Gandhi Jayanthi OTT: భారత స్వాతంత్య్ర పోరాట మార్గదర్శి, జాతిని ఏకతాటిపైకి తెచ్చి స్వేఛ్చా వాయువులు పీల్చేలా చేసిన మహా మనిషి మహాత్మా గాంధీ. ఇవాళ ఆయన జయంతి. ప్రతి ఏటా గాంధీ జయంతిని దేశ ప్రజలు ఘనంగా జరుపుకొంటారు. ఈ సందర్భంగా గాంధీ గొప్పతనాన్ని, ఆయన జీవిత పాఠాలను చూపించిన సినిమాల ఓటీటీ వివరాలు ఇక్కడ చూసేయండి.
మహాత్మ

దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన 'మహాత్మ' చిత్రం నటుడు శ్రీకాంత్ కెరీర్‌లో 100వ సినిమాగా నిలిచింది. రౌడీయిజం, సెటిల్మెంట్లు చేస్తూ తిరిగే 'దాసు' అనే యువకుడు అనుకోకుండా గాంధేయ మార్గానికి ఆకర్షితుడై, హింస కంటే అహింసే అత్యంత బలమైన ఆయుధమని ఎలా నిరూపించాడో ఈ చిత్రం ఎమోషనల్‌గా చూపిస్తుంది.
భావన హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోని అందించిన పాటలు, కృష్ణవంశీ మార్క్ డైలాగులు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 ఓటీటీలతో పాటు యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంది.
శంకర్ దాదా జిందాబాద్
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ మూవీ గురించి కూడా చెప్పుకోవాలి. బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ 'లగే రహో మున్నాభాయ్' ఆధారంగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో 'గాంధీగిరి' భావజాలాన్ని ఆవిష్కరించారు. ఒక లోకల్ దాదా గాంధేయ మార్గాన్ని ఎంచుకుని, ఎదుటివారిలో మార్పు తేవడానికి పువ్వులు ఇవ్వడం. కోపానికి బదులు ప్రేమను పంచడం వంటి సూత్రాలను ఆచరించడం ఆలోచింపజేస్తుంది. ఈ సినిమా సన్ ఎన్‌ఎక్స్‌టీ, ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది.
గాంధీ
ఆస్కార్ అవార్డు గ్రహీత రిచర్డ్ అటెన్‌బరో రూపొందించిన 'గాంధీ' మూవీ ఎంతో స్పెషల్. బెన్ కింగ్స్లే ప్రధాన పాత్రలో జీవించిన ఈ దృశ్యకావ్యం.. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా పోరాటం నుంచి భారతీయ స్వాతంత్య్ర సంగ్రామం వరకు సాగించిన అహింసా యుధ్ధాన్ని కళ్లకు కడుతుంది. ఎనిమిది ఆస్కార్ పురస్కారాలను గెలుచుకున్న ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ చిత్రం సోనీ లివ్, ప్రైమ్ వీడియోలలో తెలుగు డబ్బింగ్లో అందుబాటులో ఉంది.
గాంధీ టాక్స్
{{/usCountry}}ఆస్కార్ అవార్డు గ్రహీత రిచర్డ్ అటెన్‌బరో రూపొందించిన 'గాంధీ' మూవీ ఎంతో స్పెషల్. బెన్ కింగ్స్లే ప్రధాన పాత్రలో జీవించిన ఈ దృశ్యకావ్యం.. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా పోరాటం నుంచి భారతీయ స్వాతంత్య్ర సంగ్రామం వరకు సాగించిన అహింసా యుధ్ధాన్ని కళ్లకు కడుతుంది. ఎనిమిది ఆస్కార్ పురస్కారాలను గెలుచుకున్న ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్ చిత్రం సోనీ లివ్, ప్రైమ్ వీడియోలలో తెలుగు డబ్బింగ్లో అందుబాటులో ఉంది.
గాంధీ టాక్స్
{{/usCountry}}విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరీ ప్రధాన పాత్రలు పోషించి మూకీ సినిమా 'గాంధీ టాక్స్'. డైలాగులు లేని సైలెంట్ (మూకీ) మూవీగా వచ్చిన ఈ చిత్రం.. కరెన్సీ నోట్లపై ఉన్న గాంధీ రూపానికి, నేటి సమాజంలో పెరిగిన ధనాశకు మధ్య ఉన్న మానసిక ఘర్షణను చర్చిస్తుంది. ఏఆర్ రెహమాన్ అద్భుతమైన నేపథ్య సంగీతంతో సాగే ఈ వినూత్న చిత్రాన్ని జీ5 వేదికగా వీక్షించవచ్చు.
హే రామ్
కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘హే రామ్’ మూవీ కూడా గాంధీ తత్వాన్ని చాటింది. దేశ విభజన నాటి మతకల్లోలాలు, ఆ క్లిష్ట పరిస్థితుల్లో గాంధీజీ శాంతి ప్రయత్నాలను, ఆయన ఆలోచనలను ఈ చిత్రం లోతుగా విశ్లేషిస్తుంది. గాంధీజీ పాత్రలో నసీరుద్దీన్ షా అద్భుతంగా ఒదిగిపోగా.. షారుఖ్ ఖాన్, కమల్ హాసన్ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ సినిమాను ప్రైమ్ వీడియో, యూట్యూబ్‌లో చూడొచ్చు.