ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌- దేవ‌ర 2పై బిగ్ అప్‌డేట్‌- షూటింగ్‌, రిలీజ్‌పై ప్రొడ్యూస‌ర్ కామెంట్‌

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరే గుడ్ న్యూస్. దేవర్ 2 షూటింగ్, రిలీజ్ టైమ్ పై ప్రొడ్యూసర్ సుధాకర్ బిగ్ అప్ డేట్ ఇచ్చారు. దేవర 2 ఉంటుందని మరోసారి క్లారిటీగా చెప్పారు. ఇప్పటికే మేకర్స్ దేవరకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Published on: Jan 27, 2026, 12:42:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు సినీ లవర్స్ కు గుడ్ న్యూస్. ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న దేవర 2 మూవీపై బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఉంటుందా? లేదా? షూటింగ్ ఎప్పుడు? రిలీజ్ ఎప్పుడు? అనే ప్రశ్నలకు ప్రొడ్యూసర్ సుధాకర్ మిక్కిలినేని అదిరిపోయే న్యూస్ చెప్పారు.

దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్
దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్

దేవర 2 అప్ డేట్

దేవర 2 సినిమా గురించి ప్రొడ్యూసర్ సుధాకర్ మిక్కిలినేని అదిరే అప్ డేట్ ఇచ్చారు. నందిగామలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్లో సినిమా గురించి ఆయన మాట్లాడారు. దేవర పార్ట్ 2 ఎలా ఉంటుంది? వస్తుందా? లేదా? స్టార్ కాస్ట్ ఎవరు? గురించి చెప్పమని యాంకర్ అడగగా.. ‘‘మే నుంచి స్టార్ట్ అవుతుందండీ. వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుంది. మీ అందరికీ అది మరో బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అని సుధాకర్ పేర్కొన్నారు.

ఫ్యాన్స్ ఖుష్

దేవర 2పై ప్రొడ్యూసర్ సుధాకర్ క్లారిటీ ఇవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు తెగ వైరల్ చేస్తున్నారు. సుధాకర్ మాటలను బట్టి దేవర పార్ట్ 2 షూటింగ్ 2026 మేలో స్టార్ట్ కానుంది. 2027లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ఓ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత దేవర 2 షూటింగ్ లో పాల్గొనే అవకాశముంది.

దేవర గురించి

తారక్ డబుల్ రోల్ ప్లే చేసిన మూవీ దేవర. ఇందులో తండ్రి, కొడుకుగా జూనియర్ ఎన్టీఆర్ నటించాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్. దీనికి కొరటాల శివ డైరెక్టర్. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. 2024 సెప్టెంబర్ లో రిలీజైన దేవర బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. సుమారు రూ.500 కోట్ల కలెక్షన్లు ఖాతాలో వేసుకుంది.

దేవర స్టోరీ

దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు నటించారు. సైఫ్ అలీ ఖాన్ కు తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ. దీన్ని సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హ‌రికృష్ణ‌, నందమూరి కల్యాణ్ రామ్ కలిసి నిర్మించారు.

దేవర సినిమా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దులోని ఓ కొండపై ఉన్న నాలుగు గ్రామాల చుట్టూ తిరిగే కథ. దేవర (ఎన్టీఆర్), భైర (సైఫ్ అలీఖాన్) తదితరులు కలిసి సముద్రంలోని పడవల నుంచి అక్రమ ఆయుధాలను ఒడ్డుకు తీసుకు వస్తారు. దీని ద్వారా డబ్బు సంపాదిస్తారు. కానీ ఈ పని చేయడం తమ ప్రజలకు మంచిది కాదని దేవర వద్దని చెప్తాడు.

సముద్రం వైపు ఎవరు వెళ్లినా దేవర వదలడు అనే భయాన్ని కల్పిస్తాడు. కానీ ఉన్నట్లుండి దేవర కనిపించకుండా పోతాడు. అతని కొడుకు వర (ఎన్టీఆర్) పిరికివాడిగా కనిపిస్తాడు. కానీ సినిమా చివర్లో అతణ్ని ఎవరో కత్తులతో పొడిచినట్లు చూపిస్తారు. మరి వర బతికాడా? దేవర ఎక్కడున్నాడు? అనే సస్పెన్స్ తో దేవర పార్ట్ 2 కు లీడ్ ఇచ్చాడు డైరెక్టర్.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More