Geetu Mohandas: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా వస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఎమోషనల్ కామెంట్లు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
టాక్సిక్ ట్రైలర్

యశ్ ‘టాక్సిక్’ మూవీ ట్రైలర్ ను శనివారం (ఆగస్టు 8) మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఎమోషనల్ అయింది. ఈ ప్రాజెక్ట్ కోసం తాను పడిన కష్టాన్ని, కుటుంబం ఇచ్చిన సహకారాన్నిగీతూ గుర్తు చేసుకుంది.
అమ్మకు థ్యాంక్స్
"ముందుగా మా అమ్మకు థ్యాంక్స్ చెప్పాలి. ఇన్ని రోజులు నా కూతురిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. అమ్మకు నేనెప్పుడూ థ్యాంక్స్ చెప్పాలనుకునేదాన్ని.. ఈ రోజు ఆ క్షణం వచ్చింది. ఇలాంటి ఒక అద్భుతమైన టీమ్‌తో పనిచేయడం నా అదృష్టం" అని గీతూ తెలిపింది.
యశ్ కేవలం నటుడు కాదు
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ గురించి మాట్లాడుతూ గీతూ మోహన్ దాస్ చేసిన కామెంట్స్ అటు అభిమానులను, ఇటు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
"యశ్ అంటే ఏంటో మీరందరూ ఇప్పటికే ట్రైలర్‌లో చూశారు. కానీ నా వరకైతే యశ్ కేవలం ఒక స్టార్ ప్రొడ్యూసర్, బ్రిలియంట్ యాక్టర్ లేదా కో-రైటర్ మాత్రమే కాదు. యశ్ అంటే ఒక ఎమోషన్.. డీప్ ఎమోషన్! ఈ సినిమా తర్వాత నా కెరీర్ ప్రయాణం ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ, యశ్‌లోని ఒక భాగాన్ని నేను ఎప్పటికీ నాతో తీసుకెళ్తాను. నన్ను నమ్మి ఈ సవాలుతో కూడిన అవకాశాన్ని ఇచ్చిన యశ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని గీతూ భావోద్వేగానికి లోనైంది.
'నీ వల్ల కాదు' అన్నవాళ్లకు
ఒక మహిళా దర్శకురాలు ఇంతటి భారీ బడ్జెట్, డార్క్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ సినిమాను హ్యాండిల్ చేయగలదా అని ప్రారంభంలో వచ్చిన విమర్శలపై గీతూ గట్టిగా స్పందించింది.
{{/usCountry}}ఒక మహిళా దర్శకురాలు ఇంతటి భారీ బడ్జెట్, డార్క్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ సినిమాను హ్యాండిల్ చేయగలదా అని ప్రారంభంలో వచ్చిన విమర్శలపై గీతూ గట్టిగా స్పందించింది.
{{/usCountry}}"ఈ సినిమా ప్రారంభమైన సమయంలో 'ఇది నీ వల్ల కాదు' అని నా ముందే అన్నవాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ నా సత్తా ఏంటో, నేను ఏంటో వాళ్లకు ఈ సినిమాతో నిరూపించి చూపించాను" అంటూ గీతూ చేసిన వ్యాఖ్యలు వేడుకకు హాజరైన అభిమానుల్లో పూనకాలు తెప్పించాయి. ప్రస్తుతం ఈ ఎమోషనల్ వీడియో క్లిప్ సోషల్ మీడియా వేదికలపై ట్రెండింగ్‌లో ఉంది.
బ్రేక్ చేసి
సాధారణంగా ఇండియన్ సినిమాలో రూ.500 కోట్ల దాకా బడ్జెట్ ఉండే పీరియడ్ మాస్/గ్యాంగ్‌స్టర్ చిత్రాలను పురుష దర్శకులే హ్యాండిల్ చేస్తారనే సాంప్రదాయ భావన ఉండేది. కానీ గీతూ మోహన్ దాస్ 'టాక్సిక్'తో ఆ సీలింగ్‌ను పూర్తిగా బ్రేక్ చేసింది. యశ్ కేవలం హీరోగానే కాకుండా కో-రైటర్‌గా, ప్రొడ్యూసర్ గా ఆమె విజన్‌ను నమ్మి ఇంతటి స్వేచ్ఛను ఇవ్వడం, టాలీవుడ్ అండ్ బాలీవుడ్ చిత్రసీమల్లో లేడీ డైరెక్టర్ల స్థానాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే పరిణామమని చెప్పొచ్చు.