Gunde Ninda Gudi Gantalu: సుశీల పంచాయతీ- ఇంకెప్పుడు మోసం చేయనని రోహిణి దొంగ ప్రమాణం- ఆ వెంటనే మరో బాంబు పేల్చిన రోహిణి

Gunde Ninda Gudi Gantalu Serial August 12th Episode Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 12వ తేది ఎపిసోడ్ ప్రోమోలో రోహిణి విషయంపై పంచాయతీ పెడుతుంది సుశీల. అత్తముందే కోడలిని చితకబాదుతుంది ప్రభావతి. ఇంకెప్పుడు మోసం చేయనని హారతిని ఆర్పి ప్రమాణం చేయమని సుశీల అంటే రోహిణి దొంగ ప్రమాణం చేస్తుంది.

Published on: Aug 11, 2026, 16:00:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Gunde Ninda Gudi Gantalu Serial Episode Promo: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో తల్లి సుశీలను ఇంటికి తీసుకొస్తాడు సత్యం. మనోజ్‌ను తిట్టి రోహిణి కాల్ చేయమని చెబుతుంది సుశీల. మనోజ్ కాల్ చేసిన రోహిణి లిఫ్ట్ చేయదు. బాలు తన ఫోన్ నెంబర్ నుంచి కాల్ చేయమంటాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రోమో
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రోమో

నా తల ఎత్తుకోనివ్వకుండా చేసింది

కానీ, సుశీల వద్దంటుంది. మనోజ్ ఫోన్ నుంచే కాల్ చేయాలని సుశీల అంటుంది. మరి నీ భార్య సంగతి ఏంట్రా అని సత్యంను అడుగుతుంది సుశీల. ముందు రోహిణి రానివ్వు, వచ్చాక తనను రమ్మంటాను. లేకుంటే ఇప్పుడే రానివ్వకుండా చేస్తుందని సత్యం అంటాడు. నేనుండగా అలా జరగనిస్తానా. నువ్వైతే కాల్ చేసి రమ్మను అని సుశీల అంటుంది.

ప్రభావతికి సత్యం కాల్ చేసి ఇంకా ఎన్ని రోజులు అక్కడుంటావ్ అని అడుగుతాడు. నా ఇంట్లో నా తల ఎత్తుకోనివ్వకుండా చేసింది అది అని రోహిణిని తిడుతుంది ప్రభావతి. రోహిణి ఇంటి కోడలు. అలా వదిలేయలేం కదా. అన్ని సమస్యలు తీర్చడానికే మా అమ్మ వచ్చింది. నిన్ను రమ్మంటుంది అని సత్యం అంటాడు.

రోహిణిని ఇంటికి పిలిచిన మనోజ్

అత్తయ్య ఎప్పుడొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు అని ప్రభావతి అడిగితే.. నేనే తీసుకొచ్చాను. త్వరగా ఇంటికి రా అని సత్యం అంటాడు. సరేనని ప్రభావతి అంటుంది. మనోజ్ మళ్లీ కాల్ చేయడంతో రోహిణి లిఫ్ట్ చేస్తుంది. నానమ్మ వచ్చిందని, నీతో మాట్లాడాలని అంటుందని మనోజ్ చెబుతాడు. దేని గురించి అని రోహిణి అంటుంది.

హా నువ్వు చేసినదాని గురించి, త్వరగా ఇంటికి రమ్మని పిలుస్తాడు మనోజ్. దాంతో రోహిణి సరేనని అంటుంది. సత్యం ఇంటికి అత్తా ప్రభావతి, కోడలు రోహిణి ఒకేసారి వస్తారు. ఇద్దరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఇంట్లోకి వెళ్తారు. సత్యం ఇంట్లో అందరికి సుశీల పంచాయితీ చెబుతుంది. అందరిముందు రోహిణి చేసిన తప్పుల గురించి చెబుతూ తిడుతుంది ప్రభావతి.

బలమైన కారణం ఉంటుందిగా

సరే నీ కోడలు తప్పు చేసింది. అబద్ధాలు చెప్పింది. అందుకు ఏదో బలమైన కారణం ఉంటుంది కదా అని సుశీల అంటుంది. మోసం చేయడం దాని నైజం అని అర్థమయ్యాక కారణం ఎలా అడగాలి అత్తయ్య అని ప్రభావతి అంటుంది. మనోజ్‌ను వదులుకోలేకే అత్తయ్యకు అబద్ధం చెప్పినట్లు రోహిణి నిజం ఒప్పుకుంటుంది. దాంతో కోటీశ్వరుడి కూతురున్న ఒకే ఒక్క మాట పట్టుకుని కనీసం తల్లిదండ్రులు ఎవరో చూల్లేదు అని ప్రభావతిదే తప్పు అన్నట్లుగా అత్త సుశీల అంటుంది.

అత్తయ్య రోహిణిని బాగా నమ్మారు. రోహిణి కూడా బాగా నమ్మించింది అని మీనా అంటుంది. కామాక్షి అత్త మేకప్ వేసుకున్నట్లు అబద్ధానికి అందంగా మేకప్ వేయకూడదు. ఆ మేకప్ ఏదో ఒకరోజు ఇలా బయటకు పోతుందని బాలు అంటాడు. దాంతో కుర్చీలోనుంచి లేచి.. ఏమే దరిద్రపుగొట్టుదానా.. నిన్ను నా ఎదురుగా చూస్తుంటే.. నా ఒళ్లు భగభగ మండిపోతుందే అని రోహిణిని కొడుతుంది.

అత్తముందే కోడలిని బాదిన ప్రభావతి

అత్తముందే కోడలు రోహిణిని ఎడాపెడా వాయిస్తుంది ప్రభావతి. దానికి అంతా షాక్ అవుతారు. ప్రభావతిని ఆపుతారు. ప్రభావతిపై సుశీల సీరియస్ అవుతుంది. నేనుండగా అలా చేయి చేసుకుంటావా. నేను వచ్చింది ఎందుకు అందరికి సర్ది చెప్పడానికేగా అని అంటుంది. దీనంతటికి పరిష్కారం చెబుతానంటుంది సుశీల.

రోహిణి చేసిన తప్పును ఒప్పుకుని ఇంకెప్పుడు మోసం చేయనని హారతి మీద ప్రమాణం చేయమని సుశీల అంటుంది. హారతి ఆర్పి ఇంకెప్పుడు మోసం చేయనని, అబద్ధాలు చెప్పనని రోహిణి దొంగ ప్రమాణం చేస్తుంది. తర్వాత జరిగింది కవర్ చేసుకుంటూ చెబుతుంది.

పార్లర్ అమ్మేశాను

మరి తాకట్టు నుంచి ఇల్లు విడిపించడానికి అన్ని లక్షలు ఎలా వచ్చాయి వదినా అని రవి అడుగుతాడు. పార్లర్ అమ్మేశాను అని రోహిణి నిజం చెబుతుంది. దానికి సత్యం ఫ్యామిలీ షాక్‌తో అవాక్కవుతుంది. ఇంకా ఎన్ని బాంబులు వేస్తావే.. అసలు నువ్వు ఆడదానివేనా.. అని మరింత చిర్రెత్తిపోతుంది ప్రభావతి.

ఇంతేనా ఇంకేమైనా దాచిందా అని సత్యం కూడా డౌట్‌గా అడుగుతాడు. మనోజ్‌ను అడగమన్నట్లుగా సత్యం అంటాడు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More