Sri Gauri Priya: యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story) బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. రిలీజైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో ఈ చిత్రం దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సక్సెస్ మీట్ లో హీరోయిన్ గౌరి ప్రియ ఎమోషనల్ అయింది.
అమ్మ ఉంటే ఎంత బాగుండేదో

చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ మీట్ లో తన తల్లిని గుర్తు చేసుకుని శ్రీ గౌరి ప్రియ ఎమోషనల్ అయింది. ‘‘ఈ సక్సెస్ ను మా అమ్మ చూస్తే ఎంత బాగుండేదో అని అందరూ అంటున్నారు. అదొక్కటే బాధ. కానీ మా అమ్మ చూస్తోంది. ఇక్కడే ఎక్కడో ఉంది. అమ్మా.. నీ పెంపకానికి నేను పడే కష్టం ఇది’’ అని ప్రియ చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి.
ఫోన్ మోగుతూనే ఉంది
ఈ సక్సెస్ మీట్ లో గౌరి ప్రియ స్పీచ్ వీడియో వైరల్ గా మారింది. సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో ఇండస్ట్రీ నుంచి, స్నేహితుల నుంచి తనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని, తన ఫోన్ నిరంతరం మోగుతూనే ఉందని ఆమె చెప్పింది. చెన్నై లవ్ స్టోరీ సినిమాలో గౌరి ప్రియ యాక్టింగ్ కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
మూడేళ్ల క్రితం
హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ తల్లి వసుంధర మూడేళ్ల క్రితం కన్నుమూశారు. 2023లో ఆమె క్యాన్సర్ తో తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలోనే చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ సందర్భంగా అమ్మను గుర్తు చేసుకుంది శ్రీ గౌరి ప్రియ. అమ్మ వసుంధరతో గౌరి ప్రియకు గాఢమైన అనుబంధం ఉండేది.
కిరణ్ అబ్బవరానికి హిట్
వరుస ప్లాప్‌ల తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కిరణ్ అబ్బవరానికి 'చెన్నై లవ్ స్టోరీ' రూపంలో పక్కా కమర్షియల్ విక్టరీ దక్కింది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, థియేట్రికల్ రన్‌లోనే కాకుండా డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కుల ద్వారా మేకర్స్‌కు భారీ లాభాలను తెచ్చిపెట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.
{{/usCountry}}వరుస ప్లాప్‌ల తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న కిరణ్ అబ్బవరానికి 'చెన్నై లవ్ స్టోరీ' రూపంలో పక్కా కమర్షియల్ విక్టరీ దక్కింది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, థియేట్రికల్ రన్‌లోనే కాకుండా డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కుల ద్వారా మేకర్స్‌కు భారీ లాభాలను తెచ్చిపెట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.
{{/usCountry}}2024లో ‘క’ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. కానీ ఆ తర్వాత దిల్ రూబా, కే ర్యాంప్ తో అనుకున్న స్థాయి విజయాలు దక్కలేవు. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన చెన్నై లవ్ స్టోరీ సినిమాతో కిరణ్ అబ్బవరం తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.