Balakrishna Koratala Siva: టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక వార్త సెన్సేషన్‌గా మారింది. 'గాడ్ ఆఫ్ మాసెస్' నందమూరి బాలకృష్ణ, సక్సెస్‌ఫుల్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ సినిమా రాబోతోందన్న వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇప్పటివరకు ఈ ఇద్దరి కలయికలో సినిమా రాలేదు. కానీ ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని ఫిల్మ్ నగర్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
దేవర 2 కంటే ముందే బాలయ్యతో?

ప్రస్తుతం కొరటాల శివ చేతిలో జూనియర్ ఎన్టీఆర్‌తో చేయాల్సిన ‘దేవర 2’ ఉంది. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో తన తదుపరి ప్రాజెక్ట్ (NTR 31)లో బిజీగా ఉన్నారు.
ఆ సినిమా పూర్తయ్యే వరకు 'దేవర 2' పట్టాలెక్కే అవకాశం లేదు. ఈ ఖాళీ సమయంలోనే బాలకృష్ణతో ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను పూర్తి చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మే 2వ తేదీని రానున్నట్లు భావిస్తున్నారు. జూన్ 10 నుంచి షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నారట.
ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో బాలయ్య ఓ మూవీ చేస్తున్నాడు. దాంతోపాటుగానే ఈ కొరటాల మూవీ షూటింగ్ కూడా పూర్తి చేయాలన్నది ప్లాన్. సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
సింగిల్ సిట్టింగ్‌లోనే కథకు గ్రీన్ సిగ్నల్
సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. కొరటాల శివ చెప్పిన కథను బాలకృష్ణ ఒకే సిట్టింగ్ లో ఓకే చెప్పాడట. గతంలో ఎన్నడూ చూడని విధంగా బాలయ్య ఈ మూవీలో కనిపించనున్నట్లు సమాచారం.
కొరటాల మార్క్ సామాజిక సందేశానికి బాలయ్య మార్క్ ఊర మాస్ ఎలిమెంట్స్ తోడవ్వబోతున్నట్లు సమాచారం. ఇక సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు కూడా తేలింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
{{/usCountry}}కొరటాల మార్క్ సామాజిక సందేశానికి బాలయ్య మార్క్ ఊర మాస్ ఎలిమెంట్స్ తోడవ్వబోతున్నట్లు సమాచారం. ఇక సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు కూడా తేలింది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
{{/usCountry}}1. బాలకృష్ణ - కొరటాల శివ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చిందా?
ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే మేకర్స్ నుంచి అనౌన్స్‌మెంట్ రావచ్చని సమాచారం.
2. ఈ సినిమా వల్ల 'దేవర 2' ఆలస్యమవుతుందా?
అవును. ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్లే కొరటాల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య సినిమా పూర్తయిన తర్వాతే 'దేవర 2' ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
3. బాలకృష్ణ, కొరటాల మూవీ ఏ జానర్‌లో ఉండబోతోంది?
ఇది ఒక పక్కా సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది. కొరటాల శివ గత చిత్రాలైన 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' తరహాలోనే ఒక బలమైన సామాజిక అంశం ఇందులో ఉండబోతోందట.