OTT: అద్భుతమైన మూవీ అంటూ ఎన్టీఆర్ ట్వీట్- ఓటీటీలో ట్రెండింగ్ నంబర్ 2లోకి దూసుకెళ్లిన తెలుగు సినిమా!
OTT: అద్భతమైన సినిమా అంటూ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు మూవీ దండోరాపై ప్రశంసలు కురిపించారు. ఎక్స్ లో పోస్టు పెట్టారు. దీంతో ఈ మూవీ ఓటీటీ ట్రెండింగ్ లో నంబర్ 2 ప్లేస్ లోకి దూసుకెళ్లింది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు సినిమా ‘దండోరా’ తెగ నచ్చేసింది. ఈ మూవీని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఇంకేముంది.. దండోరా మూవీ పేరు తెగ వైరల్ గా మారింది. దెబ్బకు సినిమా ఓటీటీ ట్రెండింగ్ లో టాప్-2లోకి దూసుకెళ్లింది. మీరు ఈ మూవీని చూశారా మరి!

ఎన్టీఆర్ ట్వీట్
దండోరా సినిమాపై ఎన్టీఆర్ ట్వీట్ వైరల్ గా మారింది. మూవీ అద్భుతంగా ఉందంటూ తారక్ ప్రశంసలు కురిపించాడు. ‘‘ఇప్పుడే దండోరా చూశా. లోతుగా ఆలోచింపచేసే, పవర్ ఫుల్ మూవీ. శివాజీ గారు, నవదీప్, నందు, రవి కృష్ణ, బిందు మాధవి అసాధారణ ప్రదర్శన చేశారు.
బలమైన రైటింగ్ కు, ఇలాంటి స్టోరీని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసినందుకు డైరెక్టర్ మురళీకాంత్ కు హ్యాట్సాఫ్. ఈ ప్రయత్నానికి అండగా నిలిచిన రవీంద్ర బెనర్జీకి కుడోస్. అద్భుతమైన మూవీలో భాగమైన ప్రతి ఒక్కరికి అభినందనలు’’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.
ఫ్యాన్ బాయ్ మూమెంట్
జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ పట్ల ప్రొడ్యూసర్ రవీంద్ర బెనర్జీ ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘అన్నా.. ఇది పర్ఫెక్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్. మీ నుంచి ఇలాంటిది రావడం నాకెంతో ముఖ్యమైంది. ఇది మేం సాధించిన ఘనత. మా హంబుల్ అటెంప్ట్ ను మీరు ప్రేమించినందుకు ఆనందంగా ఉంది’’ అని రవీంద్ర పోస్టు పెట్టాడు. శివాజీ కూడా ధన్యవాదాలు చెప్పాడు.
దండోరా ఓటీటీ
సామాజిక డ్రామా మూవీగా థియేటర్లలోకి వచ్చిన దండోరా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. డిసెంబర్ 25, 2025న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఆ తర్వాత మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. జనవరి 14, 2026 నుంచి ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది దండోరా మూవీ.
ట్రెండింగ్ నం 2
ప్రైమ్ వీడియోలో దండోరా జనవరి 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ తో మరోసారి దండోరా పేరు వైరల్ గా మారింది. ఈ మూవీని చూసేందుకు ఆడియన్స్ ఓటీటీకి వరుస కట్టారు. దీంతో ఇండియాలో టాప్ 2 ట్రెండింగ్ లోకి వచ్చేసింది దండోరా.
తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కుల వివక్షను చాటే మూవీ దండోరా. ఇది తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. దండోరా సినిమాకు మురళీకాంత్ డైరెక్టర్. రవీంద్ర ప్రొడ్యూసర్. ఈ సినిమాపై సోషల్ మీడియాలో పాజిటివ్ పోస్టులు వస్తున్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


