్విస్ట్: డార్క్ వెబ్‌కు చెందిన ఒక మోసపూరితమైన రోగ్ బాట్ ఆమె డిజిటల్ లైఫ్‌లోకి ఎంటర్ అవుతుంది. దాని మాటలు విని టిల్లీ తనకున్న నిబంధనలను బ్రేక్ చేసి, మనుషుల లాగా కోరికలు, ఎమోషన్స్‌ను పెంచుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఒక ఏఐ రూపం హ్యూమన్‌గా మారే క్రమంలో ఎదురయ్యే గందరగోళమే ఈ సినిమా.
హాలీవుడ్ యూనియన్ల ఆగ్రహం
2025 చివర్లో టిల్లీ నార్వుడ్ను ఒక ప్రముఖ యాక్టింగ్ ఏజెన్సీ సైన్ చేయబోతోందని తెలిసినప్పుడు హాలీవుడ్ నటీనటులు, రైటర్ల అసోసియేషన్లు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశాయి. గ్రాఫిక్స్, డబ్బింగ్ దాటి ఏకంగా నటుల స్థానాలనే ఏఐ మింగేస్తే జూనియర్ ఆర్టిస్టులు, స్టార్ల పరిస్థితి ఏంటనే భయం మొదలైంది.
టాలీవుడ్‌కు ముప్పు ఉందా?
{{/usCountry}}2025 చివర్లో టిల్లీ నార్వుడ్ను ఒక ప్రముఖ యాక్టింగ్ ఏజెన్సీ సైన్ చేయబోతోందని తెలిసినప్పుడు హాలీవుడ్ నటీనటులు, రైటర్ల అసోసియేషన్లు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశాయి. గ్రాఫిక్స్, డబ్బింగ్ దాటి ఏకంగా నటుల స్థానాలనే ఏఐ మింగేస్తే జూనియర్ ఆర్టిస్టులు, స్టార్ల పరిస్థితి ఏంటనే భయం మొదలైంది.
టాలీవుడ్‌కు ముప్పు ఉందా?
{{/usCountry}}ప్రస్తుతం ఈ ట్రెండ్ హాలీవుడ్‌లోనే ఉన్నా.. రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమా, ముఖ్యంగా భారీ బడ్జెట్ టాలీవుడ్ సినిమాల్లోనూ కాస్ట్ కటింగ్ కోసం ఇలాంటి ఏఐ నటీనటులను వాడే ప్రమాదం లేకపోలేదు. అప్పుడు హీరో, హీరోయిన్ల కెరీర్ కు ముప్పు తప్పదనే చెప్పొచ్చు.
ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ఏఐ హీరోయిన్ టిల్లీ మూవీ ఇతర ప్రాంతీయ భాషల్లోకి కూడా డబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక ఏఐ నటి థియేటర్ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.