Garividi Lakshmi Review:

సినిమా : గరివిడి లక్ష్మి
నటీనటులు : ఆనంది, రాగ్ మయూర్, నరేష్, రాశీ, ఎల్బీ శ్రీరామ్, అవసరాల శ్రీనివాస్, అంకిత్, షకలక శంకర్ తదితరులు
డైరెక్టర్ : గౌరీ నాయుడు జమ్ము
ప్రొడ్యూర్స్ : టీజీ విశ్వప్రసాద్, క్రితి ప్రసాద్
రిలీజ్ డేట్ : అక్టోబర్ 17, 2026
ఒకప్పుడు ఉత్తరాంధ్ర సందు సంధుల్లో, పల్లె పల్లెల్లో మారుమోగిన గొంతు ఆమెది. బుర్రకథ కళాకారిణిగా ఆడియో క్యాసెట్ల ద్వారా ఎంతోమందికి చేరువైన 'గరివిడి లక్ష్మి' జీవిత కథను ఇప్పుడు వెండితెరపైకి తీసుకొచ్చారు. ఆనంది ప్రధాన పాత్రలో, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ బయోపిక్ నేడు (అక్టోబర్ 17) థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
స్టోరీ ఏంటంటే?
రెడ్డి విజయలక్ష్మి అలియాస్ గరివిడి లక్ష్మి (ఆనంది) ఉత్తరాంధ్రకు చెందిన ఒక సాధారణ మహిళ. చిన్నతనం నుంచే బుర్రకథ, జానపద కళలపై ఉన్న ఆసక్తితో ఆ రంగంలోకి అడుగుపెడుతుంది. తన అద్భుతమైన గొంతుతో, లైవ్ పర్ఫార్మెన్స్లతో అనతికాలంలోనే ఊహించని గుర్తింపు తెచ్చుకుంటుంది.
అయితే కళాకారిణిగా ఆమె సక్సెస్ సాధించినా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడుదొడుకులు, నమ్మకద్రోహాలు, అవమానాలను ఎదుర్కొంటుంది. ఇంతకీ ఆమె జీవితంలో ఎదురైన ఆ కష్టాలు ఏంటి? విజయం నుంచి పతనం వైపు ఆమె ప్రయాణం ఎలా సాగింది? చివరకు ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనేదే ఈ గరివిడి లక్ష్మి సినిమా కథ.
విశ్లేషణ
గరివిడి లక్ష్మి బయోపిక్ ను సినిమాగా ఎంచుకున్న డైరెక్టర్ గౌరి నాయుడు జమ్మును అభినందించాల్సిందే. గరివిడి లక్ష్మి పాటలు విన్నవారు చాలామంది ఉన్నా, ఆమె వెనకున్న కన్నీటి గాథ చాలామందికి తెలియదు. అలాంటి ఒక గొప్ప కళాకారిణి జీవితాన్ని నేటి తరానికి పరిచయం చేయాలనే దర్శకుడి ప్రయత్నం మెచ్చుకోదగ్గది.
{{/usCountry}}గరివిడి లక్ష్మి బయోపిక్ ను సినిమాగా ఎంచుకున్న డైరెక్టర్ గౌరి నాయుడు జమ్మును అభినందించాల్సిందే. గరివిడి లక్ష్మి పాటలు విన్నవారు చాలామంది ఉన్నా, ఆమె వెనకున్న కన్నీటి గాథ చాలామందికి తెలియదు. అలాంటి ఒక గొప్ప కళాకారిణి జీవితాన్ని నేటి తరానికి పరిచయం చేయాలనే దర్శకుడి ప్రయత్నం మెచ్చుకోదగ్గది.
{{/usCountry}}సినిమాలో లక్ష్మి ఎదుగుదల కంటే, ఆమె సక్సెస్ అయ్యాక చుట్టూ ఉన్నవాళ్లు ఆమెను ఎలా వాడుకున్నారు, ఎలా మోసం చేశారు అని చూపించే సీన్స్ ప్రేక్షకుడిని కనెక్ట్ చేస్తాయి. ముఖ్యంగా సినిమా లాస్ట్ 20 నిమిషాలు ఎమోషనల్‌గా చాలా బాగా వర్కవుట్ అయింది. కాకపోతే, ఒక బయోపిక్కు ఉండాల్సిన బలమైన డ్రామా, కథనంలో ఉండాల్సిన వేగం ఇందులో కొంచెం లోపించాయి. లక్ష్మి జీవితంలో ఎన్నో కష్టాలున్నా.. వాటిని స్క్రీన్‌పై చూపించడంలో ఎగ్జిక్యూషన్ మరింత బలంగా ఉంటే బాగుండేది.
ఎవరెలా చేశారంటే?
టైటిల్ రోల్ పోషించిన ఆనంది ఈ సినిమాకు లార్జర్ దన్ లైఫ్ అని చెప్పొచ్చు. ఒక జానపద కళాకారిణికి ఉండాల్సిన ఎనర్జీ, స్టేజ్ ప్రెజెన్స్, సహజమైన హావభావాలను ఆమె అద్భుతంగా పండించింది. స్టేజ్ పైన బుర్రకథ చెప్పే సీన్స్ లోనే కాకుండా, ఎమోషనల్ సీన్స్ లోనూ ఆనంది నటన కట్టిపడేస్తుంది. లక్ష్మి పాత్రకు ఆమె వందకు వంద శాతం న్యాయం చేసింది.
ఇక రాగ్ మయూర్ పాత్ర కూడా చాలా బాగుంది. మొదట్లో అమాయకంగా ఉంటూ, పేరు ప్రఖ్యాతలు వచ్చాక అహంకారంతో మారే నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను ఆయన చాలా ఈజ్‌తో చేశాడు. వి.కె. నరేష్ తనకున్న పరిధిలో కథకు మంచి వెయిట్ తీసుకొచ్చారు. రాశి, అంకిత్ కొయ్య తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
టెక్నికల్ గా..
దర్శకుడి ఆలోచన, కథను ఎంచుకున్న విధానం బాగున్నా.. స్క్రీన్‌ప్లేపై మరింత వర్క్ చేయాల్సింది. గరివిడి లక్ష్మి ఒరిజినల్ సాంగ్స్‌ను సినిమాలో వాడుకున్న తీరు చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. ఆదిత్య జవ్వాది కెమెరా వర్క్ విలేజ్ అట్మాస్ఫియర్‌ను, స్టేజ్ షోలను నీట్‌గా చూపించింది.
చరణ్ అర్జున్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పల్లెటూరి వాతావరణానికి పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఎడిటర్ రవితేజ గిరిజాల సెకండాఫ్‌లో కొన్ని రిపీటెడ్ సీన్స్‌ను ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత క్రిస్పీగా ఉండేది. ఉత్తరాంధ్ర యాసను పర్ఫెక్ట్గా పలికించడంలో డైలాగ్ టీమ్ సక్సెస్ అయింది.
ఫైనల్ గా..
'గరివిడి లక్ష్మి' ఒక మరుగున పడిపోయిన జానపద కళాకారిణి జీవితానికి ఇచ్చిన నిజాయితీతో కూడిన గౌరవం. ఆనంది అద్భుతమైన నటన, ఎమోషనల్ క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అయితే.. కాస్త స్లోగా సాగే కథనం, బలహీనమైన డ్రామా మైనస్ పాయింట్స్. బయోపిక్‌లు, జానపద కళల నేపథ్యంలో వచ్చే సినిమాలు ఇష్టపడేవారు ఈ వీకెండ్ లో మూవీని చూడొచ్చు.