Gunde Ninda Gudi Gantalu Serial August 11th Promo: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు రోజు రోజుకూ ఉత్కంఠ రేపుతూ సాగుతోంది. రోహిణి మలేషియా నాటకాన్ని బట్టబయలు చేసి ఆమెను ఇంట్లో నుంచి తరిమేలా చేసిన బాలు, మీనా అక్కడితో ఆగకుండా ఆమె దాస్తున్న రహస్యాన్ని ప్రభావతి ముందు పెట్టడానికి పెద్ద ప్లానే వేస్తారు.
బాలు, మీనా కొత్త ప్లాన్

స్టార్ మా తాజాగా రిలీజ్ చేసిన గుండె నిండా గుడి గంటలు సీరియల్ కొత్త ప్రోమోలో బాలు, మీనా సరసాలాడుతున్నట్లుగా చూపించారు. మీనాను గట్టిగా పట్టుకున్న బాలు ఆమెను ముద్దేదో అడుగుతాడు అనుకుంటే.. మనం వెళ్లి రోహిణి గదిలో ఆమె దాచిన ఏవైనా సీక్రెట్స్ ఉన్నాయేమో అని చూద్దాం అంటాడు.
అది విని మీనా షాకవుతుంది. వాళ్లు లేనప్పుడు గదిలోకి వెళ్లి అలా చూడటం పద్ధతి కాదని వారిస్తుంది. మరి వాళ్లు ఉన్నప్పుడు గదిలోకి వెళ్లి మనల్ని చూడనిస్తారా.. ఏం కాదు వెళ్దాం మీనా అని ఆమెను బాలు తీసుకెళ్తాడు.
రోహిణి బీరువాలో చింటు డ్రెస్
గదిలోకి వెళ్లగానే మీనాను వాళ్ల బీరువా తెరిచి చూడమంటాడు బాలు. మీనా బీరువా తెరవగానే అందులో చిన్న పిల్లలు వేసుకునే డ్రెస్ కనిపిస్తుంది. అది చూడగానే మీనా షాక్ తింటుంది. బాలుకి చూపిస్తుంది. దాచి పెట్టారంటే కచ్చితంగా ఏదో రహస్యం దాగి ఉన్నట్లే.. ఈ డ్రెస్ ఎవరిది.. దీని వెనుక ఉన్నది ఎవరో కచ్చితంగా కనిపెట్టాల్సిందే అని బాలు అంటాడు.
అక్కడితో సీరియల్ ప్రోమో ముగుస్తుంది. పార్లరమ్మ దాచిన చింటు సీక్రెట్ ను బాలు బయటపెడతాడా? ఆమెను ఇంటికి పూర్తిగా దూరం చేస్తాడా అన్న ఆసక్తి నెలకొంది. చింటు రోహిణి కొడుకే అన్న నిజం తెలిస్తే బాలు రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆ తర్వాత రోహిణి పరిస్థితి ఏమవుతుందో రాబోయే ఎపిసోడ్లలో తేలనుంది.
ఇంటికి తిరిగొచ్చిన మనోజ్
{{/usCountry}}అక్కడితో సీరియల్ ప్రోమో ముగుస్తుంది. పార్లరమ్మ దాచిన చింటు సీక్రెట్ ను బాలు బయటపెడతాడా? ఆమెను ఇంటికి పూర్తిగా దూరం చేస్తాడా అన్న ఆసక్తి నెలకొంది. చింటు రోహిణి కొడుకే అన్న నిజం తెలిస్తే బాలు రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆ తర్వాత రోహిణి పరిస్థితి ఏమవుతుందో రాబోయే ఎపిసోడ్లలో తేలనుంది.
ఇంటికి తిరిగొచ్చిన మనోజ్
{{/usCountry}}అంతకుముందు సీరియల్ సోమవారం (ఆగస్ట్ 10) ఎపిసోడ్ లో మనోజ్ ను పోలీస్ స్టేషన్ నుంచి బాలు, సత్యం ఇంటికి తీసుకొస్తారు. స్టేషన్ లోనూ మనోజ్ రచ్చ చేయడం, అరుణ్ తో బాలు గొడవ పడటంతో అతన్ని జైలుకు పంపించడానికి అరుణ్ సిద్ధమవుతాడు. అయితే సత్యం కంటతడి పెట్టడంతో అరుణ్ వెనక్కి తగ్గుతాడు. మనోజ్ ను పంపించేస్తాడు. అతన్ని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఈ సమస్యలకు పరిష్కారం రావాలంటే సుశీల రావాల్సిందే అని బాలు, సత్యం అనుకుంటారు.
తాను వెళ్లి అమ్మను తీసుకొస్తానని సత్యం అంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా రోహిణి మోసం గురించే మనోజ్ తలుచుకొని ఏడుస్తుంటాడు. తల్లి ప్రభావతి కూడా లేకపోవడంతో అతని పరిస్థితి మరింత దారుణంగా తయారువుతుంది. మరి ఇప్పుడు బాలు, మీనా కలిసి వేసిన కొత్త ప్లాన్ తో రోహిణి పరిస్థితి ఏమవుతుంది? అది తెలిసి మనోజ్ ఏమవుతాడో చూడాలి.