Brown OTT: నైంటీస్ లో బాలీవుడ్‌ను తన గ్లామర్‌తో ఊపేసిన స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్, ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త ఓటీటీ వెబ్ సిరీస్ 'బ్రౌన్' (Brown) ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
బోల్డ్ పోలీస్ గా కరిష్మా

ఇన్నాళ్లూ గ్లామరస్ రోల్స్‌లో కనిపించిన కరిష్మా కపూర్.. ఈ నియో-నాయర్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ బ్రౌన్ లో పూర్తిగా డిఫరెంట్ గా కనిపించింది. సిగరెట్ తాగుతూ, మందు కొడుతూ బోల్డ్ పోలీస్ ఆఫీసర్ గా ఆమె నటించింది. కోల్‌కతా నగరంలోని చీకటి కోణాలు, నేరాల నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఒకరకమైన ఉత్కంఠను కలిగిస్తోంది.
ఇందులో కరిష్మా తన గతాన్ని మర్చిపోలేక, మద్యానికి బానిసైన రీటా బ్రౌన్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఒక ఘోరమైన మర్డర్ కేసును ఛేదించే క్రమంలో ఆమె ఎలాంటి మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నారనేది ఈ కథ సారాంశం.
మర్డర్ మిస్టరీ
కోల్‌కతా నగరంలోని భయానక వాతావరణం నేపథ్యంలో 'బ్రౌన్' సిరీస్ సాగుతుంది. ఒకప్పుడు ఇంటెలిజెంట్ అండ్ టాప్ పోలీస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న రీటా బ్రౌన్ (కరిష్మా కపూర్).. వ్యక్తిగత, వృత్తిపరమైన ఒడిదొడుకుల వల్ల వ్యవస్థకు పూర్తిగా దూరమవుతుంది. అయితే, నగరంలోని ఒక బడా వ్యాపారవేత్త కూతురిని ఎవరో దారుణంగా హత్య చేయడంతో, రీటా మళ్లీ డ్యూటీలోకి రాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆమెకు తోడుగా ఇన్స్పెక్టర్ అర్జున్ సిన్హా (సూర్య శర్మ) వస్తాడు. అర్జున్ కూడా భార్యను కోల్పోయిన బాధలో, తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తూ ఉంటాడు. ఈ ఇద్దరూ కలిసి నగరంలో వరుస హత్యలకు పాల్పడుతున్న ఒక సీరియల్ కిల్లర్ కోసం అన్వేషణ ప్రారంభిస్తారు. మరి ఆ క్రిమినల్ దొరికాడా? లేదా? అన్నది బ్రౌన్ వెబ్ సిరీస్ లో చూడాల్సిందే.
పూర్తిగా డిఫరెంట్
{{/usCountry}}ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆమెకు తోడుగా ఇన్స్పెక్టర్ అర్జున్ సిన్హా (సూర్య శర్మ) వస్తాడు. అర్జున్ కూడా భార్యను కోల్పోయిన బాధలో, తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తూ ఉంటాడు. ఈ ఇద్దరూ కలిసి నగరంలో వరుస హత్యలకు పాల్పడుతున్న ఒక సీరియల్ కిల్లర్ కోసం అన్వేషణ ప్రారంభిస్తారు. మరి ఆ క్రిమినల్ దొరికాడా? లేదా? అన్నది బ్రౌన్ వెబ్ సిరీస్ లో చూడాల్సిందే.
పూర్తిగా డిఫరెంట్
{{/usCountry}}కరిష్మా కపూర్ సినీ కెరీర్‌లోనే అత్యంత కష్టమైన, భావోద్వేగాలతో కూడిన పాత్ర ఇదని చెప్పవచ్చు. 2020లో 'మెంటల్‌హుడ్' సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన ఈ సీనియర్ నటి, ఆ తర్వాత 'మర్డర్ ముబారక్' చిత్రంలో మెరిసింది. కానీ, 'బ్రౌన్' సిరీస్‌లో ఆమె పోషించిన రీటా బ్రౌన్ పాత్ర వాటన్నింటికంటే పూర్తి భిన్నమైనది, చీకటి కోణాలతో కూడినదని చెప్పొచ్చు.
స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బ్రౌన్ వెబ్ సిరీస్ ఇప్పటికే ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జరిగిన 'బెర్లినాల్ సిరీస్ మార్కెట్ సెలెక్ట్స్ 2023' (Berlinale Series Market Selects 2023)కు ఎంపికైన ఏకైక భారతీయ వెబ్ సిరీస్‌గా ఇది రికార్డు సృష్టించింది.
అభీక్ బారువా రాసిన 'సిటీ ఆఫ్ డెత్' అనే నవల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. 'ఢిల్లీ బెల్లీ' ఫేమ్ అభినయ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను జీ స్టూడియోస్ నిర్మించింది. జూన్ 5వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5)లో 'బ్రౌన్' సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: 'బ్రౌన్' వెబ్ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ విడుదలవుతుంది?
జవాబు: కరిష్మా కపూర్ నటించిన 'బ్రౌన్' క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ జూన్ 5 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జీ5' (ZEE5) లో స్ట్రీమింగ్ కానుంది.
ప్రశ్న: ఈ సిరీస్‌లో కరిష్మా కపూర్ పాత్ర ఏమిటి?
జవాబు: ఇందులో కరిష్మా కపూర్ కోల్‌కతా పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన రీటా బ్రౌన్ అనే డిప్రెషన్, మద్యానికి బానిసైన పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించింది.
ప్రశ్న: 'బ్రౌన్' సిరీస్ దేని ఆధారంగా తెరకెక్కింది? దీని దర్శకుడు ఎవరు?
జవాబు: అభీక్ బారువా రాసిన 'సిటీ ఆఫ్ డెత్' అనే పాపులర్ పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. దీనికి ప్రముఖ దర్శకుడు అభినయ్ దర్శకత్వం వహించాడు.