Today OTT: పొట్టేల్ ఫైట్.. ఇవాళ ఓటీటీలోకి వ‌చ్చిన త‌మిళ థ్రిల్ల‌ర్‌.. 8 ఐఎండీబీ రేటింగ్‌

Today OTT: ఈ రోజు ఓటీటీలోకి ఓ డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్ తో కూడిన తమిళ థ్రిల్లర్ వచ్చేసింది. పొట్టేల్ ఫైట్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లో అలరించేందుకు వచ్చేసింది. 

Published on: Mar 2, 2026, 14:37:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కొత్త వారం వచ్చేసింది. ఓటీటీలో కొత్త సందడి షురూ అయింది. ఇవాళ డిజిటల్ స్ట్రీమింగ్ కు ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో కూడిన మూవీ ‘జాకీ’ వచ్చేసింది. సూపర్ హిట్ గా నిలిచిన ఈ తమిళ సినిమా ఈ రోజు (మార్చి 2) ఓటీటీలో అడుగుపెట్టింది.

ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ (x)
ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ (x)

జాకీ ఓటీటీ

డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన తమిళ థ్రిల్లర్ జాకీ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. సోమవారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలో టెంట్ కోటా ఓటీటీలో ఈ మూవీని డిజిటల్ ఆడియన్స్ చూడొచ్చు. అంతకుముందు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రెంట్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.

థియేటర్ రెస్పాన్స్

తమిళ సినిమా ‘జాకీ’ 2026 జనవరి 23న థియేటర్లలో రిలీజైంది. ముందుగా పొంగల్ రేసులో నిలవాలని సినిమా మేకర్స్ ప్రయత్నించారు కానీ మూవీ రిలీజ్ వాయిదా పడింది. చివరకు జనవరి 23న థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాలో యువన్ కృష్ణ‌, రిధాన్ కృష్ణ‌ాస్, అమ్ము అభిరామి, మధుసూధన్ రావు, సీతన్ మోహన్, శరణ్య రవి తదితరులు నటించారు.

రెండు నెలల తర్వాత

జాకీ మూవీ రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీ థియేట్రికల్ రన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ఐఎండీబీలో 10కి 8 రేటింగ్ ఉంది. జాకీ మూవీకి ప్రగభల్ డైరెక్టర్. దీన్ని పీకే7 స్టూడియోస్ పై ప్రేమ కృష్ణ‌ దాస్, సి.దేవదాస్, జయ దేవదాస్ నిర్మించారు. ఇప్పుడు రెండు నెలల తర్వాత జాకీ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

జాకీ స్టోరీ

తమిళనాడులోని మధురై చుట్టుపక్కల పొట్టేల్ ఫైట్ చాలా ఫేమస్. ఈ కాన్సెప్ట్ తీసుకుని జాకీ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలోని నటీనటులు నిజమైన పొట్టేల్ తో ట్రైనింగ్ తీసుకుని మరీ మూవీస్ లో నటించారు. పొట్టేల్ పందెలు అంటే కేవలం జంతువుల మధ్య పోరు మాత్రమే కాదు ఇద్దరు వ్యక్తుల మధ్య ఫైట్, దాని వెనుక ఎంతో కథ ఉంటుందని జాకీలో చూపించారు.

రామర్ (యువన్ కృష్ణ) దగ్గర ఒక పోట్టేల్ ఉంటుంది. దాన్ని ఫైట్ కు రెడీ చేస్తాడు. మరోవైపు కార్తి (రిధాస్) పొట్టేల్ వరుసగా ఛాంపియన్ గా నిలిచి, జాకీ టైటిల్ దక్కించుకుంటూనే ఉంటుంది. ఓ సారి ఫైట్ లో రామర్, కార్తి పొట్టేళ్లు తలపడతాయి. అప్పుడు రామర్ పొట్టేల్ విజేతగా నిలుస్తుంది. అది తట్టుకోలేని కార్తి ప్రతీకారం కోసం ఏం చేశాడు? రామర్ కథ ఏంటీ? అన్నది జాకీ సినిమాలో చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More