...
...
Next Story

Gopichand: గోపీచంద్ కొత్త సినిమాకు ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్.. గూస్ బంప్స్ తెప్పించేలా గ్లింప్స్‌.. యోధుడిగా మాచో మ్యాన్‌

Gopichand: మాచో మ్యాన్ గోపీచంద్ యోధుడి గెటప్ ఎత్తాడు. తన కొత్త సినిమాలో వీరుడిగా అతను నటిస్తున్నాడు. గోపీచంద్ కొత్త మూవీ పేరును సోమవారం అనౌన్స్ చేశారు. ఈ గ్లింప్స్ వీడియో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.

Updated on: Apr 13, 2026, 12:01:51 IST
Advertisement

Gopichand: గోపీచంద్ కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ సారి డిఫరెంట్ స్టోరీతో పక్కా హిట్ కొట్టేందుకు ప్లాన్ వేసుకున్నాడు. గోపీచంద్ కొత్త సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. సినిమా టైటిల్ రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

భరతవర్ష

కొత్త సినిమా పోస్టర్ లో గోపీచంద్ (x/YoursGopichand)
కొత్త సినిమా పోస్టర్ లో గోపీచంద్ (x/YoursGopichand)

గోపీచంద్ కొత్త సినిమాకు ‘భరతవర్ష’ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా పేరు చూస్తుంటేనే ఇది దేశభక్తి ప్రధానంగా సాగే చిత్రమని అర్థమవుతోంది. ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ వీడియోలో గోపీచంద్ యోధుడిగా కనిపించాడు. శత్రుమూకలను చీల్చి చెండాడుతున్నాడు.

భరతవర్ష- సాగా ఆఫ్ శూల అనే టైటిల్ ఈ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్ ను అమాంతం పెంచేసింది. ఈ గ్లింప్స్ వీడియోలో గోపీచంద్ లుక్, బీజీఎం కూడా అదిరిపోయాయి.

టైటిల్ అర్థం ఇదే

భరతవర్ష సినిమాను వేరే లెవల్ లో తెరకెక్కిస్తున్నట్లు టైటిల్ గ్లింప్స్ వీడియో చూస్తేనే అర్థమైపోయింది. ఇది ఇండియా ఇండిపెండెన్స్ కు ముందు సాగే పీరియాడిక్ డ్రామా థ్రిల్లర్ సినిమా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇందులో మైథాలజీ నేపథ్యం కూడా ఉండే అవకాశముందని అంటున్నారు.

హిట్ ఖాయమేనా?

గోపీచంద్ కు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఒక్క సాలిడ్ హిట్ కోసం అతను చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు భరతవర్ష మూవీతో ఆ హిట్ దక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో గోపీచంద్ సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

ఆ డైరెక్టర్

ఈ సినిమాకు సంకల్ప్ రెడ్డి డైరెక్టర్. ఘాజీ, అంతరిక్షం లాంటి సినిమాలు తీసిన సంకల్ప్ మరోసారి డిఫరెంట్ స్టోరీ లైన్ ను ఎంచుకున్నాడు. భారత దేశ చరిత్రలోని ఓ కొత్త అధ్యాయాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

భరతవర్ష సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు. గోపీచంద్ కెరీర్ లో ఇది 33వ సినిమా.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks