Gunde Ninda Gudi Gantalu Today Episode: ఇంట్లోకి తరతరాల ఊయల, జంటలతో ముడుపులు- రోహిణికి లాక్‌డౌన్, ఇన్సూరెన్స్‌తో స్కెచ్

Gunde Ninda Gudi Gantalu Serial August 14th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 14వ తేది ఎపిసోడ్‌లో ఇంట్లోకి తరతరాల ఊయల తెప్పిస్తుంది సుశీల. ముగ్గురు మనవళ్లకు పిల్లలను కనే బరువు పెట్టానంటుంది. మనోజ్ ప్రేమను దక్కించుకునేందుకు భర్తపై హెల్త్ ఇన్సూరెన్స్ అనే కొత్త స్కెచ్ రోహిణి వేస్తుంది.

Published on: Aug 14, 2026, 08:11:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో సుశీల చెప్పడంతో బాలు, రవి వెళ్లి ఒక ముసుగేసి ఉన్న ఊయల తీసుకొస్తుంటారు. ఏంటని అడిగితే బరువు మోయడం గురించి మాట్లాడుతుంది సుశీల. ముసుగు తీసి బాలు చూపిస్తాడు. ఊయల చూసి అంతా షాక్ అవుతారు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 14 ఎపిసోడ్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 14 ఎపిసోడ్

రెండు తరాల ఊయల

ఇప్పుడు అర్థమైందా నేను అన్న బరువేంటో అని సుశీల అంటుంది. పిల్లలను కనడం గురించి సుశీల్ ఇన్‌డైరెక్ట్‌గా చెబుతుంది. ఇది రెండు తరాల ఊయల, మూడో తరాన్ని ఎప్పుడెప్పుడు మోయాలా అని చూస్తుందని సుశీల అంటుంది. రోహిణికి మనోజ్ దగ్గరవకుండా ఉండేందుకు కావాలనే కంట్లో ఏదో పడిందని మనోజ్‌ను పిలుస్తుంది ప్రభావతి.

ఏమైందమ్మా అనుకుంటూ మనోజ్ వస్తాడు. దాని పక్కన ఉంటే భగభగ మండిపోతుందని ప్రభావతి అంటుంది. మనోజ్‌ను రోహిణి పక్కకు వెళ్లమన్న సుశీల ప్రభావతి ఇదే వద్దు. భార్యాభర్తలను విడదీసినవారికి పాపం తగిలి అని అంటుంటే.. వీడికి లాగే కళ్లుపోయినట్లే అని బాలు అనబోతుంటే మీనా ఆపుతుంది. ఇది అచ్చొచ్చిన ఊయల, ఈ ఇల్లు వారసుల కోసం ఎదురుచూస్తుంది. పిల్లలు లేకపోవడంతో మీరు మీరే గొడవ పడుతున్నారని సుశీల అంటుంది.

మీ ముగ్గురు పిల్లలను కంటే ధ్యాస పిల్లలపైకి మళ్లుతుంది. ఒకరి తప్పులను ఇంకొకరు చూపకుండా ఉంటారు. ఏమ్మా శ్రుతి ఈ బుడ్డోడికి ఓ బుడ్డోడిని కనివ్వాలని సుశీల అంటుంది. నేనెప్పుడో రెడీ వీడే లేట్ చేస్తున్నాడని రవి మీదకు తప్పు తోసేస్తుంది శ్రుతి. నాకు కారణాలు ఎవరు చెప్పకూడదు. వచ్చే ఏడాదికల్లా ముగ్గురు నాకు మునిమనవళ్లను కనివ్వాలని సుశీల ఆర్డర్ వేస్తుంది.

పిల్లలు కనడానికి రెడీనా

ముగ్గురు ఇద్దరేసి కనాలని, నాకు ఆడ పిల్లలు అయినా పర్వాలేదు, ఏం ప్రభా నువ్వు రెడీనా అని ప్రభావతిని కూడా పిల్లలను కనడానికి రెడీనా అన్నట్లుగా సుశీల అంటాడు. అమ్మా అని సత్యం షాక్ అవుతాడు. అంతా షాక్ అవుతారు. దేనికండి అని అయోమయంగా అడుగుతుంది ప్రభావతి. నానమ్మా అని పిలిపించుకోడానికి అని సుశీల క్లారిటీ ఇస్తుంది.

అదా అని నవ్వుతూ ప్రభావతి అంటుంది. ఇద్దరు నానమ్మా, తాతయ్య అని సెటైర్లు వేసుకుంటారు. ఇలాగే అందరూ నవ్వుతుండాలని, అబద్ధాలు, మోసాలు అన్ని నిన్నటితో వదిలేయమని, భార్యాభర్తలు నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సుశీల అంటుంది. మీనాను తన సంచి తీసుకురమ్మంటే మీనా తీసుకొస్తుంది. ఆ సంచిలో ఉన్నవి ముగ్గురు తోడి కోడళ్లను తీసుకోమంటుంది సుశీల.

అందులో మూడు ముడుపులు ఉంటాయి. భార్య చేతిలో పెట్టి ముడుపు కట్టాలని, మన ఊరి సంతాన లక్ష్మీ గుడిలో ఈ ముడుపులు కడతారు. ఏడాది తిరిగేసరికల్లా ముగ్గురు పిల్లలను కంటారు అని సుశీల అంటుంది. నేను ఇంకెప్పుడైనా కడతానని మనోజ్ అంటే.. ఇప్పుడే కట్టమని బాలు, సుశీల అంటారు. ముగ్గురు అన్నదమ్ములు ముడుపులు కడతారు.

ఇంకెన్ని రహస్యాలు దాచిందో

ప్రభావతి అక్షింతలు వేస్తుంది. ఇక నేను బయలుదేరుతాను, ఈ ముడుపులు నా బ్యాగ్‌లో పెట్టరా అని సుశీల అంటుంది. సుశీలను పట్టుకుని రోహిణి ఏడుస్తుంది. రోహిణిని కంటతడి పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదేరా అని మనోజ్‌తో అంటుంది సుశీల. అందరికీ చెప్పి సుశీల వెళ్లిపోతుంది. రోహిణి షాప్‌లో అడుగుపెట్టనివ్వకూడదని ఆలోచిస్తుంది ప్రభావతి.

మనోజ్ వస్తాడు. నువ్వు దాంతో మాట్లాడకూడదని ప్రభావతి అంటుంది. పైనుంచి రోహిణి చూస్తుంది. అది ఇంకా ఎన్ని రహస్యాలు దాచిందో, దాని గుట్టంతా బయటపడేవరకు దానితో మాత్రం మాట్లాడకని ప్రభావతి అంటుంది. అన్నింటికి మనోజ్ సరేనంటాడు. ఇప్పటివరకు అమ్మమ్మ చెప్పింది ఏంటీ, ఆవిడ మాటకు విలువ లేదా అని మీనా అంటుంది.

భార్యాభర్తల మధ్యకు ఎందుకు వెళ్తున్నారు. మళ్లీ మొదటికి ఎందుకు వచ్చారు అని అత్తను నిలదీస్తుంది మీనా. మనోజ్ షాప్‌కు వెళ్తానంటే నీదేగా షాప్ లేట్‌గా వెళ్తే ఏంటటా.. అని ప్రభావతి అంటుంది. ఈయన బతుకు ఈ జన్మకి గంగిరెద్దే అని మీనా మనసులో అనుకుంటుంది. ఇంకెప్పుడు షాపుకు రావొద్దని నీ మాటగా చెప్పు. నా ముందే చెప్పమని పట్టుబడుతుంది ప్రభావతి.

మొహం పగిలిపోతుంది

దాంతో రోహిణిని పిలిచి షో రూమ్‌కి ఏరోజు రాకని చెబుతాడు. కారణం ఏంటని రోహిణి అంటుంది. నీకు తెలియదా, మొహం పగిలిపోతుందని, ఇకనుంచి లెక్కలన్నీ వాడే చూసుకుంటాడు, నీ దగ్గరున్న అకౌంట్స్ వాడికి అప్పజెప్పు అని ప్రభావతి ఆర్డర్ వేస్తుంది. మనోజ్ వెళ్లిపోతాడు. మీనాను కోపంగా చూసి వెళ్లిపోతుంది రోహిణి. తను తప్పు చేసి నన్ను కోపంగా చూసి వెళ్తాదేంటని మీనా అనుకుంటుంది.

రూమ్‌లోకి వెళ్లి నేనేం తప్పు చేశాను. మీరేం అబద్ధాలు చెప్పలేదా. డబ్బు కోసం, ఆస్తి కోసం కకృత్తి పడే ఆఫ్ట్రాల్ ప్రభావతి. శవాల మీద చిల్లర ఏరుకునే మీరు మీ మొహము.. మీరు నన్ను అంటున్నారు. ఇంతకన్నా జోక్ లేదు. నేను లేకుంటే షో రూమ్‌నే లేదు. నేను ఎక్కడ కాలు పెట్టాలి. నీ పీకమీద కాలు పెట్టాలా అని అద్దంలో చూస్తూ కోప్పడుతుంది రోహిణి.

ఇంతలో రోహిణి తల్లి సుగుణ కాల్ చేస్తుంది. సుగుణ మీద అనవసరంగా కోప్పడుతుంది. ఈరోజు నా పుట్టినరోజు కదమ్మా అని సుగుణ చెబితే ఒక్కసారిగా రోహిణి కన్నీళ్లు పెట్టుకుంటుంది. తన తల్లి చనిపోయినట్లు ఇంట్లో చెప్పింది గుర్తు చేసుకుని బాధపడుతుంది. హ్యాపీ బర్త్ డే అమ్మా అని రోహిణి అంటుంది. నన్ను క్షమించమ్మా అని రోహిణి అంటుంది.

సుగుణ పుట్టినరోజు

అంతగా గుర్తు పెట్టుకునేంతగా నేను ఏం చేశాను. నిన్ను చూడాలని ఉందని సుగుణ అంటుంది. నాకు కూడా మీ ఇద్దరిని చూడాలని ఉందని, వస్తానని, గుడికి వెళ్లి రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేద్దామని రోహిణి అంటుంది. బాలు ప్యాసెంజర్‌ను దించి ఓ చోట ఆగుతాడు. అక్కడికే మురళి వస్తాడు. మురళి లవ్ గురించి అడుగుతాడు బాలు. జరిగింది చెబుతాడు.

తను బాధపడుతుంటే చూల్లేక ఇదంతా డ్రామా అని నిజం చెప్పేసాను. దాంతో కొట్టేసిందని మురళి అంటాడు. ఏదైనా మీటర్ దాటితే ఇలాగే ఉంటుందని బాలు అంటాడు. నీకు ఏం కాకూడదనే భయంతోనే కొట్టింది. సొంత మనిషి అనుకునే కొట్టింది. నువ్వు పుట్టినరోజు ఈరోజు చేసుకుంటే తప్పేంటీ అని మరో ప్లాన్ ఇస్తాడు బాలు.

ఐడియా అదిరిందని మురళి వెళ్తాడు. మరోవైపు తల్లిని అనవసరంగా తిట్టానని, అంతా అత్త వల్లే అని ప్రభావతిపై కోపంతో రగిలిపోతుంది రోహిణి. తర్వాత విద్యకు కాల్ చేస్తుంది. అత్తింట్లో జరిగింది, ఎక్కడికి వెళ్లకూడదని చెప్పారని రోహిణి చెబుతుంది. ఎక్కడికి వెళ్లనివ్వకుండా నీ ఒక్కదానికే లాక్‌డౌన్ ప్రకటించారన్నమాట అని విద్య అంటుంది.

కండీషన్స్‌తో రోహిణి లైఫ్

నీ లైఫ్ కండీషన్స్‌తో వెళ్తుందన్నమాట అని విద్య అంటుంది. నన్ను హౌజ్ అరెస్ట్ చేస్తుందని బాధపడుతుంటే నువ్వేంటే తిరిగి దెప్పి పొడుస్తున్నావ్ అని రోహిణి బాధపడుతుంది. మనోజ్ మెల్లిగా అర్థం చేసుకుంటాడని, తనను నీ కంట్రోల్‌లో పెట్టుకోవడం గురించి ఆలోచించమని విద్య అంటుంది. నా దగ్గర ఓ దారి ఉంది ప్రయత్నిస్తానని రోహిణి అంటుంది.

మరోవైపు షాప్‌లో కల్పనను నమ్మితే డబ్బులు తీసుకుని కెనడా పారిపోయింది, రోహిణిని నమ్మితే మలేషియా పేరు చెప్పి మోసం చేసింది. నాకు తగిలేవాళ్లంతా ఇలా ఉన్నారేంటీ, ఇలా అయిపోయిందేంటీ నా బతుకు అని మనోజ్ అనుకుంటాడు. ఇంతలో సేల్స్ మ్యాన్ వచ్చి మేడమ్ వస్తే కొత్త స్టాక్ ఆర్డర్ చేయాలన్నారు, మీకు తెలియదులేండి, మేడమ్‌కు ఫోన్ చేయండని అతను అంటాడు.

నా షాప్ గురించి నాకు తెలియదా అని మనోజ్ అడిగితే.. మన షాప్‌లో ఎన్ని బెడ్స్ ఉన్నాయో టక్కున చెప్పండని సేల్స్ మేన్ అంటాడు. దాంతో మనోజ్ ఆలోచిస్తాడు. తెలియదు కదా. ఇదే మేడమ్ అయితే అన్ని టకాటకా చెబుతారు. నిజానికి మీకు ఏం తెలియదు. అది ఒప్పుకోడానికి ఇగో ఒప్పుకోదని అతను అంటాడు. దాంతో అతన్ని తిట్టి మనోజ్ పంపిస్తాడు.

రోహిణి ఇన్సూరెన్స్ స్కెచ్

ఇంతలో ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి పాలసీ తీసుకోమంటాడు. మనోజ్ వద్దంటాడు. కోప్పడుతాడు. మీరు ఇలా కోప్పడితే పాలసీ తీసుకునేలోపే పైకి పోతారు, ఇన్సూరెన్స్ క్లైమ్ కూడా కాదంటాడు. నా పేరు మీద ఇన్సూరెన్స్ కట్టి నేను పైకి పోతే ఆ డబ్బు రోహిణి తీసుకుందామని ప్లాన్ చేసిందా అని మనోజ్ అంటాడు.

కాదు.. మేడమ్ మీ పేరు మీద తీసుకుంది హెల్త్ ఇన్సురెన్స్. మీరు అనుకోకుండా అనారోగ్యపాలు అయితే డబ్బు బారం కాకూడదని, మీ గురించి ఆలోచించి మీకోసం తీసుకున్నారు. మీ మీద మేడమ్‌కు చాలా కేరింగ్ ఉంది. తనకు అవసరం లేదని తన భర్తే ముఖ్యమని మీ పేరు మీద ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ తీసుకున్నారని ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటాడు.

దాంతో మనోజ్ ఆలోచనలో పడతాడు. అయితే, ఇది రోహిణి తనపై మనోజ్‌కు ప్రేమ తిరిగి పుట్టేందుకు వేసిన ఇన్సూరెన్స్ స్కెచ్ అని తెలుస్తోంది. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More