OTT Thriller: 9.1 ఐఎండీబీ రేటింగ్.. థియేటర్లలో వణికించిన 'ఫోర్త్ ఫ్లోర్' ఓటీటీలోకి! 21 రోజులకే స్ట్రీమింగ్.. డేట్ ఫిక్స్
OTT Thriller: ఓ తమిళ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్లలో రిలీజైన 21 రోజులకే ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంది. ఈ థ్రిల్లర్ లో హారర్, మిస్టరీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి.
ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ తో తెరకెక్కిన తమిళ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘ఫోర్త్ ఫ్లోర్’ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. హారర్, మిస్టరీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు వచ్చేస్తుంది. థియేటర్లలో రిలీజైన 21 రోజులకే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుండటం గమనార్హం.

ఫోర్త్ ఫ్లోర్ ఓటీటీ
తమిళంలో రీసెంట్ గా థియేటర్లలో ఆడియన్స్ ను భయపెట్టిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘ఫోర్త్ ఫ్లోర్’. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. మార్చి 20 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ సన్ నెక్ట్స్ ఇవాళ (మార్చి 17) అనౌన్స్ చేసింది. సన్ నెక్ట్స్ లో ఈ థ్రిల్లర్ అందుబాటులోకి రానుంది.
21 రోజులకే
ఫోర్త్ ఫ్లోర్ మూవీ థియేటర్లలో రిలీజైన 21 రోజులకే ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా ఫిబ్రవరి 27, 2026న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు 21 రోజులకే అంటే మార్చి 20, 2026న డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీలో ఆరి అర్జునన్, దీప్శిక, పవిత్ర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఎల్ఆర్ సుందరపాండి డైరెక్టర్.
9.1 ఐఎండీబీ
థియేటర్లలో ఆడియన్స్ ను వణికించిన సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ఫోర్త్ ఫ్లోర్ కు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికి ఐఎండీబీలో 10కి గాను ఏకంగా 9.1 రేటింగ్ ఉంది. మనో క్రియేషన్స్ బ్యానర్ పై ఎ.రాజా ఈ ఫోర్త్ ఫ్లోర్ సినిమాను నిర్మించాడు.
ఫోర్త్ ఫ్లోర్ స్టోరీ
ధీరన్ (ఆరి అర్జునన్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అతను గతంలో అను (పవిత్ర)ను ప్రేమిస్తాడు. కానీ ఆ తర్వాత వీళ్లు విడిపోతారు. అయితే ఒక రోజు చెన్నైకి రమ్మనిన ధీరన్ ను అను పిలుస్తుంది. సిటీకి వచ్చిన అతను ఓ ఒంటరి అపార్ట్ మెంట్ లోని ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న ఓ ఫ్లాట్ లో ఉంటాడు.
ఆ ఫ్లాట్ మొత్తం దుమ్మురేగి ఉంటుంది. అందులోనే ధీరన్ ఉంటాడు. పక్క ఫ్లాట్ లోని శ్వేత (దీప్శిక)తో అతనికి ఫ్రెండ్ షిప్ స్టార్ట్ అవుతుంది. కానీ తన ఎక్స్ లవర్ అను గురించి ఎంత ప్రయత్నించినా ధీరన్ తెలుసుకోలేకపోతాడు. తన ఫ్లాట్ లో మాత్రం చిన్నపాపతో అను ఉన్న ఫొటో దొరుకుతుంది.
ఆ ట్విస్ట్
ఫోర్త్ ఫ్లోర్ లోని ఫ్లాట్ లో ఉన్న ధీరన్ కు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అతణ్ని ఎవరో ఫోర్త్ ఫ్లోర్ నుంచి తోసేసినట్లు, ఓ శక్తి వెంబడిస్తున్నట్లు కలలు వస్తాయి. మరోవైపు ఫ్లాట్ ఖాళీ చేయాలని అపార్ట్ మెంట్ వాళ్లు ఫోర్స్ చేస్తుంటారు. అసలు ఆ ఫోర్త్ ఫ్లోర్ లో ఏముంది? అను ఏమైంది? అనుతో ఉన్న చిన్న పాప ఎవరు? అనేది ఫోర్త్ ఫ్లోర్ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


