ఫ్రైడ్ వచ్చిందంటే ఓటీటీలో కొత్త సందడి వస్తుంది. డిఫరెంట్ జోనర్లు, వేర్వేరు భాషల సినిమాలు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తుంటాయి. ఇవాళ అలాగే ఓ తమిళ హారర్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగుపెట్టింది. ఆ మూవీనే ‘ఫోర్త్ ఫ్లోర్’. ఏకంగా అయిదు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఒకే రోజు రిలీజ్ అయింది ఈ సినిమా.
ఫోర్త్ ఫ్లోర్ ఓటీటీ

తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ ‘ఫోర్త్ ఫ్లోర్’. ఈ సినిమా శుక్రవారం (మార్చి 20) డిజిటల్ డెబ్యూ చేసింది. ఏకంగా అయిదు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రిలీజైంది. ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్, ఆహా తమిళ్, సింప్లీ సౌత్, టెంట్ కోటా ఓటీటీల్లోకి ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసింది.
మూడు వారాలకే
థియేటర్లో రిలీజైన తర్వాత మూడు వారాలకే ఫోర్త్ ఫ్లోర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 27, 2026న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు మూడు వారాలు అంటే 21 రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగుపెట్టింది. మార్చి 20 నుంచి అయిదు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది.
వణికించే థ్రిల్లర్
ఆడియన్స్ ను భయంతో వణికించేలా ఫోర్త్ ఫ్లోర్ మూవీని తెరకెక్కించారు. ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ కు ఐఎండీబీలో ఏకంగా 9.1 రేటింగ్ ఉంది. మనో క్రియేషన్స్ బ్యానర్ పై ఎ.రాజా ఈ ఫోర్త్ ఫ్లోర్ సినిమాను నిర్మించాడు. ఈ మూవీకి ఎల్ఆర్ సుందరపాండి డైరెక్టర్. ఆరి అర్జునన్, దీప్శిక, పవిత్ర ప్రధాన పాత్రలు పోషించారు.
ఫోర్త్ ఫ్లోర్ స్టోరీ
ధీరన్ (ఆరి అర్జునన్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అతను గతంలో అను (పవిత్ర)ను ప్రేమిస్తాడు. కానీ ఆ తర్వాత వీళ్లు విడిపోతారు. అయితే ఒక రోజు చెన్నైకి రమ్మనిన ధీరన్ ను అను పిలుస్తుంది. సిటీకి వచ్చిన అతను ఓ ఒంటరి అపార్ట్ మెంట్ లోని ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న ఓ ఫ్లాట్ లో ఉంటాడు.
{{/usCountry}}ధీరన్ (ఆరి అర్జునన్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అతను గతంలో అను (పవిత్ర)ను ప్రేమిస్తాడు. కానీ ఆ తర్వాత వీళ్లు విడిపోతారు. అయితే ఒక రోజు చెన్నైకి రమ్మనిన ధీరన్ ను అను పిలుస్తుంది. సిటీకి వచ్చిన అతను ఓ ఒంటరి అపార్ట్ మెంట్ లోని ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న ఓ ఫ్లాట్ లో ఉంటాడు.
{{/usCountry}}ఆ ఫ్లాట్ మొత్తం దుమ్మురేగి ఉంటుంది. అందులోనే ధీరన్ ఉంటాడు. పక్క ఫ్లాట్ లోని శ్వేత (దీప్శిక)తో అతనికి ఫ్రెండ్ షిప్ స్టార్ట్ అవుతుంది. కానీ తన ఎక్స్ లవర్ అను గురించి ఎంత ప్రయత్నించినా ధీరన్ తెలుసుకోలేకపోతాడు. తన ఫ్లాట్ లో మాత్రం చిన్నపాపతో అను ఉన్న ఫొటో దొరుకుతుంది.
ఆ ట్విస్ట్
ఫోర్త్ ఫ్లోర్ లోని ఫ్లాట్ లో ఉన్న ధీరన్ కు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అతణ్ని ఎవరో ఫోర్త్ ఫ్లోర్ నుంచి తోసేసినట్లు, ఓ శక్తి వెంబడిస్తున్నట్లు కలలు వస్తాయి. మరోవైపు ఫ్లాట్ ఖాళీ చేయాలని అపార్ట్ మెంట్ వాళ్లు ఫోర్స్ చేస్తుంటారు. అసలు ఆ ఫోర్త్ ఫ్లోర్ లో ఏముంది? అను ఏమైంది? అనుతో ఉన్న చిన్న పాప ఎవరు? అనేది ఫోర్త్ ఫ్లోర్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.