...
...
Next Story

Friday Top OTT Releases: అస‌లైన ఎంట‌ర్‌టైన్మెంట్ పండ‌గ‌-ఓటీటీలో ఫ్రైడే టాప్ రిలీజ్‌లు ఇవే-రొమాంటిక్ డ్రామా టు మిస్ట‌రీ!

Friday Top OTT Releases: ఇది కదా అసలైన ఎంట‌ర్‌టైన్మెంట్ పండ‌గ‌ అంటే. ఈ శుక్రవారం ఓటీటీలో సందడి మామూలుగా లేదు. దసరా సెలవులకంటే ఒక రోజు ముందు డిజిటల్ స్ట్రీమింగ్ కు అదిరిపోయే సినిమాలు వచ్చాయి. ఇందులో రొమాన్స్, సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్లున్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.

Published on: Oct 9, 2026, 11:15:27 IST
Advertisement

Friday Top OTT Releases: ఈ శుక్రవారం (అక్టోబర్ 9, 2026) డిజిటల్ ఆడియన్స్ కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సరికొత్త వినోదాన్ని మోసుకొచ్చాయి. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజాలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా, లయన్స్ గేట్ ప్లే, మనోరమా మ్యాక్స్ వేదికగా యాక్షన్, సస్పెన్స్, రూరల్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ డ్రామాలు విడుదలై అలరిస్తున్నాయి.

ఖలీఫా (Khalifa)

అస‌లైన ఎంట‌ర్‌టైన్మెంట్ పండ‌గ‌-ఓటీటీలో ఫ్రైడే టాప్ రిలీజ్‌లు ఇవే-రొమాంటిక్ డ్రామా టు మిస్ట‌రీ!
అస‌లైన ఎంట‌ర్‌టైన్మెంట్ పండ‌గ‌-ఓటీటీలో ఫ్రైడే టాప్ రిలీజ్‌లు ఇవే-రొమాంటిక్ డ్రామా టు మిస్ట‌రీ!

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఈ మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి రావడం విశేషం. ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, మనోరమా మ్యాక్స్, లయన్స్ గేట్ ప్లే, సింప్లీ సౌత్, స్టార్జ్ ప్లేలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు వైశాఖ్ మార్క్ ఎలివేషన్లు, పృథ్వీరాజ్ మాస్ ప్రెజెన్స్, మోహన్‌లాల్ సర్‌ప్రైజ్ క్యామియో ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.

మారెమ్మ (Maremma)

మాస్ మహారాజ రవితేజ తమ్ముడు కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా నటించిన తెలుగు రా అండ్ రస్టిక్ థ్రిల్లర్ ‘మారెమ్మ’. ఈ మూవీ ఇవాళ నుంచి ప్రైమ్ వీడియో, ఆహా వీడియో ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

తెలంగాణ గ్రామీణ ప్రాంతం, స్థానిక దేవత జాతర, మూఢనమ్మకాలు, జంతు బలి సంప్రదాయం చుట్టూ తిరిగే రా అండ్ రస్టిక్ మూవీ మారెమ్మ. గ్రామీణ నేపథ్యం ఉన్న ఎమోషనల్ అండ్ డార్క్ కంటెంట్ ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు ఇది పర్ఫెక్ట్ వీకెండ్ ఛాయిస్.

రిపోర్టింగ్ లైవ్ (Reporting Live)

డైరెక్ట్ గా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన థ్రిల్లర్ ఇది. పరిణీతి చోప్రా, దేవేన్ భోజానీ, అమోల్ పాలేకర్ కీలక పాత్రలు పోషించారు. అక్రమ మైనింగ్, పొలిటికల్ నెట్‌వర్క్‌పై ఒక జర్నలిస్ట్ జరిపిన ధైర్యవంతమైన పోరాటం ఈ చిత్ర కథాంశం. థ్రిల్లర్ ప్రియులను కట్టిపడేసే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఇందులో హైలైట్‌గా నిలుస్తుంది.

ఎపిక్ (EPIC)

కేరళ బాక్సాఫీస్ వద్ద విమర్శకుల మెప్పు పొందిన సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్ డ్రామా. పోలీస్ కేస్ ఆఫీసర్‌గా పార్వతి అత్యుత్తమ నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది. ఈ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది.

ప్యారీస్ కేఫ్ (Paris Cafe)

ఒక కేఫ్ బ్యాక్‌డ్రాప్‌లో గతంలోని చేదు జ్ఞాపకాలు, కుటుంబ రహస్యాలు, రిలేషన్‌షిప్ ట్విస్టులతో సాగే ఎమోషనల్ సస్పెన్స్ మూవీ ఇది. ఈ తమిళ మూవీ ఒకే రోజు ప్రైమ్ వీడియో, ఆహా తమిళ్, సింప్లీ సౌత్ ఓటీటీల్లోకి వచ్చేసింది.

వీడియో (Video)

కన్నడలో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన వీడియో మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదో క్రైమ్ మిస్టరీ డ్రామా. ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks