...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: 5 కోట్ల విల్లాలో సత్యం ఫ్యామిలీ- 5 లక్షలు ఇచ్చిన మనోజ్- మీనాతో చింతామణి ఛాలెంజ్!

Gunde Ninda Gudi Gantalu Serial April 30th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 30వ ఎపిసోడ్‌లో 5 కోట్ల విల్లా ఫేక్ ఓనర్స్‌కు మనోజ్ డబ్బు ఇచ్చేందుకు ఆలోచిస్తాడు. రోహిణి చెప్పడంతో 5 లక్షలు ఇచ్చేస్తాడు. కుటుంబంతో వచ్చి 2 రోజులు విల్లాలో ఉండమంటారు. దానికి సత్యం ఫ్యామిలీ రెడీ అవుతుంది.

Published on: Apr 30, 2026, 08:40:38 IST
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్, రోహిణి 5 కోట్ల విల్లాను కొనేందుకు అడ్వాన్స్ ఇచ్చేందుకు వెళ్తారు. అంతా తుమ్ముతుంటారు. కాసేపు ఆగి వెళ్లమని మీనా చెబుతుంది. ఇవాళే అడ్వాన్స్ ఇవ్వాల. ఇంకో రోజు పెట్టుకోండని సత్యం అంటాడు. ప్రభావతి కూడా అదే అంటుంది.

వెళ్లకుంటే మాట పోతుంది

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 30th ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఏప్రిల్ 30th ఎపిసోడ్

ఇలాంటివి ఎక్కువ పట్టించుకోకూడదు. ఎదుగుతున్నప్పుడు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. ఇక్కడున్న వాళ్లకు మనం కొనడం మింగుడు పడటం లేదు. మనం వెళ్దామని రోహిణి అంటుంది. దాంతో ఇవాళే ఇస్తామని మాటిచ్చామని, వెళ్లకుంటే మాట పోతుందని మనోజ్ అనేసి వెళ్తారు. వీళ్లకు మంచి చెప్పిన వినేలాలేరు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లు పడ్డాకే తెలుస్తుందని బాలు అంటాడు.

విల్లాలోకి మనోజ్ వెళ్తాడు. గడప తాకి కిందపడబోయి ఆగుతాడు. విల్లా ఫేక్ ఓనర్స్‌ను మనోజ్, రోహిణి కలుస్తారు. క్యాష్ తెచ్చారా అని అతను అడిగితే.. తెచ్చామని మనోజ్‌కు రూ. 5 లక్షల బ్యాగ్ ఇస్తుంది రోహిణి. కానీ, ఫేక్ ఓనర్స్‌కి డబ్బు ఇచ్చేందుకు అనుమానిస్తాడు మనోజ్. ఇంకోరోజు పెట్టుకుందామా అంటాడు. దాంతో అగ్రిమెంట్ పేపర్స్ తీసి ఏదైనా రాతపూర్వకంగా ఉంటేనే అందరికి బాగుంటుందని భార్యాభర్తలు నమ్మేలా మాట్లాడుతారు.

జరిగింది చెప్పి అపశకునంగా ఉందని, ఇల్లు విషయం కదా. నేను ఇలాంటివి బాగా నమ్ముతాను. అడ్వాన్స్ విషయం ఇంకో రోజు పెట్టుకుందామా అని మనోజ్ అడుగుతాడు. రోహిణి ఇచ్చేయమని అంటుంది. నాకెందుకో నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయని మనోజ్ అంటాడు. ఇదంతా చూస్తే నాకు కూడా ఈ ఇల్లు అమ్మడం కరెక్ట్ కాదనిపిస్తుంది. నాకు ఇంకో పార్టీ వచ్చింది. వాళ్లు 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తామన్నారు. కానీ, మీరు మంచి కుటుంబం నుంచి వచ్చారని మీకు ఇద్దామనుకున్నాను అని ఓనర్ అంటాడు.

చేజార్జుకోకూడదు

ప్లాన్ సక్సెస్ అయిందనుకున్న ఫేక్ ఓనర్స్ మిగతా బ్యాలెన్స్ ఎప్పుడిస్తారని అడుగుతారు. మీరు అపశకునాలు నమ్ముతున్నారు కాబట్టి మీ కుటుంబం అంతా వచ్చి ఈ ఇంట్లో రెండు రోజులు గడపండి. తర్వాత మిగతా మనీ ఇవ్వండని అతను అంటాడు. దాంతో మనోజ్ సరేనంటాడు. ఇంటికెళ్లి అడ్వాన్స్ ఇచ్చినట్లు చెబుతారు మనోజ్, రోహిణి. ఓనర్ మంచివాడని, ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చాడని అంటారు.

వాటికి కాలం చెల్లి చాలా కాలం అయిందని, నా ఎడమ కన్ను తెగ కొట్టేస్తుందని బాలు అంటాడు. ప్రభావతి ప్రామిసరీ నోట్ చూసి తెగ మురిసిపోతుంది. ఆ విల్లా చూపించమని ప్రభావతి అడిగితే.. ఎలా ఉంటుందో రోహిణి చెబుతుంది. అక్కడ రెండు రోజులు కూడా ఉండొచ్చు అని రోహిణి చెబుతుంది. వెళ్దామని ప్రభావతి అంటే.. పూర్తిగా గృహ ప్రవేశం కాకుండా అలా వెళ్లకూడదని సత్యం అంటాడు.

5 కోట్ల విల్లాలో సత్యం కుటుంబం

రెండు రోజులకు ఏం కాదని మనోజ్ అంటాడు. శ్రుతి, రవి తమకు చాలా దూరం అవుతుందని రామంటారు. నేను విల్లా కొంటే ఎవరు సంతోషించట్లేదు. అంతా రామంటున్నారని మనోజ్ అలుగుతాడు. ఇప్పుడు నీకు అంతా రావాలిగా. నేను చూసుకుంటాను అని బాలు అంటాడు. రవిని పక్కకు పిలిచి 5 కోట్లది 3 కోట్లకే ఇస్తున్నారంటే ఏదో తిరకాసు ఉంది. మనం వెళ్తే అది కనిపెట్టొచ్చు అని రవిని బాలు ఒప్పిస్తాడు. మరోవైపు శ్రుతిని మీనా ఒప్పిస్తుంది.

రవి, శ్రుతి వస్తామని చెబుతారు. దాంతో ప్రభావతి తెగ సంబరపడిపోతే.. బాలు పంచ్‌లు వేస్తాడు. అప్పుడు ప్రభావతి మొహం తిప్పుకుంటే ఆ ఫేస్‌ను మీమ్స్‌గా వాడుకోవచ్చని శ్రుతి అంటుంది. దాంతో అంతా నవ్వుతారు. ఇక 5 కోట్ల విల్లాలో సత్యం ఫ్యామిలీ రెండు రోజులు ఉండేందుకు సిద్ధమవుతారు. మరోవైపు మనోజ్ మోసపోయేలా ఉన్నాడని బాలు ఆలోచిస్తాడు. అసలే 3 కోట్లు అది ఎటు తిరిగి ఎటు వెళ్తుందో అని బాలు అంటాడు.

ఇంతలో మీనాకు మరో డెకరేషన్ ఆర్డర్ వస్తుంది. దాంతో మీనా సంతోషంగా వెళ్తుంది. తమ అమ్మాయి పెళ్లికి డెకరేషన్ చేయమని వారు అడుగుతారు. ఇంతలో మండపం మేనేజర్ వచ్చి ఇక్కడ డెకరేషన్ బయటి వాళ్లు చేయకూడదు. వేరే వాళ్లు ఉన్నారని, మీనాను పంపించేయమని వారికి చెబుతాడు. కానీ, వారు వినరు. రెంట్ కడుతున్నాం. మాకు నచ్చినవాళ్లతో చేయించుకుంటామని వాళ్లు అంటారు.

మీనాకు అవమానం

మీరు ఏ మండపానికి వెళ్లిన వారు రెగ్యులర్‌గా చేసేవాళ్లతోనే చేయించుకుంటారు. ఆవిడకు ఫోన్ చేశాను, మాట్లాడండి అని మేనేజర్ అంటాడు. అంతలోనే చింతామణి వస్తుంది. మీకు ఎలాంటి డెకరేషన్ అయిన నేను చేస్తాను అని చింతామణి అంటుంది. మాకు ఈవిడ డెకరేషన్ నచ్చింది. ఈవిడకే ఇస్తామని వారు అంటారు. మీరు ఇప్పటివరకు ఎన్ని డెకరేషన్స్ చేశారని మీనాను అడుగుతుంది చింతామణి.

ఒక్కటే అని మీనా చెబితే.. ఒక్కటి చేసిన అనుభవంతో ఇంత పెద్ద డెకరేషన్ చేయాలనుకుంటున్నారా. ఫన్నీగా ఉందని అవమానంగా మాట్లాడుతుంది చింతామణి. నేను ఎంత పెద్ద డెకరేషన్ అయిన చేయగలను అని మీనా అంటుంది. అవునా.. ఆవిడను ఒక కొటేషన్ ఇవ్వమనండి, నేను ఇస్తాను. ఎవరు తక్కువగా ఇస్తే వారికే ఇవ్వండి. ఇంకొకరి పొట్ట కొట్టడం నాకు ఇష్టంలేదని చింతామణి అంటుంది.

దాంతో మీనా సరేనంటుంది. అంతా డెకరేషన్, కొటేషన్ గురించి కస్టమర్స్‌కు వివరంగా చెబుతుంది మీనా. అదంతా చూసిన చింతామణి అసిస్టెంట్ వెళ్లి చెబుతాడు. చింతామణి ఒక్క నిమిషంలో కొటేషన్ రాసి ఇస్తుంది. మీనా వేసిన కొటేషన్ ఇస్తుంది. ఇంత బడ్జెట్ వేసావేంటమ్మా అని కస్టమర్స్ అడుగుతారు. మీ పెళ్లి ముహుర్తాని చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. అప్పుడు పూల రేటు బాగా ఉంటుంది. అవన్ని చూసే వేశానని మీనా చెబుతుంది. కానీ, ఎక్కువైందని వారు అంటారు.

చింతామణి ఛాలెంజ్

ఇంతలో చింతామణి కూడా కొటేషన్ ఇస్తుంది. ఈమె బడ్జెట్ నీ బడ్జెట్‌లో సగమే ఉంది. ఆరోజు డిమాండ్ ఉంటే ఆవిడకు కూడా లాసే కదా అని కస్టమర్స్ అంటారు. ఆవిడకు తెలియక వేసినట్లుందని మీనా అంటుంది. నాకు ఎక్కడో ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా పూలు తెచ్చుకోవాలో బాగా తెలుసు. అందుకే ఆవిడ కొత్తగా వచ్చింది. నాలుగు రూపాయలు వెనుకేసుకోవాలనుకుందని చింతామణి అంటుంది.

మీరు ఏ ఉద్దేశంతో అంత తక్కువ కొటేషన్ ఇచ్చారో తెలియదు. కానీ, అంత తక్కువలో చేయడం కష్టం. నేను పూలల్లో పుట్టి పెరిగినదాన్ని. మార్కెట్ నాకు బాగా తెలుసు అని మీనా అంటుంది. నేను చేసి చూపిస్తానని, నమ్మాలని లేకపోతే వచ్చి చూడమని మీనాతో చింతామణి ఛాలెంజ్ చేస్తుంది.

నేను వేసిన బడ్జెట్‌లో అంతే క్వాలిటీతో డెకరేషన్ చేసి ఇస్తాను. ముందు అడ్వాన్స్ ఇచ్చి పని పూర్తిగా నచ్చాకే డబ్బు ఇవ్వమని మీనా అంటుంది. మేము ఏదోటి ఆలోచించుకుని మీకు ఇన్ఫార్మ్ చేస్తామంటారు కస్టమర్స్. దాంతో మీనా షాక్ అవుతుంది. మీనా కస్టమర్స్‌ను అలా చింతామణి లాగేసుకుంటుంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe