...
...
Next Story

Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్ షాపులో అపరిచితుడు.. లేడీ కేడీ రోహిణియే టార్గెట్.. బాలుకి తెలిసిన సీక్రెట్

Gunde Ninda Gudi Gantalu Serial August 19th Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ 19 ఎపిసోడ్ లో రోహిణికి మంచి చేయాలని చూసిన బాలుకి షాక్ తగులుతుంది. అటు మనోజ్ షాపుకి వచ్చిన ఓ అపరిచితుడు లేడీ కేడీ రోహిణిని టార్గెట్ చేస్తాడు.

Published on: Aug 19, 2026, 07:13:17 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ మనోజ్, రోహిణి.. వాళ్లను కలిపేందుకు ఇంట్లో వాళ్లు చేసే ప్రయత్నం చుట్టూ తిరిగింది. అయితే చివర్లో మనోజ్ షాపుకి భారీ ఆర్డర్ అంటూ వచ్చే ఓ అపరిచితుడు లేడీ కేడీ రోహిణి గురించి బాలుకి తెలియని సీక్రెట్ చెబుతాడు.

రోహిణి గురించి మనోజ్‌కు చెప్పిన రవి, బాలు, మీనా, శృతి..

Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్ షాపులో అపరిచితుడు.. లేడీ కేడీ రోహిణియే టార్గెట్.. బాలుకి తెలిసిన సీక్రెట్
Gunde Ninda Gudi Gantalu Today Episode: మనోజ్ షాపులో అపరిచితుడు.. లేడీ కేడీ రోహిణియే టార్గెట్.. బాలుకి తెలిసిన సీక్రెట్

రోహిణి తన జీవితంలోకి వచ్చిన తర్వాతే మనోజ్ జీవితం మారిపోయిందంటూ బాలు, మీనా, రవి, శృతి అతనికి చెప్పే సీన్ తో సీరియల్ బుధవారం (ఆగస్ట్ 19) ఎపిసోడ్ మొదలైంది. రోహిణి విషయంలో ప్రభావతి ఎంత దారుణంగా ప్రవర్తిస్తోందో మనోజ్ కు వివరిస్తారు.

బలవంతంగా ఏటీఎం లాక్కుందని, రోహిణి సంపాదన తీసుకునే హక్కు ఆమెకు లేదని చెబుతారు. ఆమెకు నీకు ఎంతో సాయం చేసిందని, ఇలాంటి కష్ట కాలంలో ఓ భర్తగా రోహిణికి నువ్వే అండగా నిలవాలని, అమ్మని ఈ విషయంలో నిలదీయాలని బాలు, రవి చెబుతారు.

అమ్మను, నన్ను విడదీయాలని చూస్తున్నారా అన్న మనోజ్

కానీ వాళ్లు చెప్పిదంతా విన్న మనోజ్ వాళ్లకే ఎదురు తిరుగుతాడు. తనకు టాలెంట్ లేదని అంటున్నారా.. అయినా ఇలాంటివి చెప్పి అమ్మను, నన్ను విడదీయాలని చూస్తున్నారా? అమ్మ ఏ పని చేసినా అందుకు ఓ బలమైన కారణం ఉంటుంది అంటూ ప్రభావతికి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు.

దీంతో బాలుకి ఆవేశం వస్తుంది. అమ్మకు, నీకు మధ్య ఎంత బలమైన బంధం ఉందో మాకు తెలియదా.. మిమ్మల్ని విడదీస్తే విడిపోతారా.. ఏదో రోహిణి తరఫున ఎవరూ మాట్లాడేవాళ్లు లేరు అని నీకు చెబితే ఇలా అంటావా.. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లు.. లేదంటే ఏం చేస్తానో నాకు తెలియదు అంటూ మనోజ్ పై విరుచుకుపడతాడు. అయినా అతడు వెళ్లకపోవడంతో చివరికి కొట్టబోతాడు. దీంతో మనోజ్ పారిపోతాడు.

ప్రభావతిని ఇరికించేందుకు బాలు సూపర్ ప్లాన్.. ఏటీఎం పంచాయతీ

అందరూ అందులో తమ ఏటీఎం కార్డులు వేయాలంటూ మొదట, తనది, మీనా కార్డులు వేస్తాడు. తర్వాత రవి, శృతి కూడా వేస్తారు. సత్యంను కూడా వేయమంటే అసలేం జరిగిందని అతడు అడుగుతాడు.దీంతో జరిగిన విషయం బాలు చెబుతాడు. రోహిణి ఏటీఎం కార్డు అమ్మ తీసుకుంది.. ఆమె సంపాదించిన సొమ్ము ఎలా వాడుకుంటుంది.. అని అంటాడు.

తల్లికి మనోజ్ సపోర్ట్.. రోహిణికి షాక్

దీంతో సత్యం కూడా ప్రభావతిని తిడతాడు. అసలు నీకు బుద్ధుందా.. కోడళ్లు సంపాదించింది నువ్వు ఎందుకు తీసుకుంటావు.. అయినా ఆమె నెల నెలా ఇంటి ఖర్చులకు ఇస్తోంది కదా అంటూ క్లాస్ పీకుతాడు. తానేమీ ఆమె డబ్బు వాడుకోవడానికి తీసుకోలేదని, ఇంత మోసం చేసిన వ్యక్తి షాపులో ఎంత గోల్ మాల్ చేస్తుందో అని అకౌంట్లో డబ్బులు ఎన్ని ఉన్నాయో చెక్ చేయడానికి తీసుకున్నానని ప్రభావతి అంటుంది.

ఇంత జరుగుతున్నా మనోజ్ మాత్రం ఏమీ మాట్లాడడు. చివరికి బాలు నిలదీయడంతో మనోజ్ కూడా ప్రభావతికే సపోర్ట్ చేస్తాడు. అమ్మ ఏం చేసినా కరెక్టే.. నమ్మకం కోల్పోయిన వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో ఆమెకు బాగా తెలుసంటూ రోహిణి గురించి పరోక్షంగా అంటాడు.

బాలుకి ఎదురు తిరిగిన రోహిణి.. ప్రభావతికి సపోర్ట్..

అయితే బాలు అనుకున్నది ఒకటి.. అక్కడి జరిగేది మరొకటి అవుతుంది. చివరికి రోహిణి కూడా బాలుకి ఎదురు తిరుగుతుంది. ప్రభావతికే సపోర్ట్ చేస్తుంది. అత్తయ్య ఏ తప్పూ చేయలేదు.. నా ఏటీఎం కార్డు మనస్ఫూర్తిగా ఇచ్చాను.. ఇక నుంచి సంపాదించింది మొత్తం ఆమెకే ఇస్తాను.. అయినా నువ్వు నా కాపురంలో మంట పెట్టి దానితో చలి కాచుకోవాలని చూస్తున్నావని బాలుని నిందిస్తుంది.

దీంతో బాలు కంగు తింటాడు. అసలు ఏం జరుగుతోంది.. నేను ఏం చెప్పాను.. ఆమె ఏం మాట్లాడుతోంది.. నాకు గాలి కనిపిస్తోంది.. మీనా నీకు కూడా కనిపిస్తోందా అంటూ పిచ్చి పట్టిన వాడిలా మాట్లాడతాడు. మరొకరికి మంచి చేయాలని చూస్తే జరిగేది ఇదే అంటూ మీనా అతన్ని తీసుకెళ్లిపోతుంది.

ట్రిపుల్ రైడింగ్ చేస్తూ అరుణ్‌కు దొరికిపోయిన మీనా.. రూ.500 ఫైన్

ఆ తర్వాత మీనా తన ఫ్రెండ్ అనూషతో కలిసి బయటకు వెళ్తుంది. ఆమెతూ మాట్లాడుతూ స్కూటీపై వెళ్తుండగా.. మీనాకు తన పూల ఫ్రెండ్ కనిపిస్తుంది. తనను ముందు బస్టాప్ వరకు డ్రాప్ చేయాలని ఆమె అడుగుతుంది. ముగ్గురం ఎక్కితే పోలీసులు పట్టుకుంటారు అని మీనా వారిస్తున్నా.. ఈ రూట్ లో ఎవరూ ఉండరంటూ ఆమె ఎక్కుతుంది. కొంత దూరం వెళ్లగానే ట్రాఫిక్ పోలీసులు ఉంటారు. వాళ్లలో అరుణ్ కనిపిస్తాడు. దీంతో మీనా షాక్ తింటుంది. తనతో గొడవ పడిన పోలీసు ఇతడు.. ఇక వదలడు అని అనుకుంటుంది.

కానిస్టేబుల్ స్కూటీ కీస్ తీసుకోబోతే అరుణ్ వద్దని వారిస్తాడు. ముగ్గురు ఎక్కడం తప్పని తెలియదా.. రూ.500 ఫైన్ కట్టండి అని అంటాడు. ఇలాగే తప్పులు చూపిస్తూ డబ్బు వసూలు చేస్తూ ఉంటాడంటూ తన ఫ్రెండ్స్ తో మీనా చెబుతుంది. తానేమీ అన్యాయంగా డబ్బు వసూలు చేయడం లేదని, ఫైన్ వేస్తున్నానని అరుణ్ అంటాడు. అయినా నువ్వా రౌడీ డ్రైవర్ భార్యవే కదా అని అడుగుతాడు. దీంతో మీనా కోపంతో ఆయన డ్రైవర్ మాత్రమే రౌడీ కాదు అని అంటుంది. ఆయన టాపిక్ అనవసరం.. నీకు ఫైన్ కడితే సరిపోతుంది కదా అని మీనా ఫైన్ కట్టేసి వెళ్లిపోతుంది.

మనోజ్‌కు క్లాస్ పీకిన మణికంఠ

ఇటు షాపులో గిరాకీ లేక ఈగలు తోలుకుంటూ ఉంటాడు. అప్పుడే మణికంఠ వస్తాడు. వర్షా కాలం ఇంతే.. పార్కులో కూడా సన్న దోమలు పెరిగాయంటూ మరోసారి మనోజ్ కు అతని పార్కు జ్ఞాపకాలు గుర్తు చేస్తాడు. దీంతో మనోజ్ చిరాకు పడతాడు. నీ భార్య లేకుండా నువ్వుమీ చేయలేవు.. ఆమె వచ్చిన తర్వాతే నీ జీవితం మారిపోయింది అని మణికంఠ అంటాడు.

దీంతో ఇలా చెప్పడానికి నా భార్య దగ్గర ఎంత తీసుకున్నావు.. ఆమెకు మనుషులను కొనడం అలవాటు అని మనోజ్ అంటాడు. రోహిణి విషయంలో మనోజ్, మణికంఠ కాసేపు వాదులాడుకుంటారు.

మనోజ్ షాపులో అపరిచితుడు

ఆ తర్వాత మనోజ్ షాపుకి పెద్ద డబ్బున్న వ్యక్తిలా ఖరీదైన కారులో ఓ వ్యక్తి వస్తాడు. తనకు ఈ ఫర్నీచర్ అంతా కావాలంటూ మనోజ్ చేతిలో ఓ లిస్ట్ పెడతాడు. ఆర్డర్ ఇవ్వండి.. పంపిస్తాను అని మనోజ్ అంటాడు. కానీ రోహిణి వస్తేనే తాను ఈ ఆర్డర్ ఇస్తానని ఆ వ్యక్తి చెప్పి వెళ్లిపోతాడు.

బయటకు వెళ్లిన తర్వాత అతనికి బాలు కనిపిస్తాడు. అతడు బాలు ఫ్రెండే కావడం విశేషం. ఏదో జాబ్ కావాలని నన్ను అడిగావ్.. ఇప్పుడు చూస్తే ఇంత ఖరీదైన కారులో సూటుబూటు వేసుకొని వెళ్తున్నావ్ అని బాలు అడుగుతాడు. తనకంటే ముదురు అయిన ఓ లేడీకేడీ దగ్గర ఫర్నీచర్ కొనడానికి వెళ్తున్నానని చెబుతాడు. ఏ ఫర్నీచర్ అనగానే ప్రభావతి ఫర్నీచర్ అని ఆ వ్యక్తి చెబుతాడు. దీంతో బాలు, మీనా షాక్ తింటారు. అతడి ద్వారా రోహిణి గురించి మరో సీక్రెట్ బాలుకి తెలిసేలా కనిపిస్తుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks