...
...
Next Story

గుండె నిండా గుడి గంటలు మెగా సెలబ్రేషన్స్.. మీనాతో బాలు రొమాన్స్.. కుళ్లుకున్న శ్రీముఖి.. ప్రోమోతోనే రచ్చ రచ్చ

Gunde Ninda Gudi Gantalu Serial: గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీమ్ ఈసారి ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో రచ్చ చేయబోతోంది. కేవలం రెండు నిమిషాల ప్రోమోతోనే బాలు, మీనా రొమాన్స్ తోపాటు వాళ్లను చూసి శ్రీముఖి కుళ్లకునే సీన్లతో ఆసక్తి రేపుతోంది.

Published on: Jul 7, 2026, 22:10:34 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఎంతలా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలుసు కదా. ఇప్పటికే 700కుపైగా ఎపిసోడ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ సీరియల్ టీమ్ మెగా సెలబ్రేషన్స్ కోసం శ్రీముఖి హోస్ట్ చేసే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి రాబోతోంది.

గుండె నిండా గుడి గంటలు టీమ్ ప్రోమో

గుండె నిండా గుడి గంటలు మెగా సెలబ్రేషన్స్.. మీనాతో బాలు రొమాన్స్.. కుళ్లుకున్న శ్రీముఖి.. ప్రోమోతోనే రచ్చ రచ్చ
గుండె నిండా గుడి గంటలు మెగా సెలబ్రేషన్స్.. మీనాతో బాలు రొమాన్స్.. కుళ్లుకున్న శ్రీముఖి.. ప్రోమోతోనే రచ్చ రచ్చ

స్టార్ మా ఛానెల్లో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎంత పాపులరో.. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వచ్చే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో కూడా అంతే పాపులర్. ప్రముఖ యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేసే ఈ షో ప్రతి వారం ఓ కొత్త సీరియల్ లేదా షో టీమ్ తో రచ్చ చేస్తుంది. ఈవారం గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీమ్ మొత్తం ఈ షోకి వచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా మంగళవారం (జులై 7) రిలీజ్ చేసింది.

బాలు, మీనా రొమాన్స్

గుండె నిండా గుడి గంటలు సీరియల్ పేరు వినిపించగానే బాలు, మీనానే గుర్తుకు వస్తారు. ఈ సీరియల్లో ఈ రోల్స్ పోషించిన విష్ణుకాంత్, అమూల్య గౌడ ఈ షోలోనూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బాలుపై ఎప్పుడూ మనసు పారేసుకునే శ్రీముఖి.. ఈ ప్రోమోలో అతన్ని చూసి మెలికలు తిరగడం చూడొచ్చు. అయితే మీనాతో రొమాన్స్ చూసి ఆమె కుళ్లుకుంటుంది.

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీమ్ మొత్తం రావడంతో ఈ ఆదివారం షోలో రచ్చ రచ్చ ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో అత్త ప్రభావతి పాత్రలో జీవించేసే అనీలా శ్రీకుమార్, సత్యం పాత్రలో నటించే శ్రీకాంత్ గౌడ కూడా ఈ షోకి వచ్చారు.

అటు మనోజ్, రవి, రోహిణి, శృతి పాత్రధారులు కూడా హంగామా చేశారు. ప్రతి రోజూ సీరియల్లో వీళ్లను చూసి మురిసిపోయే ప్రేక్షకులకు ఈసారి స్టేజ్ పై వాళ్లు ఎలా ఉంటారో చూసే అవకాశం కలిగింది. మరి ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ షోని మిస్ కాకుండా చూడండి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe