Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఓ స్కూల్ దగ్గరికి సత్యం వెళ్తాడు. వెళ్లి కరాస్పాండెంట్‌ను కలుస్తాడు. రంగారావు పంపించాడని చెప్పడంతో సత్యంను మర్యాదగా చూస్తాడు. ఏదైనా జాబ్ చేయాలని అనుకుంటున్నట్లు చెబుతాడు సత్యం. రంగారావు గారు మిమ్మల్ని అకౌంటెంట్‌గా రికమండ్ చేశారు. మీరు రోజు రావాల్సిన పని లేదు. వారానికి ఒకరోజు వస్తే చాలు అని అంటాడు కరాస్పాండెంట్.
అకౌంటెంట్‌గా సత్యం

ఎందుకని అని సత్యం అడిగితే.. మాకు ఇంకో స్కూల్ ఉంది. ఇంకొన్ని రోజుల్లో అక్కడ వెకెన్సీ ఉంది. అప్పటివరకు ఇక్కడే ఉండాలి. బుధవారం ఒక్కరోజు వస్తే చాలు. ఎప్పటి నుంచి రావాలో త్వరలో చెబుతాం మీ నెంబర్ మా మేనేజర్‌కి ఇచ్చి వెళ్లండని కరాస్పాండెంట్ చెబుతాడు. దాంతో సత్యం వెళ్లిపోతాడు. ఇంతలో అదే స్కూల్‌కి చింటుతో కలిసి రోహిణి, సుగుణ వస్తారు. మేనేజర్‌కు సత్యం వివరాలు ఇస్తాడు.
స్కూల్‌లో తన అకౌంటెంట్ జాబ్ గురించి రంగారావుతో మాట్లాడుతాడు. వెనుకే రోహిణి వాళ్లు వస్తారు. సత్యం వెళ్లిపోతాడు. చింటు రోజు రోహిణితో ఉంటానంటాడు. రోజు కుదరదు. ప్రతివారం ఒక రోజు వస్తానని నచ్చజెబుతుంది రోహిణి. మరోవైపు మీనా వెంట ఒకతను పడతాడు. ఓ చోట మీనా ఆపి పూలు ఇస్తుంది. అతను కూడా అక్కడే ఆగుతాడు. మీనా డౌట్‌గా చూస్తుంది. మళ్లీ మీనా వెంట పడతాడు.
వీడేంటీ వెంటపడుతున్నాడు. ఎక్కడో చోట దాక్కోవాలని కంగారుపడుతుంది మీనా. మరోవైపు బాలు ఫోన్‌లో ఫొటోలు చూస్తూ మెచ్చుకుంటుంది విద్య. రోహిణి తిడుతుంది. శివ వీడియో కోసమే తీశాం. బాలు కష్టపడి కొనుక్కుంది పడేయాలని లేదు కానీ తప్పదు. ఏ చెరువులో అయిన పడేయి. మీనా చూస్తే ప్రాబ్లమ్ అవుతుందని రోహిణి అంటుంది. ఇంతలో విద్య ఇంటి తలుపులు ఎవరో కొడతారు.
మీనా వెంట పడిన అబ్బాయి
మీనా అయింటుంది అని విద్య భయపెడుతూ డోర్ తీస్తుంది. మీనా లోపలికి వస్తుంది. ఎవడో వెంట పడుతున్నాడని చెబుతుంది. విద్య చూస్తానని వెళ్తుంది. మీనా ఎదుటే బాలు ఫోన్ ఉంటుంది. కానీ, రోహిణి చూడనివ్వకుండా ఫోన్ తీసి సోఫాలోని దిండు కింద పెడుతుంది. విద్య ఎవరు లేరు, పారిపోయి ఉంటాడని అంటుంది. సరే ఈ విషయం ఇంట్లో చెప్పకు అని రోహిణితో అంటుంది మీనా.
{{/usCountry}}మీనా అయింటుంది అని విద్య భయపెడుతూ డోర్ తీస్తుంది. మీనా లోపలికి వస్తుంది. ఎవడో వెంట పడుతున్నాడని చెబుతుంది. విద్య చూస్తానని వెళ్తుంది. మీనా ఎదుటే బాలు ఫోన్ ఉంటుంది. కానీ, రోహిణి చూడనివ్వకుండా ఫోన్ తీసి సోఫాలోని దిండు కింద పెడుతుంది. విద్య ఎవరు లేరు, పారిపోయి ఉంటాడని అంటుంది. సరే ఈ విషయం ఇంట్లో చెప్పకు అని రోహిణితో అంటుంది మీనా.
{{/usCountry}}సరేనని మీనా వెళ్లిపోతుంది. బాలు ఫోన్‌ను మీనాకు కనిపించేలా తిరుగుతున్నావని విద్యను తిడుతుంది రోహిణి. నిజంగానే ఫోన్ చెరువులో పడేయ్. నా జీవితంతో ఆడుకోకు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది రోహిణి. మరోవైపు బాలు, సురేష్ తన ఫ్రెండ్ బర్త్ డే చేస్తుంటారు. ఫ్రెండ్ తమ్ముడు వస్తాడు. అతనే మీనా వెంట పడిన వ్యక్తి. తను సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నానని, దానికి తన అన్నే కారణం చెబుతాడు.
వాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడట. ఎవరో అమ్మాయిని ఇష్టపడుతున్నాడట అని ఫ్రెండ్ చెబుతాడు. అతను కూడా ధైర్యం చాలట్లేదని మీనాను లవ్ చేసేది భర్త బాలుకే చెబుతాడు. మీనా గురించి గొప్పగా చెబుతాడు అతను. వెంటనే రోడ్డు మీద తాళి కట్టేసేయ్ అని అన్న అంటాడు. బాలును ఐడియా ఇవ్వమని సురేష్ అడుగుతాడు. అతను కూడా ఎలా మాట్లాడాలో చెప్పమని అడుగుతాడు. దాంతో మీనాతో ఎలా మాట్లాడాలో బాలునే చెబుతాడు.
మీనా పేరు లక్కీ
తనను చూడగానే నీకు లక్కు కలిసి వచ్చింది కాబట్టి లక్కీ అని పెట్టుకో అని బాలునే నిక్ నేమ్ చెబుతాడు. నువ్వు చెప్పిందే చేస్తాను. నువ్వే నా లవ్ గురువి. థ్యాంక్స్ అన్నయ్య అని అతను అంటాడు. అంటే మీనాను ప్రేమించడానికి బాలునే లవ్ గురువుగా ఫ్రెండ్ తమ్ముడికి మారుతాడు. విద్య వెళ్తుంటే చెప్పు తెగిపోతుంది. మీనాకు తెలిసిన తాత దగ్గర చెప్పు కుట్టిస్తుంది విద్య. చెప్పు కుట్టాక డబ్బులిచ్చి వెళ్లిపోతుంది విద్య.
విద్య ఆటో ఎక్కుతుండగా బాలు ఫోన్ కింద పడిపోతుంది. అది ఆ తాత చూసి పోన్ కింద పడిపోయిందని చెబుతాడు. కానీ, విద్య వినకుండా వెళ్లిపోతుంది. ఆ ఫోన్ తీసుకొచ్చి దగ్గర పెట్టుకుంటాడు తాత. విద్యకు రోహిణి కాల్ చేసి ఫోన్ గురించి అడుగుతుంది. ఫోన్ కనిపించదు. దాంతో కంగారుగా చెరువులో పడేసానని అబద్ధం చెబుతుంది విద్య. రోహిణి ఎంత అడిగిన చెరువులో బాలు ఫోన్ పడేసినట్లు చెబుతుంది విద్య.
హమ్మా ఇప్పుడు ప్రశాంతంగా ఉందని రోహిణి అని కాల్ కట్ చేస్తుంది. ఫోన్ ఎక్కడ పడేసాను, రోహిణికి ఈ విషయం తెలియకూడదు అని కంగారుగా అనుకుంటుంది విద్య. మనోజ్‌తో షాపులో మాట్లాడుతుంది రోహిణి. ఇంతలో పనివాడు ఓ కవర్ తీసుకొచ్చి ఇది మన షాప్ ముందు పడేసారు అని చెబుతాడు. అందులో చూస్తే కోడిగుడ్లు ఉంటాయి. వాటిపై ఏవో బొమ్మలు ఉంటాయి.
మనోజ్ షాప్ ముందు చేతబడి గుడ్లు
ఇంతలో ఒకతను వచ్చి వాటిని కింద పెట్టమని కంగారుగా అంటాడు. ఇది హ్యాండ్ స్కూల్ (చేతబడి) చేసింది సర్. ఇలాంటిది మా షాప్ వెనుక కూడా పెట్టారు. మేము చాలా నష్టపోయాం. అప్పులు అయ్యాయి. మా తాత కూడా చనిపోయారు అని అతను చెబుతాడు. దాంతో మనోజ్ మరింత కంగారుపడుతాడు మనోజ్. ఇంతలో మనోజ్ ఫ్రెండ్ వస్తాడు. అతను కూడా చూసి గుడ్డు ఇక్కడ పెట్టారంటే బిజినెస్ మొత్తం పోతుంది. మీరు రోడ్డున పడతారంటాడు.
నాకు తెలిసిన స్వామిజీ ఉన్నాడు. అతనే దీనికి పరిష్కారం చెబుతాడు అని మనోజ్ ఫ్రెండ్ చెబుతాడు. దాంతో మనోజ్ సరేనంటాడు. మరోవైపు ఒకతన్ని కలిసి డెకరేషన్ గురించి అడుగుతుంది. ఇప్పుడు వేరేవాళ్లకు ఇచ్చాం. నెక్ట్స్ టైమ్ ఏ చిన్న ఆర్డర్ వచ్చిన ఇస్తాను అని అతను చెబుతాడు. దాంతో మీనా సంతోషిస్తుంది. తర్వాత బాలు సలహాతో మీనా దగ్గరి వచ్చి ఫ్రెండ్ తమ్ముడు మాట్లాడుతాడు.
మీతో ఓ విషయం మాట్లాడాలని, తన పేరు బులి, సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాను. మిమ్మల్ని చూశాకే నాకు అదృష్టం పట్టుకుంది. మీరే నా అదృష్ట దేవత అని అతను చెబుతాడు. మీ కష్టానికి ప్రతిఫలం వచ్చింది. అందరితో ఇలా అంటే పిచ్చోడు అనుకుంటారని మీనా చెబుతుంది. అతను పేరు అడిగితే చెప్పకుండా కోపంగా చూసి వెళ్లిపోతుంది మీనా. స్వామిజీని మనోజ్, రోహిణి, ఫ్రెండ్ కలుస్తారు. జరిగింది చెప్పి గుడ్డు చూపిస్తారు.
అప్పుల పాలు అవుతారు
గుడ్డు చూసిన స్వామిజీ ఇది ఆ గుడ్డే. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. అపకీర్తి, అప్పుల పాలు, అన్ని కోల్పోయి షోరూమ్ మూసుకుంటారని స్వామిజీ చెబుతాడు. మీరు చెప్పింది మేము నమ్మాలా అని రోహిణి అంటుంది. నేను సత్యమే పలుకుతాను అని స్వామిజీ అంటాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.