OTT Telugu: ఓటీటీలోకి మరికొన్నిగంటల్లో తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- రౌడీ షీటర్‌గా సింగర్ రఘు కుంచె- రిలీజ్ ఎక్కడంటే?

Gedela Raju OTT Streaming In Few Hours: సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె నటించిన రస్టిక్ విలేజ్ పొలిటికల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గేదెల రాజు ఓటీటీలోకి వచ్చేయనుంది. మరికొన్ని గంటల్లో గేదెల రాజు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న గేదెల రాజు ఓటీటీ రిలీజ్ ఎక్కడో తెలుసుకుందాం.

Published on: Jul 16, 2026, 15:47:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టాలీవుడ్‌లో వైవిధ్యమైన ట్యూన్స్‌తో శ్రోతలను అలరించిన సింగర్ రఘు కుంచె ఈ మధ్య కాలంలో నటుడిగానూ తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. 'పలాస', 'దేవగుడి' వంటి చిత్రాల్లో విలక్షణమైన నెగెటివ్ పాత్రలతో మెప్పించిన ఆయన, పూర్తి స్థాయి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'గేదెల రాజు' (కాకినాడ తాలూకా).

ఓటీటీలోకి మరికొన్నిగంటల్లో తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- రౌడీ షీటర్‌గా సింగర్ రఘు కుంచె- రిలీజ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి మరికొన్నిగంటల్లో తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- రౌడీ షీటర్‌గా సింగర్ రఘు కుంచె- రిలీజ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి గేదెల రాజు

"చూస్తే ఒకటే నిజం, చూడకపోతే వంద అనుమానాలు" అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ గేదెల రాజు ఓటీటీలోకి వచ్చేయనుంది. ఈ ఏడాది ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, రఘు కుంచె నటనకు మాత్రం భారీ ప్రశంసలు దక్కాయి.

కాకినాడ బ్యాక్‌డ్రాప్‌లో పొలిటికల్ మర్డర్ మిస్టరీ

ఈ సినిమా కథ మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పరిసర ప్రాంతాల్లో సాగుతుంది. గేదెల రాజు అలియాస్ భగవంత్ రాజు (రఘు కుంచె) ఆ ప్రాంతంలో ఒక పేరుమోసిన రౌడీ షీటర్. ఎలాగైనా రాజకీయాల్లోకి ప్రవేశించి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడుతుంటాడు. కానీ అదే సీటు కోసం దుర్గ (శ్రీకాంత్ అయ్యంగార్) కూడా గట్టి ప్రయత్నాలు చేస్తుంటాడు.

ఈ ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ నడుస్తున్న సమయంలోనే ఒక రాత్రి గేదెల రాజు దారుణంగా హత్యకు గురవుతాడు. ఈ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? రాజకీయ శత్రుత్వమా లేక రాజు బలహీనతలే అతని ప్రాణం తీశాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతారు. ఈ క్రమంలో బయటపడే నిజాలు, ట్విస్టుల చుట్టూ దర్శకుడు చైతన్య మోటూరి కథను ఎంతో ఉత్సాహంగా నడిపించారు.

నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లేతో సరికొత్త థ్రిల్

దర్శకుడు చైతన్య మోటూరి ఈ మర్డర్ మిస్టరీని నడిపించడానికి నాన్-లీనియర్ స్క్రీన్ ప్లే విధానాన్ని ఎంచుకున్నారు. కథ ఒకేలా కాకుండా అనుమానితుల ఫ్లాష్ బ్యాక్ ద్వారా అటు ఇటుగా సాగుతూ సస్పెన్స్ పెంచుతుంది.

కథలో రిచ్ (వికాస్), మీరా (మౌనిక), విజయ్ (రామచంద్రం), సత్య (టీనా శ్రావ్య), నాటక కళాకారుడు శివయ్య (రవి ఆనంద్) పాత్రలు గేదెల రాజు వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డాయో చూపిస్తూ ప్రతి ఒక్కరినీ అనుమానితులుగా నిలబెట్టిన తీరు పర్వాలేదనిపిస్తుంది.

రఘు కుంచె వన్ మ్యాన్ షో.. అదిరిపోయే మ్యూజిక్

నటుడిగా రఘు కుంచె కెరీర్‌లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలుస్తుంది. రౌడీ షీటర్ పాత్ర కోసం ఆయన పండించిన కాకినాడ యాస, నడక, రస్టిక్ బాడీ లాంగ్వేజ్ పక్కా లోకల్ రౌడీని తలపిస్తాయి. నటుడిగానే కాకుండా ఈ చిత్రానికి ఆయనే స్వయంగా సంగీతం అందించడం మరో విశేషం.

రఘు కుంచె ఇచ్చిన నేపథ్య సంగీతం (BGM) ప్రతి సీన్‌ను ఎలివేట్ చేస్తూ క్రైమ్ థ్రిల్లర్ మూడ్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. వాణి రవికుమార్ మోటూరి నిర్మించిన ఈ లోకల్ క్రైమ్ మిస్టరీని వీకెండ్‌లో ఇంట్లోనే కూర్చుని చూసి ఆస్వాదించడానికి ఓటీటీ లవర్స్ సిద్ధంగా ఉండటమే ఆలస్యం.

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్

ఆహాలో గేదెల రాజు ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. జూలై 17న ఆహాలో గేదెల రాజు ఓటీటీ రిలీజ్ అవనుంది. అంటే, అందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సుమారు 3 నెలలకు ఓటీటీలో అందుబాటులో ఉండనుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More