Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ఇంట్లో రోహిణి కష్టాలు.. అరుణ్, సుమతి ప్రేమాయణం.. రోహిణి విషయంలో మనోజ్ కు ప్రభావతి నూరిపోయడంలాంటి సీన్లతో సాగిపోయింది. అయితే అన్నింటి కంటే అరుణ్, సుమతిలను చూసి మీనా నిలదీయడమే హైలైట్ అని చెప్పొచ్చు.
మనోజ్‌ను లొంగదీసుకోవడానికి రోహిణి అస్త్రాలు

మనోజ్ ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి వేసే ఎత్తుగడలతో సీరియల్ ఆదివారం (ఆగస్ట్ 16) ఎపిసోడ్ మొదలైంది. మనోజ్ పై వరుసగా అస్త్రాలు సంధిస్తుంది రోహిణి. మొదట ఓ పంతులుగారిని పంపించి ధన్వంతరి యాగం చేయించామని, ఆ భస్మం ఇవ్వడానికి వచ్చానని చెప్పిస్తుంది. మీకు కళ్లకు సర్జరీ జరిగినప్పుడే ధన్వంతరం యాగం చేయాలని రోహిణి చెప్పిందని, ఈ రోజు మంచి రోజు కావడంతో చేయించి భస్మం తీసుకొచ్చినట్లు ఆ పంతులు చెబుతాడు. అలాంటి భార్య దొరకడం మీ పూర్వజన్మ సుకృతం అని అంటాడు.
బయటకు వెళ్లిన తర్వాత ఆయన రోహిణికి ఫోన్ చేసి చెప్పినట్లే చేశానని అంటాడు. ఇక ఆయన వెళ్లిపోయిన తర్వాత షాపులో పనివాళ్లతో మరో అస్త్రం సంధిస్తుంది. షాపు ప్రమోషన్లు చేస్తున్నామని, దానికోసం మేడమ్ వారం రోజుల కిందే పాంప్లెట్లు వేయించారని అంటారు. అది చూసి మనోజ్ లోలోపల మరింత సంతోషిస్తాడు.
ఇంట్లో రోహిణి వంట.. ప్రభావతి పనిష్మెంట్..
మరోవైపు ఇంట్లో రోహిణి కష్టాలు అన్నీఇన్నీ కావు. అత్త ప్రభావతి పనిష్మెంట్ మేరకు ఆమె కిచెన్ లోకి వస్తుంది. అది చూసిన మీనా ఇదేంటని అడిగితే ఇక నుంచి తన వంట తననే చేయించుకోమన్నారని అత్తయ్య చెప్పినట్లు చెబుతుంది. కానీ ఉప్పుకీ, పంచదారకీ తేడా తెలియకుండా ఆమె చేస్తున్న వంట చూసి మీనా జాలి పడుతుంది. అప్పుడే శృతి కూడా అక్కడికి వస్తుంది.
రోహిణిని చూసి ఆడుకుంటుంది. ఒకప్పుడు నిన్ను నెత్తి మీద పెట్టుకున్న అత్తయ్య ఇప్పుడిలా చేయిస్తోందా అని అంటుంది. దీన్నే తలరాత అంటారు.. అయినా రోహిణి చేసిన తప్పులన్నీ నీకే దొరికాయి చూశావా మీనా.. పెళ్లిలో మేక మామ దొరికిపోవడం ఏంటి.. అంతకుముందు కల్పన కూడా అలాగే బాలు కారులో వెళ్లి దొరకడంతో ఆ డబ్బుల విషయం బయటపడింది.. దీన్నే విధి అంటారు అని శృతి అంటుంది.
ఆడుకున్న శృతి.. ఇంకేదో దాస్తున్నావంటూ..
{{/usCountry}}రోహిణిని చూసి ఆడుకుంటుంది. ఒకప్పుడు నిన్ను నెత్తి మీద పెట్టుకున్న అత్తయ్య ఇప్పుడిలా చేయిస్తోందా అని అంటుంది. దీన్నే తలరాత అంటారు.. అయినా రోహిణి చేసిన తప్పులన్నీ నీకే దొరికాయి చూశావా మీనా.. పెళ్లిలో మేక మామ దొరికిపోవడం ఏంటి.. అంతకుముందు కల్పన కూడా అలాగే బాలు కారులో వెళ్లి దొరకడంతో ఆ డబ్బుల విషయం బయటపడింది.. దీన్నే విధి అంటారు అని శృతి అంటుంది.
ఆడుకున్న శృతి.. ఇంకేదో దాస్తున్నావంటూ..
{{/usCountry}}దీంతో రోహిణికి మరింత మండుతుంది. తప్పులు వెతికే వాళ్లకు అన్నీ అలాగే కనిపిస్తుంటాయని రోహిణి అంటే.. మాకు అంత సరదా ఏమీ లేదు.. నువ్వు చేసిన తప్పులే చూపించాం తప్ప కల్పించి చెప్పలేదు కదా అని మీనా గట్టి సమాధానం ఇస్తుంది.
అసలు ఇందులో చాలా ఫన్నీ విషయం ఏంటంటే.. మటన్ కొట్టు మాణిక్యాన్ని మలేషియా మామగా పరిచయం చేయడం.. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగులు అన్నీ నువ్వేనా అని శృతి మరింత ఆట పట్టిస్తుంది. ఇక చాలు అని శృతితో రోహిణి అంటే ఇంకో రెండు మాటలు అంటూ.. ఇంకా నువ్వేదో దాస్తున్నావని అంటుంది. అంతేకాదు నీ విషయాలన్నీ మనోజ్ కు ముందే తెలుసన్నది కూడా అబద్ధమే అని శృతి అనడంతో రోహిణి రుసరుసలాడుతూ వెళ్లిపోతుంది.
అరుణ్ బర్త్‌డే.. గుడిలో సుమతికి లవ్ ప్రపోజల్
మరోవైపు గుడికి వస్తుంది సుమతి. దర్శనం తర్వాత బయటకు వచ్చి అరుణ్ కోసం వెయిట్ చేస్తుంది. ఇవాళ తన బర్త్ డే అని చెప్పి గుడికి రమ్మన్నాడు.. ఇంకా రాలేదు అని అనుకుంటుంది. ఇంతలో అరుణ్ వస్తాడు. అతనికి సుమతి బర్త్ డే విషెస్ చెబుతుంది. ఇదే అదునుగా తన మనసులో మాట బయటపెడతాడు అరుణ్. ఏదో ఒక రోజు నన్ను శ్రీవారు అని పిలిచి, నా ఇంట్లో దీపం పెడతావనుకుంటున్నాను అని అరుణ్ అంటాడు. నేను ఇంకా ఏమీ చెప్పకుండానే అంత వరకూ వెళ్లిపోయారేంటి అని సుమతి అంటుంది.
అంటే నేనంటే ఇష్టం లేదా.. అయితే క్షమించండి.. మళ్లీ మిమ్మల్ని ఇంకెప్పుడూ కలవను అంటూ అరుణ్ వెళ్లిపోతుంటే ఇష్టమే అని సుమతి అంటుంది. కానీ ప్రేమించాలా వద్దా అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేకపోతున్నానని అంటుంది. ఎందుకని అరుణ్ అడిగితే.. ప్రేమించుకోవడానికి ఇద్దరం చాలు.. పెళ్లికి రెండు కుటుంబాలు కావాలి.. మా ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారో లేదో అని సుమతి అంటుంది. మీ ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారన్న నమ్మకం తనకుందని అరుణ్ చెబుతాడు.
బాలు నుంచి కొద్దిలో తప్పించుకున్న అరుణ్, సుమతి
కనీసం ఇష్టం ఉందని అయినా చెప్పారు.. అదే నా బర్త్ డే గిఫ్ట్ అనుకుంటాను.. ఈ సందర్భంగా నేను ట్రీట్ ఇద్దామనుకుంటున్నాను.. అలా వెళ్లొద్దామని అరుణ్ అడుగుతాడు. అప్పుడే బాలు అక్కడికి వస్తాడు. దూరంగా కారు ఆపుతాడు. ఓ కస్టమర్ కు ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు. ఇటు సుమతి సరే అంటూ అరుణ్ బైకు వైపు వెళ్తుంది. ఇద్దరూ బైకుపై బయలుదేరుతారు. అప్పుడే కస్టమర్ రావడంతో బాలు కూడా వీళ్లను చూడకుండా వెళ్లిపోతాడు. దీంతో తృటిలో పెద్ద ప్రమాదం నుంచి అరుణ్, సుమతి బయటపడతారు.
రోహిణిని పట్టించుకోని మనోజ్
ఇటు ఇంటికి వచ్చిన మనోజ్.. గదిలో ఒంటరిగా కూర్చొని రోహిణి తన కోసం చేసిన పనుల గురించ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రోహిణి వస్తుంది. తన కోసమే ఆలోచిస్తున్నాడనుకుంటా అని దగ్గరికి వెళ్లి కూర్చొంటుంది. మనోజ్ భుజంపై చేయి వేసి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది.
కానీ మనోజ్ మాత్రం చిరాగ్గా ఆమె చేయిని విసిరి కొట్టి తాను బయట పడుకుంటానని గదిలో నుంచి వెళ్లిపోవడానికి రెడీ అవుతాడు. రోహిణి నిలదీయడంతో.. నువ్వు నాకోసమే పుట్టావని ప్రేమించిన సమయంలో అనుకున్నాను కానీ నువ్వేం చేశావ్.. అసలు మాట్లాడొద్దనే అనుకున్నాను.. నా ప్రమేయం లేకుండా మాట్లాడాను అని చెప్పి మనోజ్ వెళ్లిపోతాడు.
మనోజ్‌కు నూరిపోసిన ప్రభావతి
మనోజ్ పైన పడుకోబోతుంటే.. ప్రభావతి పిలుస్తుంది. నువ్వెందుకు బయట పడుకుంటావ్.. నువ్వు మగాడివి.. నువ్వు గదిలో మంచంపై పడుకో.. అది కింద పడుకుంటుంది అని అతనికి నూరిపోస్తుంది. అప్పుడే బాలు కూడా అక్కడికి వచ్చి తనదైన స్టైల్లో కొన్ని పంచ్ డైలాగులు వేస్తాడు.
ప్రభావతి చెప్పినట్లే మళ్లీ గదిలోకి వెళ్తాడు మనోజ్. నేను గదిలో ఉండాలంటే నువ్వు నా పక్కన పడుకోకూడదు అని చెప్పి మంచంపై పడుకుంటాడు మనోజ్. ఇది నీ మాటా.. మీ అమ్మ మాటా అని రోహిణి అడిగినా పట్టించుకోడు.
రోహిణితో ఆడుకున్న ప్రభావతి
అటు రోహిణి శృతి ఇచ్చిన ఇఫర్ తో ఓ పెళ్లికి వెళ్లి మేకప్ వేసి ఇంటికి వస్తుంది. అక్కడే ఉన్న ప్రభావతి ఎక్కడికెళ్లావని నిలదీస్తుంది. మేకప్ వేసి వస్తున్నానని చెబుతుంది. ఎంత ఇచ్చారని అడిగితే రూ.25 వేలు అని అంటుంది. ఆ డబ్బు ఇవ్వమని ప్రభావతి ఆమె బ్యాగు లాక్కొంటుంది. అకౌంట్లో వేస్తామని చెప్పారని రోహిణి అంటుంది. డబ్బు పడగానే చెప్పు.. నేను విత్ డ్రా చేసుకుంటానంటూ ఆమె డెబిట్ కార్డు లాక్కొంటుంది.
సుమతిని నిలదీసిన మీనా
అటు అరుణ్ తో బైకుపై షికార్లు చేసి ఇంటికి వస్తుంది సుమతి. అప్పుడే అక్కడికి వచ్చిన మీనా ఆ ఇద్దరినీ చూస్తుంది. సుమతికి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇవాళ నువ్వు బస్సులోనే వచ్చావా అని అడుగుతుంది. నిజం తెలిసిపోవడంతో సుమతి కంగారు పడుతుంది. మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారా అని కూడా అడుగుతుంది. కానీ సుమతి ఏమీ సమాధానం చెప్పదు. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.